వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో సభకు జగన్ రాక: ఏపీ టిడిపి నేతతో కెసిఆర్ టార్గెట్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో నిర్వహించనున్న పార్టీ ప్లీనరీకి హాజరు కానున్నారు. ఈ నెల 22వ తేదీన హైదరాబాదులో నిర్వహిస్తారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో నిర్వహించనున్న పార్టీ ప్లీనరీకి హాజరు కానున్నారు. ఈ నెల 22వ తేదీన హైదరాబాదులో నిర్వహిస్తారు.

కేసీఆర్‌కు వీరితో తలనొప్పేనా?: కేకే తర్వాత డీఎస్‌ ల్యాండ్ స్కాం!కేసీఆర్‌కు వీరితో తలనొప్పేనా?: కేకే తర్వాత డీఎస్‌ ల్యాండ్ స్కాం!

ఈ ప్లీనరీకి తమ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ హాజరవుతారని తెలంగాణ వైసిపి అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఇదివరకే తెలిపారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు 8వేల మందితో ప్లీనరీ నిర్వహిస్తామన్నారు.

కేసీఆర్ వైఫల్యాలు ఎండగడతాం

కేసీఆర్ వైఫల్యాలు ఎండగడతాం

పార్టీని బలోపేతం చేసే దిశగా ప్లీనరీలో చర్చిస్తామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యాలను కూడా ఎండగడతామన్నారు.

కేసీఆర్ వల్లే దీపక్ రెడ్డి కుంభకోణం

కేసీఆర్ వల్లే దీపక్ రెడ్డి కుంభకోణం

సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు వల్లే టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి భూకుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఎనీవేర్ కరప్షన్‌గా మారిందన్నారు. మియాపూర్ భూకుంభకోణంపై సమగ్ర దర్యాఫ్తు జరపాలన్నారు.

ఏపీకే పరిమితమైన జగన్ ఇప్పుడు..

ఏపీకే పరిమితమైన జగన్ ఇప్పుడు..

కాగా, విభజన అనంతరం జగన్ ఏపీకే పరిమితమైన విషయం తెలిసిందే. చంద్రబాబు ప్రభుత్వం పైనే పోరాడుతున్నారు. ఏపీలో వైసిపి దాదాపు పూర్తిగా కనుమరుగయిందని చెప్పవచ్చు. టిడిపి అయినా ప్రాధాన్యత కోల్పోయినప్పటికీ కేడర్ ఉంది. అప్పుడప్పుడు చంద్రబాబు టిటిడిపిపై దృష్టి సారిస్తున్నారు.

తెలంగాణ ప్లీనరీలో..

తెలంగాణ ప్లీనరీలో..

కానీ జగన్ మాత్రం దాదాపు వదిలేశారు. మొత్తం తన దృష్టిని అంతటినీ ఏపీ పైనే పెట్టారు. అలాంటిది ఇప్పుడు వైసిపి ప్లీనరీలో పాల్గొన్నా పెద్దగా ఉపయోగపడేద లేదని అంటున్నారు. అది కేవలం మొక్కుబడి మత్రమే అవుతుందని అంటున్నారు.

English summary
YSR Congress national president YS Jagan Mohan Reddy will inaugurate the plenary of the Telangana YSRCP here on June 22.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X