వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగులోనూ టిఎస్‌పిఎస్సీ వెబ్‌సైట్: ఘంటా చక్రపాణి వెల్లడి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) వెబ్‌సైట్‌ను తెలుగులోనూ రూపొందించనున్నట్లు కమిషన్‌ చైర్మన్‌ ఘంటా చక్రపాణి వెల్లడించారు. ప్రస్తుతం ఆంగ్ల భాషలో ఉన్న వెబ్‌సైట్‌ను తెలుగులోనూ రూపొందించే బాధ్యతలను టీఎస్‌పీఎస్సీ సభ్యుడు మంగారి రాజేందర్‌కు అప్పగిస్తున్నట్లు తెలిపారు.

TSPSC website in telugu: Ghanta Chakrapani

నిజామాబాద్‌లో సీనియర్‌ సివిల్‌ జడ్జిగా పనిచేసిన సందర్భంలో మంగారి రాజేందర్‌ తెలుగులో తీర్పు వెలువరించి రికార్డు సృష్టించారు. మంగారి రాజేందర్ జింబో పేరుతో కవిత్వమూ కథలూ రాస్టుంటారు. ఈ నేపథ్యంలో కమిషన్‌ వెబ్‌సైట్‌ను తెలుగులో రూపొందించే బాధ్యతలు ఆ యనకు అప్పగించాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది.

ఉద్యోగాల భర్తీలో పారదర్శకంగా వ్యవహరిస్తామని టీఎస్‌పీఎస్సీ కొత్త సభ్యులు టి.వివేక్‌, రామ్మోహన్‌రెడ్డి, డాక్టర్‌ క్రిష్ణారెడ్డి, సీహెచ్‌ విద్యాసాగర్‌రావు అన్నారు. బుధవారం వారితో చైర్మన్‌ ఘంటా చక్రపాణి ప్రమాణం చేయించారు.

TSPSC website in telugu: Ghanta Chakrapani

అయితే, కొత్త సభ్యులు ఆరుగురూ ఈ కార్యక్రమానికి హాజరైనప్పటికీ ప్రభుత్వ సర్వీసుల నుంచి రిలీవ్‌ కాకపోవడంతో మంగారి రాజేందర్‌, ప్రొఫెసర్‌ సాయిలు బాధ్యతలు స్వీకరించలేదు.

English summary
Telangana state public service commission (TSPSC) website will be launched Telugu language, says Ghanta Chakrapani.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X