వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్టీసీ జేఏసీతో చర్చలకు ప్రభుత్వం సై..? కమిటీ నియామకం, కోర్టు సూచనలపై కేసీఆర్ మదనం

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ సమ్మెపై చర్చలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆర్టీసీ గుర్తింపు పొందిన కార్మిక సంఘాలతో చర్చలు జరుపాలని హైకోర్టు సూచించింది. దీనికి సంబంధించిన ఆర్డర్ కాపీ రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఇంచార్జీ ఎండీ ఆర్డర్ కాపీ తీసుకొని ప్రగతి భవన్ చేరుకున్నారు. హైకోర్టు సూచనలతో సీఎం కేసీఆర్‌తో చర్చిస్తున్నారు. గుర్తింపు పొందిన కార్మిక సంఘాలతో చర్చలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు ప్రస్తుత పరిస్థితిని బట్టి అర్థమవుతోంది.

సీఎం జగన్ ఏం చెప్పారు: తెలంగాణ జేఏసీకి మద్దతుగా ఏపీయస్ ఆర్టీసీ: ఏం చేయనున్నారు..!సీఎం జగన్ ఏం చెప్పారు: తెలంగాణ జేఏసీకి మద్దతుగా ఏపీయస్ ఆర్టీసీ: ఏం చేయనున్నారు..!

కోర్టు మొట్టికాయల నేపథ్యంలో

కోర్టు మొట్టికాయల నేపథ్యంలో

శుక్రవారం విచారణ సందర్భంగా మూడురోజుల్లో చర్చలు జరుపాలని ప్రభుత్వానికి సూచించింది. ఆ ఆర్టర్ కాపీ ఇవాళ ప్రభుత్వానికి చేరింది. దీంతో భవిష్యత్ కార్యాచరణపై సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. ఈ నెల 28వ తేదీన కేసు విచారణకు రానున్న నేపథ్యంలో.. ఏం చేయాలనే అంశంపై డిస్కష్ చేస్తున్నారు. చర్చల తర్వాత సమ్మె విమరణపై నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ కార్మిక సంఘాలు తెగేసి చెప్పడంతో.. చర్చలు జరపడం తప్ప మరో మార్గం లేదని ప్రభుత్వం భావిస్తోంది.

మరో కమిటీ

మరో కమిటీ

ఇదివరకే ఐఏఎస్ కమిటీ నియమించి .. రద్దుచేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్టీసీ కార్మికులతో ఎవరు చర్చలు జరపాలనే అంశంపై చర్చిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమ్మె కొనసాగిస్తోంది. శనివారం బంద్ చేపట్టిన కార్మిక సంఘాలు.. ఆదివారం అఖిలపక్ష నేతలతో సమావేశమయ్యారు. సమావేశంలో తమ ఆందోళన క్రమానికి సంబంధించి రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.

వారం రోజుల్లో

వారం రోజుల్లో

28వ తేదీన హైకోర్టులో విచారణకు రానుండటంతో.. చర్చలు జరపాలనే అంశంపై ప్రభుత్వం యోచిస్తోంది. కార్మిక సంఘాలతో చర్చలు జరిపేందుకు తొలుత ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసినా.. తర్వాత హైకోర్టు కలుగజేసుకోవడంతో చర్చలు జరపాల్సి వస్తోంది. చర్చలు జరిపితే డిమాండ్లపై లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని కార్మిక సంఘాలు పట్టుబడతాయి. దీంతో ప్రభుత్వం డిఫెన్స్‌లో పడే అవకాశం ఉంది. అయితే అలాంటి పరిస్థితి ఎదురైతే సిచుయేషన్ ఏంటీ అని ప్రభుత్వం మదనపడుతుంది.

ఎట్టకేలకు

ఎట్టకేలకు

హైకోర్టు మొట్టికాయలు వేయడంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. చర్చలు జరిపేందుకు సానుకూలమని సంకేతాలు ఇచ్చింది. మరో వారం రోజుల్లో కోర్టులో విచారణ ఉన్నందున ఈ లోపు సమస్యను పరిష్కరించాలనే భావనలో కేసీఆర్ సర్కార్ ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

English summary
ts govt to discuss about rtc unions for their demands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X