వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

50 శాతం బస్సులు రైట్ రైట్, రేపటినుంచి అందుబాటులోకి, క్యాబినెట్‌ సమావేశంలో నిర్ణయం...?

|
Google Oneindia TeluguNews

లాక్‌డౌన్ వల్ల డిపోలకే పరిమితమైన ప్రగతి రథ చక్రాలు రహదారులపైకి రానున్నాయి. రేపటినుంచి 50 శాతం బస్సులను నడపాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. సోమవారం సాయంత్రం మంత్రివర్గ సమావేశంలో లాక్ డౌన్‌ సడలింపులు.. బస్సుల రవాణాపై కూడా చర్చించి, నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. మంత్రివర్గ సమావేశానికి హాజరవుతోన్న రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్.. ఆర్టీసీ సేవలకు సంబంధించి సీఎం కేసీఆర్‌కు నివేదిక సమర్పిస్తారని తెలుస్తోంది.

థియేటర్లు , మల్టీ ప్లెక్స్ లను నిండా ముంచేసిన కరోనా లాక్ డౌన్..మూడు నెలల వరకు నో పర్మిషన్?థియేటర్లు , మల్టీ ప్లెక్స్ లను నిండా ముంచేసిన కరోనా లాక్ డౌన్..మూడు నెలల వరకు నో పర్మిషన్?

50 శాతం బస్సులు

50 శాతం బస్సులు


కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగడం, లాక్ డౌన్ కొనసాగడం వల్ల ప్రస్తుతం 50 శాతం బస్సులను నడిపించాలని ప్రభుత్వ యోచిస్తోంది. దీంతో వైరస్ వ్యాప్తి కూడా నివారించొచ్చు అని అభిప్రాయపడింది. కంటోన్మైంట్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతంలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలో మాత్రం ఇప్పట్లో బస్సులను నడిపించే సాహసం సీఎం కేసీఆర్ చేయకపోవచ్చు. కానీ గ్రీన్, ఆరంజ్ జోన్లలో మాత్రం బస్సులు తిరిగే అవకాశం ఉంది. రెడ్ జోన్, కంటైన్మెంట్, బఫర్ జోన్లలో ఆర్టీసీ బస్సులు నడిపించరు. మిగతా చోట్ల పకడ్బందీ ఏర్పాట్లతో బస్సులు నడిపించేందుకు ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే కసరత్తు పూర్తిచేసింది.

50 శాతం సీట్లు

50 శాతం సీట్లు


బస్సుల్లో కూడా 50 శాతం సీట్లలో ప్రయాణికులను ఎక్కించుకొంటారు. ఈ మేరకు బస్సుల్లో మార్పులు చేశారు. మార్పులు చేయని బస్సుల్లో సీటుకు మార్క్.. చేస్తారు. అంటే అందులో ఎవరినీ కూర్చొనియరు. జిల్లాల నుంచి బస్సులను సమీపంలో.. అంటే జేబీఎస్, ఉప్పల్... సరిహద్దుల నిలిపివేసే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే బస్సులకు శానిటైజేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. బస్సు ఒకరోజు పర్యటించి వచ్చాక కూడా శానిటైజ్ చేస్తారు. బస్సుల్లో ఎక్కే ప్రయాణికులకు థర్మల్ స్కీనింగ్ చేస్తారు. సదరు ప్రయాణికుడు విధిగా మాస్క్ ధరించాలి. మాస్క్ లేదంటే... టికెట్ బుక్ చేసుకున్నా ఎక్కేందుకు అనుమతించారు.

Recommended Video

Coronavirus Tension In Hyderabad SBI Bank, 11 Employees Sent To Quarantine
ఛార్జీల పెంపు..?

ఛార్జీల పెంపు..?


బస్సు ఎక్కకముందే కండక్టర్ వద్ద టికెట్ తీసుకోవాలి. పెద్ద బస్టాండ్ల వద్ద టికెట్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. బస్టాఫ్ వద్ద జనం గుమిగూడకుండా ఉండేందుకు సిబ్బందిని కూడా నియమిస్తారు. 50 శాతం బస్సులు నడిపించడం కాదు.. బస్సుల్లో కూడా 50 ప్రయాణికులను తీసుకెళతారు. పల్లెవెలుగు బస్సులో 25 నుంచి 30 మంది వరకు మాత్రమే అనుమతిస్తారు. ఎక్స్ ప్రెస్‌లో 25 మంది వరకు అలో చేస్తారు. సూపర్ లగ్జరీ బస్సులో 17 మందిని మాత్రమే తీసుకెళ్లారు. బస్సుల్లో రెండు సీట్లు ఉంటే ఒకరు, మూడు సీట్లుంటే ఇద్దరినీ కూర్చొనేందుకు అనుమతిస్తారు. దీంతో సంస్థకు నష్టం వచ్చే అవకాశం ఉంది. బస్సు చార్జీలు కూడా పెంచాలని ఆర్టీసీ యాజమాన్యం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.

English summary
tsrtc buses will be start on tuesday green, orange zones. monday cabinet discuss after decide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X