వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీయస్ఆర్టీసీలో ఛార్జీ పెంపు ఇలా: కనీస ఛార్జ్ రూ 10 నుండి మొదలు..: అర్ద్రాత్రి నుండి అమలు..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

TSRTC Bus Charges Hike : Here Are New Fares || Oneindia Telugu

తెలంగాణ ఆర్టీసీలో ఛార్జీల పెంపు ఖరారైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దీని పైన ఇప్పటికే ప్రకటన చేసారు. ప్రతీ కిలోమీటర్ కు 20 పైసలు చొప్పున ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం తెలంగాణ ఆర్టీసీకి అనుమతి ఇచ్చింది. దీంతో..అనేక రకాల కసరత్తు తరువాత పెంచిన ఛార్జీల వివరాలను తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. ముఖ్యమంత్రి కిలో మీటర్ కు 20 పైసలు పెరుగుతుందని చెప్పినా..కనీస ఛార్జ్ రూ 10 గా ఆర్టీసీ నిర్ణయించింది.

కొన్ని ప్రాంతాల్లో పెంచిన ధరల కారణంగా మినిమం టిక్కెట్ ధర రూ 8 గా ఉంటుందని...దీని కారణంగా చిల్లర సమస్య వస్తుందని అధికారులు వాదించారు. దీంతో..కనీస ఛార్జ్ ను రూ 10 గా అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక, అదే విధంగా బస్సులు..ప్రయాణ దూరం ఆధారంగా ఛార్జీలు పెరగనున్నాయి. పెరిగిన ఛార్జీలు ఈ అర్ద్రరాత్రి నుండి అమల్లోకి రానున్నాయి.

కనీస టిక్కెట్ ధర రూ.10 గా నిర్ణయం..

కనీస టిక్కెట్ ధర రూ.10 గా నిర్ణయం..

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కిలో మీటర్ కు 20 పైసలు చొప్పున టిక్కెట్ ధరలు పెంచుకొనే వెసులుబాటు కలిగిస్తూ ప్రభుత్వం అర్టీసీకి అనుమతి ఇచ్చింది. అయితే, తెలంగాణ ఆర్టీసీ దీని మీద పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు సిద్దం చేసి..ముఖ్యమంత్రికి నివేదించింది. నగరంలో అమల్లో ఉన్న ఛార్జీలను పరగణలోకి తీసుకొని...ఆర్టీసీ కనీస టిక్కెట్ ఛార్జ్ రూ. 10 గా నిర్ణయించారు. ప్రస్తుతం పల్లెవెలుగులో 63 కిలో మీటర్ల వరకు ఉన్న బేసిక్ ధర అమలు చేస్తున్నారు. ఇక నుండి 83 కిలో మీటర్ల కు కనీస ఛార్జ్ రూ 10గా నిర్ణయించారు. అదే విధంగా సెమీ ఎక్స్ ప్రెస్ బస్సు ఛార్జీలను ప్రస్తుతం 75 కిలో మీటర్ల వరకు ఉన్న ఛార్జీని 95 కిలో మీటర్ల వరకు పెంచుతూ కనీస ఛార్జ్ ఈ బస్సుల్లోనూ 10 లుగా నిర్ణయించారు.అయితే ఇతర కేటగిరీ బస్సుల ఆధారంగా కనీస ఛార్జీలు అమలు కానున్నాయి.

మిగిలిన బస్సుల్లో కనీస ఛార్జ్ రూ 15 నుండి ప్రారంభం

మిగిలిన బస్సుల్లో కనీస ఛార్జ్ రూ 15 నుండి ప్రారంభం

పల్లె వెలుగు..సెమీ ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కనీస ఛార్జ్ రూ 10 కాగా..ఆ తరువాత కేటగిరీ కిందకు వచ్చే బస్సుల్లో మాత్రం రూ 15 నుండి మినిమమ్ ఛార్జీగా నిర్ధారించారు. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో రూ.15, అదేవిధంగా డీలక్స్ బస్సుల్లో రూ.20, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో రూ. 25 గా నిర్ణయించారు. ఇక, ఆ తరువాత కేటగిరీకి వచ్చే రాజధాని ఏసీ లేదా వజ్రా ఏసీల్లో కనీస టిక్కెట్ ధర రూ 35 గా నిర్ణయించారు.

అదే విధంగా గరుడ సేవల్లో సైతం ధరలను పెంచారు. గరుడ సేవల్లో కనీస ఛార్జ్ ను రూ.35గా ఖరారు చేసారు. గరుడ ప్లస్ ఏసీ బస్సుల్లో ప్రయాణించాలంటే కనీస టిక్కెట్ ధర రూ.35 గా అధికారులు ఖరారు చేసారు. తెలంగాణ ఆర్టీసీలోని వెన్నెల పేరుతో నడుస్తున్న ఏసీ స్లీపర్ సర్వీసుల్లో మినిమమ్ ఛార్జ్ ను రూ.70 వరకు పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణలోని అన్ని డిపోలకు ఆర్టీసీ యాజమన్యం నుండి ధరలతో కూడిన వివరాలతో ఇచ్చిన అమలు ఆదేశాలు ఇప్పటికే అందాయి.

ప్రయాణీకలపై భారం రూ.700 కోట్లకు పైగానే..

ప్రయాణీకలపై భారం రూ.700 కోట్లకు పైగానే..

ఇక, తెలంగాణ ఆర్టీసీ అభ్యర్ధన మేరకు తాము టిక్కెట్ ధరలు పెంచుకొనేందుకు అనుమతి ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. ప్రస్తుతం ఆర్టీసీ ఉన్న ఆర్డిక పరిస్థితుల నుండి గట్టెక్కాలంటే ధరలు పెంచక తప్పదని వివరణ ఇచ్చారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వం..ఆర్టీసీ కలిసి ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రయాణీకుల మీద సాలీనా దాదాపు రూ 700 కోట్లకు పైగా భారం పడనుంది.

కిలో మీటర్ కు 20 పైసలు అని ముఖ్యమంత్రి చెప్పటం ద్వారా..ప్రయాణ దూరం పెరిగే కొద్దీ ఛార్జీల భారం పెరగనుంది. ఇక, ఆదివారం ఆర్ద్రరాత్రి నుండి పెరిగిన టిక్కెట్ల ధరలు పెంచాలని తొలుత భావించినా.. ఈ అర్ద్రరాత్రి నుండి ధరలు పెంచుతూ తెలంగాణ ఆర్టీసీ అన్ని డిపోలకు ఆదేశాలు ఇచ్చింది. దీని పైన ఇప్పటికే వామపక్షాలు ఆందోళనలు మొదలు పెట్టాయి.

English summary
TSRTC passed order to all bus depos on implementation of new Charges. RTC decided to collect minimum charge as rs 10. By to midnight new charges will be in effect.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X