వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల, ఫలితాలు ఇలా చూసుకోవచ్చు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి శనివారం మధ్యాహ్నం ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది అగ్రికల్చర్, మెడికల్ విభాగాల్లో 73,106 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని కడియం తెలిపారు. 66,858 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 60,651 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు.

ఇంజినీరింగ్ విభాగంలో 1,47,958 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 1,36,305మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 1,06,646(78.24 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎంసెట్ ర్యాంకు కార్డులను ఈ నెల 22వ తేదీ నుంచి సంబంధిత వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 TS EAMCET Results 2018: Telangana EAMCET Results Declared Today

తొలిసారిగా ఆన్ లైన్లో ఎంసెట్ నిర్వహించారు. ఇంటర్నల్ స్లైడింగ్ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్సుమెంట్స్ ఉంటాయని తెలిపారు. మే 25వ తేదీ నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ ఉంటుంది. జూలై 16 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

ఇంజినీరింగ్‌లో 78.24 శాతం, ఎంసెట్‌ వ్యవసాయం, ఫార్మాలో 90.72 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అయితే ఫలితాలను శనివారం సాయంత్రం 4 గంటలకు వెల్లడి చేస్తామని అధికారులు తొలుత ప్రకటించారు. ఫలితాల విడుదల సమయంలో స్వల్ప మార్పులు చేసినట్లు వెల్లడించారు. ఫలితాలను ఇలా చూసుకోవచ్చు..

eamcet.tsche.ac.in

English summary
The Telangana engineering, agriculture and medical common entrance test (Eamcet) results were declared at 1pm on Saturday by education minister Kadiyam Srihari.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X