వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

TS LAWCET-2020 Reults విడుదల, ఎక్కడ చూడాలంటే..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉస్మానియా యూనివర్శిటీ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ లాసెట్ ఫలితాలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మండలి ఛైర్మెన్ పాపిరెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. మూడేళ్ల కోర్సులో పాస్‌ శాతం 78.60గా ఉండగా ఐదేళ్ల కోర్సులో పాస్ శాతం 62.35గా ఉందని పాపిరెడ్డి తెలిపారు. ఇక పీజీఎల్‌సెట్‌లో 91.04గా ఉత్తీర్ణత శాతం ఉంది.

మూడేళ్ల లాసెట్ కోర్సుకు జరిగిన పరీక్షలో సీహెచ్ స్నేహ తొలి ర్యాంకు సాధించగా... ఐదేళ్ల కోర్సు పరీక్షలో ఎస్ఎస్‌కే పంచజన్య ఫస్ట్ ర్యాంక్ పొందింది. ఇక పీజీఎల్‌సెట్‌లో టీ ప్రవల్లి తొలి ర్యాంకు సొంతం చేసుకుంది. ఇక పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలను lawcet.tsche.ac.inకు లాగిన్ అయి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

TS LAWCET-2020 Reults declared , Here is how you need to download

మొత్తం 30,310 మంది అభ్యర్థులు టీఎస్‌లాసెట్‌ మరియు పీజీఎల్‌సెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్ 9వ తేదీన 67 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షను నిర్వహించింది ఉస్మానియా యూనివర్శిటీ. ఇక లాసెట్‌లో క్వాలిఫై అయ్యేందుకు అభ్యర్థి 35శాతం పొందాల్సి ఉంటుంది. అంటే మొత్తం 120 మార్కులకు గాను 42 మార్కులు పొందాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ ఎస్టీలకు క్వాలిఫైయింగ్ మార్కులంటూ ఏమీ లేవు.

ఇక ఫలితాల కోసం ముందుగా lawcet.tsche.ac.in అని టైప్ చేసి లాగి అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత రిజల్ట్ లింక్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అనంతరం మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

English summary
TS LAWCET-2020 results have been declared.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X