వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైద్రాబాద్ మెట్రో‌రైలు: క్షణాల్లోనే గమ్యస్థానానికి, టీ సవారీ యాప్‌ ప్రత్యేకతలివే

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైద్రాబాద్ నగరవాసులు ఎదురుచూస్తున్న మెట్రో రైలు సేవలు నవంబర్ 28వ, తేది నుండి అందుబాటులోకి రానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, తెలంగాణ సీఎం కెసిఆర్ మెట్రో రైలు సేవలను జాతికి అంకితం చేయనున్నారు.హైద్రాబాద్ మెట్రో‌రైలుకు అనేక ప్రత్యేకతలున్నాయి.

షాక్: మెట్రోరైలులో ఇలా చేస్తే జైలుకే, మియాపూర్‌ టూ అమీర్‌పేటకు మోడీ, కెసిఆర్షాక్: మెట్రోరైలులో ఇలా చేస్తే జైలుకే, మియాపూర్‌ టూ అమీర్‌పేటకు మోడీ, కెసిఆర్

Recommended Video

Hyd Metro Rail Latest Information : Tickets Rates, Luggage Charges | Oneindia Telugu

హైద్రాబాద్ మెట్రోరైలు సేవలు ఆలస్యంగానైనా ప్రజలకు తన సేవలను అందించనుంది. మెట్రో రైలు సేవల కోసం నగరవాసులు చాలా కాలం నుండి ఎదురుచూస్తున్నారు. నవంబర్ 28వ, తేది మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కెసిఆర్ మెట్రో రైలు ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు.

మెట్రోరైల్ షాక్: రూల్స్ బ్రేక్ చేస్తే 10 ఏళ్ళ జైలు, జరిమానామెట్రోరైల్ షాక్: రూల్స్ బ్రేక్ చేస్తే 10 ఏళ్ళ జైలు, జరిమానా

మెట్రో సేవలు అందుబాటులోకి వస్తే హైద్రాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలు తప్పే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు మెట్రో రైలులో ప్రయాణం చేసేవారికి సమయం ఆదా అయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

మెట్రో రైలుకు రూ.16,830 కోట్లు

మెట్రో రైలుకు రూ.16,830 కోట్లు

గ్రేటర్‌లో మెట్రో ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ 16,830 కోట్లు . అయితే ఇందులో రూ.13,693 కోట్లు ఎల్‌అండ్‌టీ, రాష్ట్ర ప్రభుత్వం రూ.2,179 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ.958 కోట్లు ఖర్చు చేస్తున్నాయి మెట్రో రైళ్ళ రాకపోకల కోసం 2,800 పిల్లర్లను నిర్మించారు. ప్రస్తుతం ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటలవరకు మాత్రమే మెట్రోరైళ్ళు పనిచేయనున్నాయి. అయితే మూడు మాసాల తర్వాత ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో రైళ్ళు పనిచేస్తాయి.

మూడు మెట్రో కారిడార్లు

మూడు మెట్రో కారిడార్లు

మెట్రో రైల్వే ప్రాజెక్టులో ప్రస్తుతం మూడు కారిడార్లున్నాయి. నాగోల్‌-రాయదుర్గం కారిడార్ 28 కి.మీ, ఎల్బీనగర్‌-మియాపూర్‌ కారిడార్ 29 కి.మీ, జేబీఎస్‌-ఫలక్‌నుమా కారిడార్ 15 కి.మీ. మొత్తం మూడు కారిడార్లలో 72 కి.మీ. మార్గంలో ప్రాజెక్టును 2012లో చేపట్టారు. ప్రస్తుతం పాతనగరంలో 6 కి.మీ మినహా 66 కి.మీ. మార్గంలో పనులు తుదిదశకు చేరుకున్నాయి.2018 చివరి నాటికి మూడు కారిడార్లలో 66 కి.మీ. మెట్రో మార్గం పూర్తి కానుంది.

తొలి దశలో 20 రైళ్ళలో ప్రయాణం

తొలి దశలో 20 రైళ్ళలో ప్రయాణం

తొలిదశ మార్గాల్లో ప్రస్తుతం 20 రైళ్లు మాత్రమే ప్రయాణం సాగిస్తాయి. అయితే మూడు కారిడార్లు పూర్తి చేసిన తర్వాత రైళ్ళ సంఖ్యను 57 కు పెంచనున్నారు.

ఒక్కో రైలులో మూడు బోగీలుంటాయి. అయితే ఒక్కో బోగీలో 330 మంది ప్రయాణించే అవకాశం. మొత్తంగా ఒక ట్రిప్పులో 990-1000 మంది ప్రయాణించవచ్చు. ప్రతి రైలులో ఒక బోగీని మహిళలకు కేటాయించే అవకాశం ఉంది. మూడు కారిడార్లలో 64 స్టేషన్లు ఉంటాయి.

మియాపూర్‌-అమీర్‌పేట్‌ రూట్‌లో 15 నిమిషాలకు రైలు

మియాపూర్‌-అమీర్‌పేట్‌ రూట్‌లో 15 నిమిషాలకు రైలు

మియాపూర్‌-అమీర్‌పేట్‌ రూట్‌ సుమారు 13 కి.మీ ఉంటుంంది. ఈ రూట్‌లో ప్రతి 10-15 నిమిషాలకొకటి చొప్పున మొత్తం 10 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఈ మార్గంలో పది స్టేషన్లున్నాయి. ప్రతి స్టేషన్‌లో 30 సెకన్లపాటు రైలు నిలుపుతారు. మియాపూర్‌లో మెట్రో రైలులో బయలుదేరిన వ్యక్తి అమీర్‌పేట్‌కు 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. అదే బస్‌లో 50 నిమిషాలు, బైక్‌పై 40 నిమిషాల పట్టే అవకాశం ఉంది.

అమీర్‌పేట్‌-నాగోల్‌ రూట్‌లో 10 రైళ్ళు

అమీర్‌పేట్‌-నాగోల్‌ రూట్‌లో 10 రైళ్ళు

అమీర్‌పేట్‌-నాగోల్‌ రూట్‌ సుమారు 17 కి.మీ. దూరం ఉంటుంది. ఈ మార్గంలో ప్రతి 10-15 నిమిషాలకొక రైలు చొప్పున నిత్యం 10 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఈ రూట్లో 14 స్టేషన్లున్నాయి. ప్రయాణికుల డిమాండ్‌ బట్టి ట్రిప్పుల సంఖ్య పెరుగుతుంది. అమీర్‌పేట్‌లో మెట్రోలో బయలుదేరే వ్యక్తి నాగోల్‌కు 25 నిమిషాల్లో చేరుకోవచ్చు. అదే బైక్‌పై అయితే 50 నిమిషాలు, బస్సులో అయితే 75 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉందని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు.

టీ సవారీ యాప్

టీ సవారీ యాప్

ప్రధాని ప్రారంభించనున్న టీ-సవారీ మొబైల్‌ యాప్‌ మెట్రో ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉండనుంది. దీని ద్వారా మెట్రో రైళ్లలో ప్రయాణించే వారు తాము ఎన్ని నిమిషాల్లో గమ్యస్థానం చేరుకోవచ్చు? మెట్రో స్టేషన్‌ నుంచి సమీప కాలనీలకు బస్సు, ఆటో లేదా క్యాబ్‌లో ఎన్ని నిమిషాల్లో చేరుకోవచ్చు? ఇందుకు అయ్యే వ్యయం ఎంత అన్న వివరాలను టీ సవారీ యాప్‌లో పొందుపర్చారు.

English summary
TSavaari Andriod,IOS App For Hyderabad Metro Passengers From 29th Novembers-T Savaari Smart Card Cost,Features.TSavaari App Is Set To Launch By Hyderabad Metro Rail For Passengers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X