హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆగస్టులో తెలంగాణ ఐసెట్, ఏప్రిల్ 3న నోటిఫికేషన్: పరీక్ష ఫీజు వివరాలివే

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కరోనావైరస్ విజృంభణ కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పడు ప్రవేశ పరీక్షలను కూడా నిర్వహించేందుకు సిద్ధమైంది. తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ షెడ్యూల్ బుధవారం విడుదలైంది.

ఈ ఏడాది ఆగస్టులో తెలంగాణ ఐసెట్‌(ఇంటిగ్రెటెడ్ కామన్ ఎంట్రాన్స్ టెస్ట్)ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఏప్రిల్ 4వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

TS ICET 2021 in August, notification to release on April 3

ఏప్రిల్ 7 నుంచి జూన్ 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆలస్య రుసుముతో జులై 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చునని కన్వీనర్ రాజిరెడ్డి తెలిపారు. ఆగస్టులో రెండు రోజులపాటు రాష్ట్రంలోని 14 పట్టణాల్లో ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నారు.

కాగా, పరీక్ష ఫీజును రూ. 650గా నిర్ణయించింది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా జూన్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 30 వరకు రూ. 250 అపరధ రుసుము, జులై 15 వరకు రూ. 500 అపరాధ రుసుము, జులై 30 వరకు రూ. 1000 అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది.

English summary
The Telangana State Council of Higher Education (TSCHE) on Wednesday announced the schedule for Telangana State Integrated Common Entrance Test 2021 exam. It said that the detailed notification will be released on April 3.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X