• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జీఈఎస్ ప్రతినిధులకు గోల్కొండ ఘుమఘుమలు.. మరోవైపు మానుషి చిల్లర్‌కు సన్మానం

By Swetha Basvababu
|

హైదరాబాద్: నిజాం నవాబుల కోట గోల్కొండ ప్రపంచ దేశాలకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఘుమఘుమలతో కూడిన వంటకాలతో విందునిచ్చింది. 'జీఈఎస్' సదస్సుకు హాజరైన అతిథులంతా స్వేచ్ఛగా 18 రకాల హైదరాబాదీ బిర్యానీ రుచులను ఆస్వాదించారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సదస్సు (జీఈఎస్) కోసం వచ్చిన అతిథులకు బుధవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం గొల్కొండ కోటలో పసందైన విందునిచ్చింది.

రాత్రి ఏడు గంటల నుంచి 10.30 గంటల వరకు విందు కార్యక్రమంలో దేశవిదేశాలకు చెందిన దాదాపు 2000 మందికిపైగా పారిశ్రామిక వేత్తలు విందుకు హాజరయ్యారు. సుమారు 18 రకాల హైదరాబాద్‌ బిర్యానీలతోపాటు 200 తెలంగాణ వంటకాలను వారి కోసం సిద్ధం చేశారు. 18 రకాల చేపల వంటకాలు, 14 రకాల మాంసం, 50 రకాల శాకాహార రుచులను అతిథులకు పరిచయం చేశారు. అతిథులకు వలంటీర్లు కొసరికొసరి తినిపించారు.

కొత్త అందాలు సంతరించుకున్న గోల్కొండ కోట

కొత్త అందాలు సంతరించుకున్న గోల్కొండ కోట

చల్లని మంచు తెరలు తాకుతున్న సమయాన ఘుమఘుమలు వెదజల్లే వేడివేడి హైదరాబాద్‌ బిర్యానీ రుచులను అతిథులు ఆస్వాదించారు. విందులో నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌, మిస్‌ వరల్డ్‌ మానుషీ చిల్లర్‌, టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా, తెలంగాణ శాసన మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు కేటీఆర్‌, పి.మహేందర్‌రెడ్డి, బీజేపీ నేతలు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ యోగితా రాణా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిస్‌ వరల్డ్‌ మానుషీ ఛిల్లర్‌ను ప్రభుత్వ తరఫున ఘనంగా సత్కరించారు. విందును పురస్కరించుకుని రంగు రంగుల విద్యుద్దీపాలతో అలంకరించడంతో గోల్కొండ కోట కొత్త అందాలను సంతరించుకుంది. వందలాది మంది విదేశీయులు బ్యాటరీ కార్లలో తిరుగుతూ రాత్రి వేళ కోట అందాలను తిలకించారు. అద్భుత అనుభూతులకు లోనయ్యామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

 మానుషి చిల్లర్ ప్రత్యేక ఆకర్షణ

మానుషి చిల్లర్ ప్రత్యేక ఆకర్షణ

ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సదస్సు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గోల్కొండ కోటలో బుధవారం రాత్రి ఇచ్చిన విందు దేశ,విదేశీ ప్రతినిధులకు ఆహ్లాదాన్ని పంచింది. చల్లని వెన్నెల..మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ కాంతులు, సౌండ్‌ అండ్‌ లైట్‌ షో...హైదరాబాద్‌ చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలను చాటిచెప్పే లఘుచిత్రాల ప్రదర్శన అతిథులకు ఉల్లాసాన్నిచ్చాయి. ప్రపంచ సుందరి మానుషీ ఛిల్లర్‌ విందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విందు పూర్తయ్యాక ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. పలువురు పారిశ్రామిక వేత్తలు సదస్సు ద్వారా తాము పొందిన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.

సరికొత్త ఆలోచనలు, మహిళా పారిశ్రామిక వేత్తలు, ఇవాంక ట్రంప్‌, వ్యాపార వేత్తల సదస్సులో కీలక నిర్ణయాలు.. ఇవన్నీ తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తులో మేలు చేసేవేనని అమెరికా ప్రతినిధి క్రియోనియా అన్నారు.

 తెలంగాణ చరిత్రకు తార్కాణం అన్న కెన్ జెస్టర్

తెలంగాణ చరిత్రకు తార్కాణం అన్న కెన్ జెస్టర్

హైదరాబాద్ ఎక్స్‌ట్రార్డినరీ సిటీ అని భారతదేశంలో అమెరికా రాయబారి కెన్ జెస్టర్ కితాబు ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయ, అధ్యక్ష సలహాదారు ఇవాంకాట్రంప్‌తో కలిసి గోల్కొండను సందర్శించిన తర్వాత ఆయన ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ‘హైదరాబాద్ ఎక్స్‌ట్రార్డినరీ సిటీ. భారతదేశానికి చెందిన అత్యున్నత సంస్కృతికి, చరిత్రకు నిదర్శనం. అద్భుతమైన ఆతిథ్యం. ఇక్కడి చరిత్రకు గోల్కొండ తార్కాణం' అని ఆయన ట్వీట్ చేశారు. జీఈఎస్‌లో పాల్గొనడం చాలా గర్వంగా ఉందని టెన్నిస్‌స్టార్ సానియా మీర్జా మరో ట్వీట్‌లో తెలిపారు.

 ఆర్గానిక్ తరహాలో సబ్బులు కాస్మొటిక్స్ తయారీ ఇలా

ఆర్గానిక్ తరహాలో సబ్బులు కాస్మొటిక్స్ తయారీ ఇలా

సబ్బులు, కాస్మోటిక్‌లు, షాంపూలవంటివి తయారు చేయడంలో రసాయనాలను విరివిగా వినియోగిస్తున్న విషయం తెలిసిందే. మేం ఇందుకు భిన్నంగా పూర్తి ఆర్గానిక్ తరహాలో వీటిని తయారు చేస్తున్నామని ఏన్షియంట్ ఇండియా ఎండీ కళ్యాణి చెప్పారు. హెయిర్ ఆయిల్స్, ఫేస్‌వాష్, బాడీవాష్, ఇలాంటివన్నీ రూపొందిస్తామని, తమకు సొంతంగా ఫామ్ ఉన్నదని, దానికి అనుసంధానంగా జీడిమెట్లలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేశాం అని చెప్పారు. వీటి తయారీలో ఎక్కువగా మహిళలే పాల్గొంటారని, మన సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేలా కొత్తగా గేములను రూపొందించామని, వాతావరణం వల్ల కలిగే నష్టాలను తెలియజేసేలా స్నేక్ అండ్ లాడర్ గేమ్‌ను కూడా ప్రారంభించాం అని ఏన్షియంట్ ఇండియా ఎండీ కళ్యాణి చెప్పారు.

 టీ - హబ్ పై ఇలా నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి ఇలా

టీ - హబ్ పై ఇలా నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి ఇలా

హైదరాబాద్‌లో జరుగుతున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ ప్రపంచంలో నూతన ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తున్నదని అటల్ ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్, నీతి ఆయోగ్ అడిషనల్ సెక్రటరీ ఆర్ రమణన్ అన్నారు. ప్రపంచదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు తమ కొత్త ఆలోచనలను పరస్పరం పంచుకుని ఏవిధంగా వ్యాపార అభివృద్ధిలో సహకరించుకోవాలనే విషయంపై అవగాహనకు వస్తున్నారన్నారు. ఎక్కడా ఎలాంటి లోపాలు, అపశ్రుతులకు ఆస్కారం లేదని అన్నారు.

టీ హబ్ పై సంగీత దర్శకులు రమణ గోగుల

టీ హబ్ పై సంగీత దర్శకులు రమణ గోగుల

ఎనిమిదో గ్లోబల్ సమ్మిట్‌లో ప్రపంచ ప్రతినిధుల మధ్య చర్చలు చాలా ఫలప్రదంగా జరుగుతున్నాయని ప్రముఖ సంగీత దర్శకులు, స్టాన్‌లీ బ్లాక్ అండ్ డెకర్ వైస్ ప్రెసిడెంట్ రమణ గోగుల అన్నారు. ఈ సమ్మిట్‌లో వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులపై, సౌరవిద్యుత్‌పై చర్చలను జరుపడానికి మంచి అవకాశం లభించిందని చెప్పారు. రైతులకు ఉపయోగపడేలా సోలార్ విద్యుత్‌ను ఉపయోగించడంపై ప్రపంచదేశాల ప్రతినిధులతో వివరంగా చర్చించామన్నారు. భారతదేశం బాగా అభివృద్ధి చెందుతున్నదనే అభిప్రాయం విదేశీ ప్రతినిధులలో ఉన్నదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ-హబ్ అందరికీ మార్గదర్శకంగా నిలుస్తున్నదని అన్నారు. టీ-హబ్‌లో వ్యవసాయ రంగానికి కూడా ప్రాధాన్యతనివ్వడం తెలంగాణ సర్కార్ ప్రత్యేకత అన్నారు.

 భారత సంస్క్రుతిపై లైబీరియా బాంబ్ షెల్ కంపెనీ ఎండీ అర్చెల్ బెర్నార్డ్

భారత సంస్క్రుతిపై లైబీరియా బాంబ్ షెల్ కంపెనీ ఎండీ అర్చెల్ బెర్నార్డ్

గతంలో శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన అంతర్జాతీయ సదస్సు కంటే ఇక్కడ అద్భుతంగా జరుగుతున్నదని లైబీరియాకు చెందిన బాంబ్ షెల్ ఫ్యాక్టరీ కంపెనీ ఎండీ ఆర్చేల్ బెర్నార్డ్ చెప్పారు. భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలు తెగ నచ్చేశాయన్నారు. అందుకే హైదరాబాద్ నగరానికి రాగానే ఇక్కడి దుకాణంలో బనారస్ చీర కొన్నానని, హైదరాబాద్‌లో లైబీరియా డిజైనింగ్ వస్ర్తాలను పరిచయం చేయడానికి ప్లాన్ చేస్తున్నానని తెలిపారు. ఇందుకోసం కొత్త వ్యాపార భాగస్వామ్యుల కోసం చూస్తున్నానని, ఇక్కడి ఫ్యాషన్ డిజైనర్లతో కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఉన్నదన్నారు. అందుకే, ప్రప్రథమంగా హైదరాబాద్ విచ్చేశానని,. ఇక్కడి వాతావరణం చాలా బాగుందని ఆమె తెలిపారు. లైబీరియాలో ద బాంబ్‌షెల్ ఫ్యాక్టరీ అనే దుస్తుల తయారీ విభాగంలో ఉన్నానన్నారు. వినియోగదారుల్లో నలభైశాతం తెలుపువారే ఉండటం గమనార్హం. ఆఫ్రికన్ దుస్తులను కేవలం నల్లజాతీయులే ధరిస్తారనే అపోహను మేం క్రమక్రమంగా దూరం చేస్తున్నామని, తమ ఖాతాదారుల్లో వీరి శాతం పెరుగడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
About 1,500 Global Entrepreneurship Summit (GES) delegates attended a dinner hosted by the Telangana Government at the Golconda fort on the city outskirts on Wednesday.The majestic fort, known for diamond trade in the yore,was tastefully illuminated with hundreds of colourful electrical bulbs, presenting a fairy land look.The guests including a large number of foreigners savoured delicacies served at the dinner.Tennis star Sania Mirza also attended at the dinner.A cultural programme featuring the local artistes was also arranged to entertain the guests.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more