రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బురద నీటిలో మంత్రి స్నానం, భర్తతో కలిసి కవిత స్నానం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

కరీంనగర్/అదిలాబాద్/నిజామాబాద్: బాసర పుణ్యక్షేత్రం వద్ద గోదావరి పుష్కరాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మంత్రి జోగు రామన్న, ఎంపీ నగేష్, ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, బాపురావు తదితరులు పుణ్యస్నానం ఆచరించారు.

అయితే, బాసరలో బురద నీటిలోనే మంత్రి జోగు రామన్న తదితరులు స్నానం చేయవలసి వచ్చింది. అంతేకాదు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదులు లేవనే ఆరోపణలు వినిపించాయి. ఘాట్లలో సరిపోయేంత నీరు లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. పలు పనులు అసంపూర్తిగానే నిలిచాయి.

అన్ని ఘాట్లలోను పూర్తిస్థఆయిలో నీళ్లు లేవు. దీంతో, ఒకే ఘాట్‌లోనే చాలామంది స్నానం చేస్తున్నారు. దీంతో నీరు బురదమయమవుతోంది. జోగు రామన్న, ఎంపీ నగేష్ అలాగే బురద నీటిలో పుణ్యస్నానం చేశారు. ఆ తర్వాత వీఐపీ ఘాట్‌కు వచ్చి షవర్ బాత్ చేశారు.

పోచారం

పోచారం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, పలువురు మంత్రులు, ఎంపీ కవిత కుటుంబ సమేతంగా పుష్కర స్నానం చేశారు. పుష్కర స్నానం చేస్తున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి.

కవిత

కవిత

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, పలువురు మంత్రులు, ఎంపీ కవిత కుటుంబ సమేతంగా పుష్కర స్నానం చేశారు. పుష్కర స్నానం చేసేందుకు భర్తతో కలిసి వచ్చిన కల్వకుంట్ల కవిత

కవిత

కవిత

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, పలువురు మంత్రులు, ఎంపీ కవిత కుటుంబ సమేతంగా పుష్కర స్నానం చేశారు. పుష్కర స్నానం చేసేందుకు భర్తతో కలిసి వచ్చిన కల్వకుంట్ల కవిత

పుష్కర స్నానం

పుష్కర స్నానం

గోదావరి మహా పుష్కరాలకు తెలంగాణ ఘనంగా స్వాగతం పలికింది. తెలంగాణ పది జిల్లాలనుంచి తండోపతండాలుగా భక్తజనసందోహం గోదావరి తీరానికి చేరుకొని పవిత్ర పుష్కర స్నానాలు చేశారు.

పుష్కర స్నానం

పుష్కర స్నానం

మంగళవారం ఉదయం 6.26 గంటలకు దేవ గురువు బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించగానే ధర్మపురి క్షేత్రంలో పలువురు పీఠాధిపతులు, వేద పండితులు గోదావరి నదీమతల్లి ఒడిలో శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించి, ముఖ్యమంత్రి కెసిఆర్, శోభ దంపతులతో పుష్కర స్నానం చేయించారు. దీంతో మహా పుష్కరాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి.

కవిత

కవిత

బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలంలో కలిపి తొలిరోజు రాత్రి 9 గంటల సమయానికి 11లక్షల మందికిపైగా భక్తులు పవిత్ర స్నానాలు పతఛాకం.

పుష్కర స్నాం

పుష్కర స్నాం

ఒక్క భద్రాచలంలోనే రెండు లక్షలమంది పవ్రితస్నానం చేసినట్లు సమాచారం. ప్రారంభం రోజునే ఇంత సంఖ్యలో ఉంటే మరో పదకొండురోజులపాటు పుష్కరాలు జరుగనున్నందున వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లను మెరుగుపరిచేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.

పుష్కర స్నానం

పుష్కర స్నానం

గోదావరి మహా పుష్కరాలకు తెలంగాణ ఘనంగా స్వాగతం పలికింది. తెలంగాణ పది జిల్లాలనుంచి తండోపతండాలుగా భక్తజనసందోహం గోదావరి తీరానికి చేరుకొని పవిత్ర పుష్కర స్నానాలు చేశారు.

పుష్కర స్నానం

పుష్కర స్నానం

వరంగల్‌లో మూడు స్నానఘట్టాలలో కలిపి మూడులక్షల మంది స్నానం చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 11 ప్రాంతాలలో 18 స్నానఘట్టాలను ఏర్పాటు చేశారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పార్లమెంటు సభ్యురాలు కవిత ఇక్కడ పుష్కరాలను ప్రారంభించారు. 18 స్నానఘట్టాలలో కలిసి సాయంత్రం 5గంటలవరకు లక్షా 80వేల మంది భక్తులు పుష్కరస్నానాలను చేశారు.

పుష్కర స్నానం

పుష్కర స్నానం

కరీంనగర్‌లో 39 స్నానఘట్టాలలో కలిపి రాత్రి 9గంటల వరకు 6లక్షల 50వేల మంది భక్తులు పవిత్రస్నానాలను అచరించారు. కాళేశ్వరలో రెండు లక్షల మంది భక్తులు, ధర్మపురిలో 2లక్షల మంది భక్తులు పుష్కరస్నానం చేశారు.

English summary
TS minister takes holy dip in muddy water, Kavitha in Nizamabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X