హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుడుంబా వద్దు, చీప్‌లిక్కరే ముద్దు: సీఎం కేసీఆర్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రజల ప్రాణాలను హరిస్తున్న గుడుంబాను అరికట్టమే ప్రధాన లక్ష్యంగా కొత్త ఆబ్కారీ విధానాన్ని అమలు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మద్యం అమలు విధానంలో ప్రజల ఆరోగ్యంగా ఉండాలని, ఆదాయం తగ్గినా ఫర్వాలేదని ఆయన స్పష్టం చేశారు. నూతన ఎక్సైజ్ విధానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలో శుక్రవారం సమీక్ష జరిపారు.

ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గుడుంబాను నిర్మూలించడానికి తక్కువ ధరకు ఆమోదయోగ్యమైన చీప్ లిక్కర్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అంతేకాదు తక్కువ ధరకే మద్యం లభిస్తే ప్రజలు గుడుంబా జోలికి పోరనే నమ్మకం తనకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.

గుడుంబా తయారీదారులను గుర్తించి, అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగించాలని సూచించారు. కొత్త మద్యం విధానానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆగస్టు 15 తర్వాత జారీచేయాలని అన్నారు. అక్టోబర్ 1నుంచి నూతన మద్యం విధానాన్ని అమలులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో చీప్‌లిక్కర్‌కు పర్మిట్లు

గ్రామీణ ప్రాంతాల్లో చీప్‌లిక్కర్‌కు పర్మిట్లు


గుడుంబా వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అనేకమంది మరణిస్తున్నారు. గుడుంబాకు ప్రత్యామ్నాయంగా ప్రాణహానిలేని మద్యాన్ని అందించాలని అధికారులను కోరారు. అందుకోసం ప్రభుత్వమే బాటిళ్లద్వారా చీప్ లిక్కర్‌ను అందించాలి. గ్రామీణ ప్రాంతాలలో మండలం యూనిట్‌గా తీసుకుని లైసెన్స్‌లు ఇవ్వాలని అన్నారు. లైసెన్స్‌లు పొందిన వారు మండలంలోని గ్రామాలలో చీప్ లిక్కర్ అమ్ముకోవడానికి పర్మిట్లు ఇవ్వాలని చెప్పారు.

 గ్రామీణ ప్రాంతాల్లో చీప్‌లిక్కర్‌కు పర్మిట్లు

గ్రామీణ ప్రాంతాల్లో చీప్‌లిక్కర్‌కు పర్మిట్లు


హైదరాబాద్‌తో పాటు రాష్ట్రమంతా ప్రస్తుతం అనుసరిస్తున్న లాటరీపద్ధతి ద్వారానే మద్యం దుకాణాలకు లైసెన్స్‌లివ్వాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం మద్యం సరఫరా చేస్తున్న తెలంగాణ బేవరేజి కార్పొరేషన్ లిమిటెడ్‌ను రద్దుచేసి ప్రత్యేక డిపార్ట్‌మెంట్‌గా మార్చాలని, సీనియార్టీ ఉన్న రిటైర్డ్ అధికారుల సేవలు వినియోగించుకోవాలని నిర్ణయించారు.

 గ్రామీణ ప్రాంతాల్లో చీప్‌లిక్కర్‌కు పర్మిట్లు

గ్రామీణ ప్రాంతాల్లో చీప్‌లిక్కర్‌కు పర్మిట్లు


చీప్‌లిక్కర్ ప్రవేశపెట్టడంతోపాటు కల్తీ జరుగకుండా చూడాలి. గ్రామాల్లో గుడుంబా తయారుచేసేవారి దగ్గరినుంచి అమ్మకాలు జరిపే వరకూ ఒక నెట్‌వర్క్ ఉంది. ఆ నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేయాలి. గుడుంబా తయారీదారులపై అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగించాలి అని చెప్పారు.

గ్రామీణ ప్రాంతాల్లో చీప్‌లిక్కర్‌కు పర్మిట్లు

గ్రామీణ ప్రాంతాల్లో చీప్‌లిక్కర్‌కు పర్మిట్లు


గుడుంబా స్థావరాలపై వివరాలు ఇచ్చేవారికి అవార్డులు ఇవ్వాలని, ఆర్డీవోలు, తహసీల్దారులు గుడుంబా వ్యతిరేక విధానాన్ని అమలు చేసే విషయంలో క్రియాశీలకంగా పని చేయాలని సీఎం చెప్పారు. ఈ సమావేశంలో ఆబ్కారీ మంత్రి టీ పద్మారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌మిశ్రా, కమిషనర్ చంద్రవదన్, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, సీఎం అదనపు ముఖ్యకార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.

English summary
It’s official now. The state government will soon introduce cheap liquor to eradicate arrack (Gudumba). The cheap liquor will be supplied in bottles and will be manufactured under the aegis of the state government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X