• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టీఆర్ఎస్ పనులు కూడా బీజేపీ చేసినట్టు ప్రచారం.!కోరుట్లలో కోపానికొచ్చిన ఎమ్మెల్సీ కవిత.!

|
Google Oneindia TeluguNews

కోరుట్ల/హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీకి ‌పెట్టని‌ కోట కోరుట్ల అని, జగిత్యాల జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలు గెలిచేలా కార్యకర్తలు ‌కృషి చేయాలన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కోరుట్ల నియోజకవర్గం టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ ‌కవిత పాల్గొన్నారు. ప్రజలు కోరిన విధంగా కోరుట్ల, మెట్ పల్లి రెవెన్యూ డివిజన్లను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఏర్పాటు చేశారని కవిత అన్నారు. వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేసుకోవడంతో పాటు,ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చామన్నారు కవిత.

అవినీతి లేకుండా పథకాలు అమలు చేస్తున్నాం..

అవినీతి లేకుండా పథకాలు అమలు చేస్తున్నాం..

భారతదేశంలో చిత్రపటాన్ని మార్చి, కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి, తెలంగాణను నంబర్ వన్ గా నిలిపిన ఘనత టీఆర్ఎస్ పార్టీదన్నారు ఎమ్మెల్సీ కవిత. కోరుట్లలో ఉన్న బీడీ కార్మికులకు రెండు వేలు పెన్షన్ ఇస్తున్నామని, ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీడీ కార్మికులకు ఎందుకు ఇవ్వడం లేదని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల విమర్శకులకు దీటుగా సమాధానం చెప్పాలన్నారు కవిత. సగర్వంగా, గులాబీ కండుగా మెడలో వేసుకుని టీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని,
ఎలాంటి అవినీతి లేకుండా ప్రజలకు పథకాలు అందుతున్నప్పుడు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు కవిత.

బీజేపి జై శ్రీ రాం అంటే, టీఆర్ఎస్ జై హనుమాన్ అనాలి..

దేశంలో అవినీతి లేకుండా పాలన అందిస్తున్న నాయకులు సీఎం చంద్రశేఖర్ రావు అని, వాళ్లు జై శ్రీ రాం అంటే, మనం జై హనుమాన్ అనాలని, దేవుడి పేరుతో రాజకీయం చేస్తే చూస్తూ ఊరుకోవద్దన్నారు కవిత. తెలంగాణ తెచ్చుకున్నది యువత కోసమని, తెలంగాణలో ఉద్యోగాలు 95% స్థానికులకే వచ్చేలా చేసామని, యువత ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్దం కావాలని కవిత పిలుపునిచ్చారు. దళిత వర్గాలకు దళిత బందు అమలు చేస్తున్నామన్నారు ఎమ్మెల్సీ కవిత. బిసీ లకు విద్య కోసం గతంలో కేవలం 7000 మంది బీసి విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వ హాస్టల్ సౌకర్యం ఉంటే, ప్రస్తుతం 281 బీసి హాస్టల్‌ ఏర్పాటు చేసి,1300 కోట్లతో లక్షా 32 వేల బీసి విద్యార్థులను చదివిసస్తున్నామన్నారు కవిత.

పసుపు బోర్డుకు ప్రత్యామ్నాయం తెచ్చింది గులాబీ పార్టీ..

అంతే కాకుండా 96 లక్షల విద్యార్థులకు 8 వేల కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చామని, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను గ్రామాల్లో చర్చపెట్టాలని, ప్రజాస్వామ్యం లో గెలిచిన వాళ్లకు మర్యాద ఇవ్వాలని, గెలిచిన ఎంపీ అరవింద్ కు 3 ఏండ్లు అవకాశం ఇచ్చినా, రైతులకు ఏం చెయ్యలేదన్నారు కవిత. పసుపు బోర్డుకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన కార్యాలయం కూడా తన చొరవతో తెచ్చిందేనన్నారు కవిత. మనం చేసిన పనులు కూడా, వాళ్ళె చేసినట్టు బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నరని, అబద్దాలకు ప్రతిరూపం అరవింద్ అని మండి పడ్డారు.

మోదీ హయాంలో కుంటుబడ్డ ఆర్థిక వ్యవస్థ..

మోదీ హయాంలో కుంటుబడ్డ ఆర్థిక వ్యవస్థ..

ప్రధాని మోదీ హయాంలో పెట్రోల్ నుండి నిత్యావసర వస్తువులు ధరలు భారీగా పెరిగాయని, రూపాయి విలువ భారీగా పడిపోయిందని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, అందరి అకౌంట్లలో పదిహేను లక్షల రూపాయల లాంటి హామీలు ఏమయ్యాయని కవిత సూటిగా ప్రశ్నించారు.

కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి, బీజేపీని ఎందుకు విమర్శించరు? పసుపు బోర్డు, ధరల పెరుగుదల పై బీజేపీ ని ఎందుకు నిలదీయరని, వారి మద్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందేమోననే సందేహాలను కవిత వ్యక్తం చేసారు.కాంగ్రెస్ నాయకులు రైతు రచ్చబండ నిర్వహిస్తే, టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూపించాలని, తెలంగాణ కు రావాల్సిన ‌బకాయిల గురించి పార్లమెంటు లో మాట్లాడాలని రాహుల్ గాంధీ ని కోరాల్సిందిగా జీవన్ రెడ్డి ని ప్రజలు నిలదీయాలని కవిత దిశా నిర్ధేశం చేసారు.

English summary
Trs Cadre want to work hard to win all the constituencies in Jagityala district. Korutla constituency TRS activists meeting was attended by MLC Kavita.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X