వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షల గడువు తేదీ పొడిగింపు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించాల్సిన ప్రవేశపరీక్షల దరఖాస్తు స్వీకరణ గడువును పొడిగించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ఎంసెట్, ఐసెట్, ఈసెట్, ఎడ్ సెట్, పీజీజీసెట్, పీఈసెట్, లాసెట్, పీజీఎల్ సెట్ ప్రవేశ పరీక్షలకు జూన్ 10 వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి సూచించింది.

ఎంసెట్, ఐసెట్, ఈసెట్, ఎడ్ సెట్, పీజీఈసెట్, లాసెట్, పీజీఎల్ సెట్ తదితర ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును పెంచుతూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా లాక్‌డౌన్ నేపథ్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం eamcet.tsche.ac.inను సంప్రదించవచ్చు.

TS EAMCET 2020 application deadline extended to June 10

తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో మరోసారి భారీగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. మంగళవారం ఒక్కరోజే 71 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1991కి చేరింది.

తాజా కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 38 కరోనా కేసులుండటం గమనార్హం.
కాగా, మంగళవారం కరోనాతో ఒక వ్యక్తి మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 57కు చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1284కు చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

కాగా, మంగళవారం ఒక్క రోజు కరోనా నుంచి కోలుకుని 120 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 650గా ఉంది. ఈరోజు నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 38 ఉండగా, రంగారెడ్డి జిల్లా పరిధిలో 7, మేడ్చల్ జిల్లాలో 6 కరోనా కేసులను గుర్తించారు.

English summary
Telangana State EAMCET 2020 deadline for the application process has been extended until June 10, 2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X