హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండో పెళ్లిపై ప్రశ్నించిందని భార్యను దారుణంగా కొట్టి గెంటేసిన టీఆర్ఎస్ యువనేత

హైదరాబాద్‌లో మరో దారుణం వెలుగు చూసింది. భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకొని వచ్చాడు. దానిని జీర్ణించుకోలేని భార్య నిలదీసింది. దీంతో అతడు ఆమెను దారుణంగా కొట్టాడు. తీరా చూస్తే అతను ఓ పార్టీ నాయకుడు.

|
Google Oneindia TeluguNews

ఉప్పల్: హైదరాబాద్‌లో మరో దారుణం వెలుగు చూసింది. భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకొని వచ్చాడు. దానిని జీర్ణించుకోలేని భార్య నిలదీసింది. దీంతో అతడు ఆమెను దారుణంగా కొట్టాడు. తీరా చూస్తే అతను ఓ పార్టీ నాయకుడు.

ఈ దారుణ సంఘటన హైదరాబాదులోని బోడుప్పల్‌లో చోటు చేసుకుంది. అతను తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన యువజన నేతగా చెబుతున్నారు.

 సంగీతతో శ్రీనివాస్ పెళ్లి

సంగీతతో శ్రీనివాస్ పెళ్లి

మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లోని శ్రీనగర్ కాలనీలో ఉండే శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీలో యువజన విభాగంలో పని చేస్తున్నారని తెలుస్తోంది. ఆయనకు నాలుగేళ్ల క్రితం చందానగర్‌కు చెందిన సంగీతతో వివాహం జరిగింది.

యువతిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకువచ్చాడు

యువతిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకువచ్చాడు

శ్రీనివాస్, సంగీతలకు రెండేళ్ల పాపు ఉంది. అయితే, తాజాగా ఆయన మరో యువతిని పెళ్లి చేసుకొని ఏకంగా ఇంటికి తీసుకు వచ్చాడు. దీనిని భార్య సంగీత ఏమాత్రం జీర్ణించుకోలేకపోయింది. రెండో పెళ్లిపై భర్తను నిలదీసింది. ఆడపిల్ల పుట్టిందని రెండో పెళ్లి చేసుకున్నానని చెప్పాడు.

 సంగీత ప్రశ్నించిందని చితకబాదాడు

సంగీత ప్రశ్నించిందని చితకబాదాడు

తనను భార్య ప్రశ్నించడంతో భర్త శ్రీనివాస్ తన కోపాన్ని ఆమెపై ప్రదర్శించాడు. సంగీతను ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. ఆమెను అటు ఇటు పడేస్తూ కొట్టాడు. ఆ తర్వాత ఆమెను ఇంటిలో నుంచి బయటకు గెంటివేశాడు.

 భర్త ఇంటి ముందు ఆందోళన, శ్రీనివాస్ పరారీ

భర్త ఇంటి ముందు ఆందోళన, శ్రీనివాస్ పరారీ

ఈ ఘటనలో సంగీత తీవ్రంగా గాయపడింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సంగీత.. భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఆమెకు స్థానికులు అండగా నిలబడ్డారు. మరోవైపు శ్రీనివాస్ పరారీలో ఉన్నాడు.

English summary
TRS youth leader Srinivas beat his wife for question his second marriage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X