వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తహశీల్దార్ విజయ దాడిపై సర్కార్ సీరియస్, కఠినచర్యలు తీసుకుంటాం, నిందితుడు సురేశ్‌గా గుర్తింపు

|
Google Oneindia TeluguNews

తహశీల్దార్ విజయారెడ్డిపై దాడిని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలే తప్ప.. దాడులు చేయడం సరికాదని స్పష్టంచేసింది ఘటనపై విచారణకు ఆదేశాలు జారీచేసినట్టు పేర్కొన్నది. నిందితుడిపై ఘటన చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది.

అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి మృతిని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఖండించారు. ఓ అధికారిపై దాడి సరికాదని పేర్కొన్నారు. దుండగుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తానని తెలిపారు. ఘటనా స్థలానికి ఇంచార్జీ కలెక్టర్ హరీశ్ చేరుకున్నారు. దాడికి సంబంధించి పూర్తి వివరాలను ఆరాతీస్తున్నారు. దుండగులు ఎల వచ్చాడు ? ఆ సమయంలో విజయారెడ్డి ఒక్కరే ఉన్నారా అనే అంశంపై డిస్కస్ చేస్తున్నారు.

ts govt serious on Tahasildhar attack issue.. culprit identify suresh

మరోవైపు విజయారెడ్డిన హతమార్చిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. అతను సురేష్ అని పేర్కొన్నారు. తీవ్రగాయాలైన సురేష్.. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. తహశీల్దార్ కార్యాలయం నుంచి పోలీసు స్టేషన్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడినుంచి ఆస్పత్రికి వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారని సమాచారం.

అయితే విజయారెడ్డిపై పెట్రోల్‌పై దాడిచేసే ముందు చేయికూడా చేసుకున్నారని తెలుస్తోంది. అతను దాడి చేయడంతో విజయారెడ్డి ఆరిచారని.. అరుపులను డ్రైవర్ విన్నారని పోలీసులు చెప్తున్నారు. సురేశ్ వెళ్లడంతో విజయారెడ్డి ఉన్న గదికి తాళం వేశారని తెలుస్తోంది. పథకం ప్రకారమే అతను వచ్చినట్టు అర్థమవుతుంది.

English summary
telangana govt serious on Tahasildhar vijayareddy attack. take serious action on culprit suresh ask to police commissioner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X