వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉపఎన్నిక ఏదైన విజయం టీఆర్ఎస్‌దే.. 13 సార్లు ఉపఎన్నికల్లో పోటీ

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోంది. దీంతో ఎప్పుడు ఉప ఎన్నిక జరిగినా విజయం మాత్రం మాదే అనే దీమాతో ఆ పార్టీ పోటీలోకి దిగుతోంది. అనుకున్నట్టుగానే ఆ పార్టీ విజయం సాధిస్తోంది. అయితే కొన్నిసార్లు డీలాపడ్డ టీఆర్ఎస్ ఎక్కువశాతం ఉపఎన్నికల్లో గెలుపును కైవసం చేసుకుంది. ఈనేపథ్యంలోనే రాష్ట్రంలో ఇప్పటి వరకు తొమ్మిది సార్లు అసెంబ్లీకి నాలుగు సార్లు లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ పాల్గోంది.

ఉప ఎన్నికల్లో పార్టీ మొదటి విజయం

ఉప ఎన్నికల్లో పార్టీ మొదటి విజయం

తెలంగాణ రాష్ట్ర సమితి 2001 ఎప్రిల్ 27న ఆవిర్భవించింది. తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రస్తుత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిప్యూటీ స్పికర్ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారు. అనంతరం జరిగిన అదే సంవత్సరం సెప్టెంబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో సీఎం కేసీర్ టీఆర్ఎస్ ప్రాస్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్ విజయం సాధించారు. అనంతరం 2004లో పోటీచేసిన టీఆర్ఎస్ 26 శాసనసభ మరియు 5 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది. అనంతరం కాంగ్రెస్ పార్టీతో పోత్తుకుంది.

తెలంగాణ ఉద్యమ కాలంలో వచ్చిన ఉపఎన్నికలు

తెలంగాణ ఉద్యమ కాలంలో వచ్చిన ఉపఎన్నికలు

అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ మాట మార్చిందని అధికారం నుండి వైదోలిగింది, ఇందుకు నిరసనగా సీఎం కేసీఆర్ ఒక్కరే మరోసారి రాజీనామా చేశారు. అనంతరం 2006 డిశంబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే 2008లో కేసీఆర్ మరోసారి కేసీఆర్‌తో పాటు మరోముగ్గురు ఎంపీలు, 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అయితే మొదటి సారిగా టీఆర్ఎస్ స్థానాలను కైవసం చేసుకోలేకపోయింది. రాజీనామా చేసిన మూడు ఎంపీ స్థానాలకు గాను రెండు స్థానాలను గెలుచుకుంది. దీంతో పాటు ఏడు అసెంబ్లీ స్థానాలను మాత్రమే గెలుచుకుంది.

2009 నుండి తిరుగులేని టీఆర్ఎస్

2009 నుండి తిరుగులేని టీఆర్ఎస్

ఇక 2009 సాధరణ ఎన్నికల్లో మహాకూటమితో పోత్తుపెట్టుకుని 10 ఎమ్మెల్యే స్థానాలు, రెండు ఎంపీ స్థానాలు గెలుచుకుని తిరిగి 2010లో మరోసారి రాష్ట్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి పోటి చేసి గెలిచారు. అయితే 2012లో పరకాల ఎమ్మెల్యే కొండసురేఖ రాజీనామా చేయగా అప్పుడు కూడ టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసి గెలిచింది.ఇక ఇప్పటి నుండి టీఆర్ఎస్ పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో గెలుచుకుంటూ వస్తుంది.

తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉప ఎన్నికలు

తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉప ఎన్నికలు

ఇక 2014లో పోటీ చేసిన టీఆర్ఎస్ 63 స్థానాలను గెలిచి అధికారంలోకి వచ్చింది. దీంతోపాటు 11 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. అయితే 2014 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ మెదక్ ఎంపీ స్థానంతో పాటు, గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి కూడ పోటీ చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంపీ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికల అనివార్యమయింది. దీంతో తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన మొదటి ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి తిరిగి గెలుపోందారు.

ఉప ఎన్నికల్లో భారి మెజారిటీ సాధించిన టీఆర్ఎస్

ఉప ఎన్నికల్లో భారి మెజారిటీ సాధించిన టీఆర్ఎస్


దీని తర్వాత వరంగల్ ఎంపీ కడియం శ్రీహారి రాజీనామా చేయడం ఉప ఎన్నికలు జరగడంతో పసునూరి దయాకర్ తిరిగి ఎంపికయ్యారు. ఇక ఆతర్వాత జరిగిన పాలేరు, నారయణఖేడ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మృతిచెందడడంతో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేసి గెలిచింది. ఇక తాజాగా హుజుర్‌గనర్‌లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలవడంతో ఉప ఎన్నిక అనివార్యమయింది. దీంతో గతంలో ఓడిపోయిన సైదిరెడ్డి టీఆర్ఎస్ తరపున తిరిగి పోటీ చేసి భారీ మెజారిటీ సాధించి గెలుపోందారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత రెండు ఎంపీ స్థానాలకు మూడు అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ తిరిగి విజయం సాధించింది.

English summary
TRS won a majority of seats in the by-election in Telangana. Whenever the by-election held, the party was winning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X