వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సారీ చెప్పింది, అదో దుష్ట ఆలోచన: న్యూయార్క్ టైమ్స్‌పై ట్రంప్ ఆగ్రహం

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ టైమ్స్ పత్రిక పైన నిప్పులు చెరిగారు. ఆ పత్రిక తీరు అంతేనని ఆగ్రహించారు. కాన్సాస్ కాల్పుల్లో మృతి చెందిన శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయన సంధించిన ప్రశ్నలక

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్/హైదరాబాద్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ టైమ్స్ పత్రిక పైన నిప్పులు చెరిగారు. ఆ పత్రిక తీరు అంతేనని ఆగ్రహించారు. కాన్సాస్ కాల్పుల్లో మృతి చెందిన శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయన సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని న్యూయార్క్ టైమ్స్ రాసింది.

<strong>చిన్నోడిని అమెరికా వెళ్లనీయను: కుప్పకూలిన శ్రీనివాస్ తల్లి, బోరున ఏడ్చిన భార్య </strong>చిన్నోడిని అమెరికా వెళ్లనీయను: కుప్పకూలిన శ్రీనివాస్ తల్లి, బోరున ఏడ్చిన భార్య

ట్రంప్ పైన వివిధ అంశాలపై మండిపడింది. దీనిపై ట్రంప్ ఆగ్రహించారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక అసత్యాలు రాస్తోందని, ఆ పత్రికది దుష్ట తలంపన్నారు. చాలా సందర్భాల్లో ఆ పత్రిక రాసేది తప్పుడు కథనాలేనన్నారు.

న్యూయార్క్ టైమ్స్ క్షమాపణ చెప్పింది

న్యూయార్క్ టైమ్స్ క్షమాపణ చెప్పింది

ట్రంప్ ఓ ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. గత రెండేళ్లలో ఆ పత్రికను ఓసారి చూడండని, అధ్యక్ష ఎన్నికల గురించి వారి అంచనాలు తప్పినందుకు పాఠకులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చిందన్నారు.

మీడియా మీద కోపం కాదు

మీడియా మీద కోపం కాదు

తన పోరాటం తప్పుడు మీడియా మీదేనని, మొత్తం మీడియాపై కాదన్నారు. ఈ రెండింటికీ తేడా ఉందని, తప్పుడు మీడియా ఒక విపక్ష పార్టీ అని, అది అమెరికన్‌ ప్రజలకు శత్రువు అన్నారు.

ఆ మహిళలు ఏం చెప్పారంటే...

ఆ మహిళలు ఏం చెప్పారంటే...

అద్భుతంగా పనిచేసే అనేక మంది గౌరవనీయ విలేకరులు తనకు తెలుసునని ట్రంప్ చెప్పారు. మహిళలు తన గురించి ఏవో వ్యాఖ్యలు చేశారని న్యూయార్క్ టైమ్స్ తన మొదటి పేజీలో కథనం రాసిందని, అయితే తాము అలాంటి వ్యాఖ్యలు చేయలేదని సదరు మహిళలు చెప్పారని తెలిపారు.

సునయన ప్రశ్నకు జవాబేది?

సునయన ప్రశ్నకు జవాబేది?

తాము అమెరికాకు చెందుతామా లేదా? అంటూ కేన్సస్‌ దాడిలో బలైన శ్రీనివాస్‌ కూచిభొట్ల భార్య సునయన సంధించిన ప్రశ్నకు అధ్యక్షుడు సమాధానమివ్వాలని, ఆమె వంటి లక్షలమంది మైనార్టీలు అమెరికాలో అంతర్భాగమని, ఈ దేశం పూర్తిగా వలసదారులు, వారి వారసులతోనే ఏర్పడిందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

నష్టం కలిగిస్తున్నారని..

నష్టం కలిగిస్తున్నారని..

కేన్సస్‌ కాల్పుల ఘటనపై మౌనంగా ఉండటం ద్వారా అధ్యక్షులు ట్రంప్‌.. విద్వేష నేరాలకు వూతమిస్తున్నారని న్యూయార్క్‌ టైమ్స్ దుయ్యబట్టింది. ఆ మౌనం దేశ ప్రతిష్ఠకు, బలానికి నష్టం కలిగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు 'ట్రంప్‌ అమెరికాకు చెందినవారెవరు' శీర్షికతో కథనం రాసింది.

అలా దుష్ప్రచారం

అలా దుష్ప్రచారం

ట్రంప్‌, ఆయన ప్రభుత్వం.. అనేక మంది వలసదారులు, విదేశీ సందర్శకులను దేశానికి వెలుపల ఉంచేయడమే కాదని, వారిని నేరగాళ్లు, భవిష్యత్‌ ఉగ్రవాదులుగా, ఆక్రమణదారులుగా ముద్రవేస్తున్నారని, అమెరికా ఉద్యోగాలను అపహరించడానికి వచ్చిన వారిగా, అమెరికన్లకు హాని కలిగించేవారిగా దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొంది.

ట్రంప్‌కు హెచ్చరిక

ట్రంప్‌కు హెచ్చరిక

విద్వేషాన్ని తగ్గించడానికి బదులు, పెంచిపోషిస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ మండిపడింది. కేన్సస్‌ కాల్పులపై ట్రంప్‌ ఒక్క మాట కూడా మాట్లాడలేదని పేర్కొంది. విద్వేష నేరాలన్నింటినీ కలత చెందిన వ్యక్తుల పనిగా తేలిగ్గా తీసిపారేస్తుంటారని తెలిపింది. ట్రంప్ ఇలాంటి పరిస్థితుల్లో మిన్నకుంటే ప్రమాదమని హెచ్చరించింది. కాగా, వైట్ హౌస్, ఆ తర్వాత ట్రంప్.. కాన్సాస్ కాల్పులను ఖండించారు.

English summary
President Trump got specific in his latest discussion about the "fake news media," singling out The New York Times for scorn, while heaping praise on Breitbart News and an individual Reuters reporter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X