• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ట్ర‌క్కు చేసింది జిమ్మిక్కు..! అందుకే ఉత్త‌మ్ గెలిచాడంటున్న కేటీఆర్..!!

|
  KTR Analyzed That The TPCC Chief Uttam Kumar Reddy Won In Nalgonda District | Oneindia Telugu

  హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నేత‌ల పై మ‌రోసారి విరుచుకుప‌డ్డారు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ తార‌క రామారావు. గెలిచిన అభ్య‌ర్థుల విజ‌యం కూడా నిఖార్సైన విజ‌యం కాద‌ని ఆయ‌న అభిప్రాయ ప‌డ్డారు. ప్ర‌త్య‌ర్థి ఎన్నిక‌ల గుర్తులో నెల‌కొన్న అస్ఫ‌ష్ట‌త వ‌ల్ల కొంత‌మంది కాంగ్రెస్ నేత‌లు విజ‌యం సాదించార‌ని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా న‌ల్ల‌గొండ జిల్లాలో టీపిసిసి ఛీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి గెలుపుకూడా ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగా జ‌ర‌గ‌లేద‌ని, ట్ర‌క్కు గుర్తు లో నెల‌కొన్న గంద‌ర‌గోళం వ‌ల్ల ఆయ‌న బ‌య‌ట‌ప‌డ్డార‌ని కేటీఆర్ విశ్లేషించారు.

  ఉత్త‌మ్ గెలుపు నిఖార్స‌య్యింది కాదు..! ట్ర‌క్కు గుర్తువ‌ల్లే బ‌య‌ట‌ప‌డ్డార‌న్న కేటీఆర్..!!

  ఉత్త‌మ్ గెలుపు నిఖార్స‌య్యింది కాదు..! ట్ర‌క్కు గుర్తువ‌ల్లే బ‌య‌ట‌ప‌డ్డార‌న్న కేటీఆర్..!!

  2014 శాసన సభ ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ ఆరు సీట్లు గెలిచామని, ఉద్యమం అప్పట్నుంచి నేతలు కష్టపడి పనిచేయడం వల్లే మొన్నటి ఎన్నికల్లో నల్లగొండ లో మహామహులు మట్టి కరిచారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తార‌క రామారావు అన్నారు. హుజుర్ నగర్ లో ట్రక్కు గుర్తు టక్కు టమార విద్యల వల్ల ఉత్తమ్ గెలిచారని ఎద్దేవా చేసారు. చంద్రబాబు ,రాహుల్ గాంధీ ,మోదీ, చివరకు సోనియా గాంధీ కూడా తెలంగాణ లో ప్రచారం చేసినా టీఆర్ఎస్ విజ‌యాన్ని నియంత్రించ‌లేక పోయార‌ని కేటీఆర్ అన్నారు.

  ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌ల‌ను ప్ర‌జ‌లు ప‌ట్టించుకోలేదు..! కేసీఆర్ ప‌ట్ల ప్ర‌జ‌ల‌కు విశ్వాసం ఉంద‌న్న కేటీఆర్..!

  ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌ల‌ను ప్ర‌జ‌లు ప‌ట్టించుకోలేదు..! కేసీఆర్ ప‌ట్ల ప్ర‌జ‌ల‌కు విశ్వాసం ఉంద‌న్న కేటీఆర్..!

  తెలంగాణ భవన్ లో చొప్పదండి, హుజుర్ నగర్ నియోజక వర్గాల టీఆర్ఎస్ కార్యకర్తల నుద్దేశించి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగించారు. చంద్రబాబు ఇచ్చిన 500 కోట్ల కు ఆశపడిన కాంగ్రెస్, టీడీపీ కి దాసోహమైంద‌ని అన్నారు. తెలంగాణ ప్రజలు ఎవ‌రెన్ని అపోహ‌లు క‌లిగించినా గులాబీ పార్టీని, చంద్ర‌శేఖ‌ర్ రావును గెలిపించుకున్నార‌ని అన్నారు.తెలంగాణ ముంద‌స్తు ఎన్నికల్లో కీల‌క సీట్లు గెలుచుకుంటామ‌ని చెప్పుకొచ్చిన బీజేపీ కి వంద సీట్ల లో డిపాజిట్లు కూడా రాలేద‌ని ఆయ‌న అన్నారు.

  ఓట‌మితో కాంగ్రెస్ నేత‌ల‌కు దిమ్మ తిరిగింది..! ఎవ‌రేం మాట్ల‌డుతున్నారో అర్థ కావ‌ట్లేదన్న కేటీఆర్..!!

  ఓట‌మితో కాంగ్రెస్ నేత‌ల‌కు దిమ్మ తిరిగింది..! ఎవ‌రేం మాట్ల‌డుతున్నారో అర్థ కావ‌ట్లేదన్న కేటీఆర్..!!

  పొన్నాల లక్ష్మయ్య మళ్ళీ ఎన్నికలు పెట్టమని డిమాండ్ చేస్తుంటే నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదని. ఓటర్లు ఇచ్చిన తీర్పు కు కాంగ్రెస్ నేతలు కొంతమంది న‌మ్మే ప‌రిస్థితిలో లేర‌ని కేటీఆర్ చెప్పుకొచ్చారు. మరికొంత మంది మీడియా కు కూడా దూరమయ్యారని. ఓడిన చోటనే వెతుక్కోవాలన్నట్టుగా హుజుర్ నగర్ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతటి అహంకారి మరొకరు లేరని, ట్రక్కు గుర్తుతో కలిపి టీఆర్ఎస్ కు 50 శాతం ఓట్లు వచ్చాయని. వచ్చే ఎన్నికల కోసం బూత్ స్థాయి కమిటీ లు పటిష్టం చేసుకోవాలని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

  పంచాయ‌తీలు ఏక‌గ్రీవం చేయండి..! ఇదే ఉత్ష‌హంతో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌న్న రామారావు..!!

  పంచాయ‌తీలు ఏక‌గ్రీవం చేయండి..! ఇదే ఉత్ష‌హంతో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌న్న రామారావు..!!

  సిరిసిల్ల లో పటిష్టమయిన బూత్ కమిటీ లతోనే త‌న ఆదిక్యం పెరిగిoదని, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసే పరిస్థితి లేదని. పంచాయతి ఎన్నికల్లో గులాబీ పార్టీ కార్యకర్తలు సమష్టి గా పని చేసి వీలయినన్ని ఏకగ్రీవం చేసుకోవాలని కేటీఆర్ చెప్పారు. 3400కు పైగా తాండాలను గ్రామ పంచాయతీ లుగా చేసిన ఘనత కేసీఆర్ దే నన్నారు. తాండాల్లో చాలా చోట్ల ఎన్నికలు ఏకగ్రీవంగా ఉండే పరిస్థితి ఉందని, పార్టీ ని పటిష్టంగా మార్చి పార్లమెంటు ఎన్నికల లోనూ మంచి ఫలితాలు సాధించాలని కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు తార‌క రామారావు.

  English summary
  Some Congress leaders have succeeded because of the confusion of the rival electoral mark. KTR analyzed that the TPCC chief Uttam Kumar Reddy won in Nalgonda district was not a democrat, but because of the confusion in the symbol.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X