వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

TS SSC RESULTS 2020 : విద్యార్థుల గ్రేడ్లు వెబ్ సైట్ లో .. ప్రాతిపదిక ఇదే .. చూడండిలా !!

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో పరీక్షలు లేకుండానే పదో తరగతి విద్యార్థులను ప్రమోట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే వారి ఇంటర్నల్ మార్కులను ఆధారంగా చేసుకొని గ్రేడ్స్ ఇచ్చి పదో తరగతి విద్యార్థుల ఫలితాలను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.

Recommended Video

TS SSC Exams 2020 : Students Promoted Without Exams | Grade Points Pattern

ఆ ఆర్డినెన్స్ పై తెలంగాణా సర్కార్ కు హైకోర్టు నోటీసులు.. ఉద్యోగుల,పెన్షనర్ల జీతాల రగడ ఆ ఆర్డినెన్స్ పై తెలంగాణా సర్కార్ కు హైకోర్టు నోటీసులు.. ఉద్యోగుల,పెన్షనర్ల జీతాల రగడ

కరోనా కారణంగా డైరెక్ట్ ప్రమోట్ అయిన 10 వ తరగతి విద్యార్థులు

కరోనా కారణంగా డైరెక్ట్ ప్రమోట్ అయిన 10 వ తరగతి విద్యార్థులు


కరోనా వైరస్ ప్రబలుతున్న కారణంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాకపోవడంతో, ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను ప్రమోట్ చేయాలని ఫిలిం కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా చేయడం జరిగిందని పేర్కొన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇక నేడు పదో తరగతి పరీక్షా ఫలితాలను, విద్యార్థులకు ఇచ్చిన గ్రేడ్లను వెబ్సైట్లో పొందుపరిచారు.

ఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగా గ్రేడ్లు

ఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగా గ్రేడ్లు

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు నమోదుచేసుకున్న విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను చేస్తూ నిర్ణయం తీసుకున్నామని, ఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగా గ్రేడ్లు ఇచ్చామని మంత్రి పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలు 5,34,903 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా ఇక వారందరినీ పరీక్షలు లేకుండానే పాస్ చేసినట్లుగా ప్రకటించారు. ఇక గ్రేడ్ ల వివరాలకోసం www.bse.telangana.gov.in లో చూడవచ్చని మంత్రి పేర్కొన్నారు.

 మెమోలు పొందండి ఇలా .. గ్రేడ్స్ కోసం సైట్ ఇదే

మెమోలు పొందండి ఇలా .. గ్రేడ్స్ కోసం సైట్ ఇదే

ఇక విద్యార్థుల పాస్ మెమో లను పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుండి పొందవచ్చని పేర్కొన్నారు. పాస్ మెమో వివరాలలో ఏమైనా తప్పులు ఉంటే, స్కూల్ ప్రధానోపాధ్యాయుల ద్వారా ఎస్ఎస్సి బోర్డుకు పంపించాలని, వెంటనే తప్పులను సరిదిద్దే అవకాశం ఉంటుంది అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇక పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు తమ శక్తి సామర్ధ్యాలు అభిరుచులకు అనుగుణంగా భవిష్యత్తు కోర్సులను ఎంపిక చేసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఇక నేడు మధ్యాహ్నం మూడు గంటల నుండి వెబ్ సైట్ లో పదవ తరగతి ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. ఫలితాల కోసం www.bse.telangana.gov.in లో చూడండి .

English summary
Telangana Board of Intermediate Education on Monday released the marks memo on its official website. minister sabitha indra reddy announced the ssc results 2020. Students can check the grades in official website www.bse.telangana.gov.in for TS SSC marks memo 2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X