వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరికాసేపట్లో తెలంగాణ టెన్త్ ఫలితాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఉదయం 11.30గం.లకు సచివాలయంలోని డీ బ్లాక్‌ కాన్ఫరెన్స్ హాల్‌లో విద్యాశాఖ కార్యదర్శి జనార్థన్ రెడ్డి రిజల్ట్స్ అనౌన్స్ చేయనున్నారు. ఈ ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్ 3 వరకు జరిగిన పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. టెన్త్ ఫలితాలను
‌http:// results.bse.telangana.gov.in,
http:// results.cgg.gov.in వెబ్‌సైట్‌లలో చూడవచ్చు.

ఫలితాలకు సంబంధించి స్కూళ్లు, స్టూడెంట్స్ తమ ఫిర్యాదులు నమోదుచేసేందుకు ఎస్ఎస్‌సీ బోర్డు యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. TSSSCBOARD పేరుతో రూపొందించిన ఈ యాప్ ద్వారా ఫలితాలు తెలుసుకోవడంతో పాటు కంప్లైంట్లు చేయవచ్చు.
www.bse.telangana.gov.in వెబ్‌సైట్ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

TS SSC board will release class 10th results today

యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నాక విద్యార్థి హాల్ టికెట్ నెంబర్, బర్త్ డే ఎంటర్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయ్యాక స్టూడెంట్ పేరు, స్కూల్ డీటెయిల్స్, హాల్ టికెట్ కనిపిస్తుంది. ఏదైనా కంప్లైంట్ చేయాలనుకుంటే విద్యార్థి మొబైల్ నెంబర్‌తో పాటు ఈ మెయిల్ ఐడీ నమోదుచేయాల్సి ఉంటుంది. కంప్లైంట్ సెక్షన్‌లో ఫిర్యాదు రకాన్ని ఎంచుకుని సబ్మిట్ చేయాలి. అలా చేసిన వెంటనే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడీకి కన్‌ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. అయితే ఈ యాప్ ద్వారా ఒక్కసారి మాత్రమే ఫిర్యాదు చేసే అవకాశముంది.

English summary
Telangana state board of secondary education will release the Class 10th result today. In a statement released by the Telangana SSC Board. the board said that the results will be available on its official website, bse.telangana.gov.in.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X