వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ డెడ్ లైన్ ఎపెక్ట్: కార్మికుల అభిప్రాయం మేరకే..: ఆర్టీసీ యూనియన్ల కీలక భేటీ..!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి నిర్ణయించిన డైడ్ లైన్ దగ్గర పడుతోంది. కొన్ని చోట్ల కార్మికులు విధుల్లో చేరుతున్నారు. ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. కార్మికుల్లో ఆందోళన పెరుగుతోంది. దీంతో..ఆర్టీసీ జేఏసీ నేతల మీద ఒత్తిడి పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఫలితంగా..ఇప్పటి వరకు జేఏసీ నేతలు డిసైడ్ చేసిన కార్యాచరణ కార్మికులు అనుసరిస్తున్నారు. అయితే, ఇక నుండి కార్మికుల అభిప్రాయాలకు అనుగుణంగా తాము నడుచుకోవాలని జేఏసీ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగా తాజా పరిణామాలు..ముఖ్యమంత్రి డెడ్ లైన్ పైన కార్మికుల అభిప్రాయాలు తెలుసుకొనేందకు అన్ని డిపోల కార్యదర్శులతో టీయస్ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు సమావేశం అవుతున్నారు. వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనున్నారు.

TSRTC STRIKE:సమర భేరీ మోగించిన ఆర్టీసీ జేఏసీ, సీఎం కేసీఆర్‌పై రేవంత్ నిప్పులు,శెభాష్ అన్న మందకృష్ణTSRTC STRIKE:సమర భేరీ మోగించిన ఆర్టీసీ జేఏసీ, సీఎం కేసీఆర్‌పై రేవంత్ నిప్పులు,శెభాష్ అన్న మందకృష్ణ

కార్మిక సంఘాల కీలక సమావేశం..

కార్మిక సంఘాల కీలక సమావేశం..

మంగళవారం అర్ద్రరాత్రితో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు విధుల్లో చేరేందుకు నిర్ణయించిన గడువు ముగియనుంది. ఇప్పటికే 5100 బస్సులు ప్రయివేటు వారికి ఇస్తున్నట్లు కేబినెట్ నిర్ణయించింది. 5వ తేదీ అర్ద్రరాత్రి లోగా కార్మికులు విధుల్లో చేరకుంటే మిగిలిన అయిదే వెల సర్వీసులను సైతం ప్రయివేటుకు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అదే సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే పరిస్థితి లేదని కేబినెట్ తీర్మానించింది. ఒక రకంగా కార్మికుల పైన సీఎం కేసీఆర్ ఒత్తిడి పెట్టారు. తన బిడ్డలు అంటూనే..వారికి డెడ్ లైన్ విధించారు. కొన్ని చోట్ల కార్మికులు విధుల్లో ఒక్కక్కరుగా చేరుతున్నారు. దీంతో..కార్మిక సంఘాలు అలర్ట్ అయ్యాయి. ఇప్పటి వరకు తాము డిసైడ్ చేసిన కార్యాచరణ అమలు చేసిన కార్మికుల్లో..ముఖ్యమంత్రి ప్రకటన తరువాత ఏ రకమైన అభిప్రాయం ఉంది తెలుసుకోవాలని నిర్ణయించారు. ఇందు కోసం డిపోల వారీగా కార్యదర్శులతో కార్మిక సంఘాలు కీలక సమావేశం కానున్నాయి. కార్మికుల అభిప్రాయాల మేరకే నిర్ణయాలు ఉండాలని ఇప్పటికే నిర్ణయించాయి.

పెరుగుతున్న ఒత్తిడి..

పెరుగుతున్న ఒత్తిడి..

ముఖ్యమంత్రి ఇప్పటికే అయిదు వేల బస్సులను ప్రవేటుకు ఇవ్వాలని ఏకంగా కేబినెట్ లో నిర్ణయించారు. అదే సమయంలో కార్మిక సంఘాల డిమాండ్లు తేలేవి కావని తేల్చి చెప్పారు. మరో వైపు 31 రోజులుగా సమ్మె కొనసాగుతుంది. ప్రభుత్వం మాత్రం ఎక్కడా అవకాశం ఇవ్వటం లేదు. ఇప్పటికీ సెప్టెంబర్ జీతాలు అందలేదు. అక్టోబర్ మాస సైతం పూర్తయింది. ఆర్దిక ఇబ్బందులు..మానసిక సంఘర్షణతో ఆత్మహత్య లు పెరుగుతున్నాయి. ఇక, ప్రభుత్వం తమ డిమాండ్లను పరిశీలించే అవకాశం లేదనే విషయం స్పష్టమవుతోంది. దీంతో..కొందరు నేతుల జేఏసీ నేతల మాటలు కాదని..నేరుగా డిపోల్లోకి వెళ్లి లేఖలు ఇచ్చి విధుల్లో చేరుతున్నారు. ఇవన్నీ ఆర్టీసీ జేఏసీ నేతల మీద ఒత్తిడి పెంచుతున్నాయి. 31 రోజుల పాటు నిర్వహించిన సమ్మె ద్వారా..ప్రభుత్వం ఎప్పటికైనా దిగొస్తుందనే అంచనాలతో..తమ డిమాండ్లు నెరవేరుతా యనే ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ, కేబినెట్ సమావేశం ద్వారా ప్రభుత్వం వైఖరి ఏంటనేది జేఏసీ నేతలకు బోధపడింది. దీంతో..కార్మికుల అభిప్రాయలు తెలుసుకోవాలని నిర్ణయించారు.

కేసీఆర్ వ్యాఖ్యలతో ఆలోచన మొదలు..

కేసీఆర్ వ్యాఖ్యలతో ఆలోచన మొదలు..

ప్రతిపక్ష పార్టీలు ఆర్టీసీ కార్మికులకు ఏ రకంగానూ మేలు చేయలేరని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కార్మికులు ఇప్పటికీ విధుల్లోకి రాకుంటే మిగిలిన అయిదు వేల బస్సులను ప్రయివేటుకు ఇస్తామని.. ఆ తరువాత ప్రతిపక్ష పార్టీల నేతలు సారీ చెప్పి..కార్మికులను వదిలేసి వెళ్లిపోతారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కార్మికులను ఆలోచనల్లో పడేసాయి. ఏం చేసినా..ప్రభుత్వం తమ పట్ల సానుకూలంగా వ్యవహరించే అవకాశాలు కనిపించటం లేదని గ్రహించారు. దీంతో.. తాము హైదరాబాద్ లో కూర్చొని తీసుకొనే నిర్ణయాల కంటే..క్షేత్ర స్థాయిలో కార్మికుల అభిప్రాయాలు తీసుకొని..ఏ నిర్ణయమైనా సమిష్టిగా తీసుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. తమ మధ్య ఐక్యత దెబ్బ తింటే ప్రభుత్వం అవకాశంగా తీసుకుంటుందని..అటువంటి ఛాన్స్ ఇవ్వకుండా ఏకాభిప్రాయం సాధించే దిశగా ఈ సమావేశం ఏర్పాటు చేసారు. దీని ద్వారా ఇప్పుడు కార్మిక సంఘాల జేఏసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
TSRTC JAC leaders called for key meeting with depo secretaries to know workers opinions on strike. Aftet Cm dead line some of the RTC workers joining duties one by one. With this JAC leaders decided to go as per workers opinion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X