వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Telangana Inter Exam time table 2021: మే 1 నుంచి పరీక్షలు -సమగ్ర వివరాలివే..

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి కారణంగా ఈ విద్యా సంవత్సరం తీవ్ర ఒడిదుడుకులకు గురైంది. అరకొరగానే ఆన్ లైన్ బోధన కొనసాగింది. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ఇక పరీక్షలకు సిద్ధమైంది. తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్షల షెడ్యూల్‌ ను రాష్ట్ర విద్యా శాఖ గురువారం విడుదల చేసింది.

మే 1 నుంచి 19 వరకు ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు.. మే 2 నుంచి 20 వరకు ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు వెల్లడించింది.

ప్రపంచం బాధ్యతనూ తలకెత్తుకున్నాం -భారత్‌లోనే 4వ పారిశ్రామిక విప్లవం: WEF's Davosలో మోదీప్రపంచం బాధ్యతనూ తలకెత్తుకున్నాం -భారత్‌లోనే 4వ పారిశ్రామిక విప్లవం: WEF's Davosలో మోదీ

ఏప్రిల్‌ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్‌ ఉండనున్నట్లు తెలిపిన బోర్డు.. ఏప్రిల్ 1న ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్‌, ఏప్రిల్‌ 3న ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఒకేషనల్‌ కోర్సులకు కూడా ఇదే షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది. ఇక పరీక్షల షెడ్యూల్ పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్ష షెడ్యూల్‌
మే 1: సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
మే 4: ఇంగ్లిష్‌ పేపర్‌-1
మే 6: మ్యాథ్స్‌ పేపర్‌-1ఏ, బోటనీ-1, సివిక్స్‌-1, సైకాలజీ-1
మే 8 :మ్యాథ్స్‌ పేపర్‌-1బీ, జువాలజీ-1, హిస్టరీ-1
మే 11: ఫిజిక్స్ పేపర్‌-1‌, ఎకనామిక్స్‌-1, క్లాసికల్ లాంగ్వేజ్-1
మే 14: కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్‌1, సోషియాలజీ 1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్1
మే 17: జియాలజీ పేపర్1, హోమ్ సైన్స్1, పీఏ1, లాజిక్ పేపర్1, బ్రిడ్స్ కోర్స్ మ్యాథ్స్1(బైపీసీ విద్యార్థులకు)
మే 19: మోడ్రన్ లాంగ్వేజ్1, జాగ్రఫీ పేపర్1

TS Inter Exam 2021: Telangana Intermediate 1st, 2nd year exam time table released

ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల షెడ్యూల్‌
మే 3: సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
మే 5: ఇంగ్లిష్‌ పేపర్‌-2
మే 7: మ్యాథ్స్‌ పేపర్‌-2ఏ, బోటనీ-2, సివిక్స్‌-2, సైకాలజీ-2
మే 10: మ్యాథ్స్‌ పేపర్‌-2బీ, జువాలజీ-2, హిస్టరీ-2,
మే 12: ఫిజిక్స్‌ పేపర్‌-2, ఎకనామిక్స్‌-2, క్లాసికల్ లాంగ్వేజ్-2
మే 15: కెమిస్ట్రీ పేపర్‌-2, కామర్స్‌-2, సోషియాలజీ-2, ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్-2
మే 18: జియాలజీ పేపర్-2, హోం సైన్స్2, పీఏ2, లాజిక్ పేపర్2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్2(బైపీసీ విద్యార్థులకు)
మే 20: మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్2

చంద్రబాబుపై నిమ్మగడ్డ చర్యలు? -పార్టీ రహిత ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టోనా? -వైసీపీ తీవ్ర అభ్యంతరంచంద్రబాబుపై నిమ్మగడ్డ చర్యలు? -పార్టీ రహిత ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టోనా? -వైసీపీ తీవ్ర అభ్యంతరం

English summary
Education Minister P Sabita Indrareddy has released the Telangana Inter Exam 2021 time table today, January 28, 2021. The first-year exam would be conducted from May 1 to May 19, 2021, and the second year exam would be conducted from May 2 to May 20, 2021. Telangana Intermediate 1st, 2nd exam time table is available on the official site of Manabadi on manabadi.co.in.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X