వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

TSRTC Strike: అశ్వద్దామ రెడ్డికి ప్రభుత్వం షాక్, టీఎంయూ కార్యాలయానికి తాళం!

|
Google Oneindia TeluguNews

Recommended Video

TSRTC Sensational Decisions Against RTC Unions || Oneindia Telugu

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతగా సమ్మెకు నాయకత్వం వహించిన అశ్వద్దామరెడ్డికి ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. జేఏసీ నేతగా వ్యవహరించిన అశ్వద్దామరెడ్డి ఒక ఆర్టీసీ డ్రైవర్ గా తిరిగి స్టీరింగ్ పట్టాల్సి వచ్చింది. కేవలం అశ్వద్దామరెడ్డికే కాదు. ఆర్టీసీలో యూనియన్లకు హెచ్చరిక చేసింది. యూనియన్‌ కార్యాలయాలకు కేటాయించిన భవనాలకు తాళాలు వేసి స్వాధీనం చేసుకుంది.

నేతలకు ఉన్న సదుపాయాలను రద్దు చేసింది. ఇక మీదట సంఘాల నేతలు కూడా విధులు నిర్వర్తించాల్సిందేనని స్పష్టం చేసింది. యూనియన్‌ నేతలకు వేతనంతో కూడిన సెలవులను రద్దు చేసింది. ముఖ్యమంత్రి యూనియన్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించటంతో..ఆర్టీసీ వీరి విషయంలో వేగంగా అడుగులు వేస్తోంది. మరిన్ని చర్యల దిశగా కసరత్తు చేస్తోంది.

తిరిగి డ్రైవర్ గా అశ్వద్దామరెడ్డి..

తిరిగి డ్రైవర్ గా అశ్వద్దామరెడ్డి..

టీఎంయూ నేత..జేఏసీ నాయకుడు అశ్వద్దామ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చంది. ప్రభుత్వం తరపున ఇక ఆర్టీసీ వ్యవహారాల్లో యూనియన్లకు అవకాశం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేయటం తో..ఆర్టీసీ యాజమాన్యం వేగంగా చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా.. బస్ భవన్ ఆవరణలో టీఎంయూ కార్యాలయానికి అధికారులు తాళం వేసారు.

యూనియన్ల నేతలకు ఉన్న సదుపాయాలను రద్దు చేసింది. ఇక మీదట సంఘాల నేతలు కూడా విధులు నిర్వర్తించాల్సిందే. లేదంటే వేతనాలు అందకపోగా, అనధికారిక గైర్హాజరుగా పరిగణించాలని నిర్ణయించింది. అందులో భాగంగా వారికి ఇప్పటి వరకు ఆ కోటాలో ఉన్న 30 మంది నేతలకు సౌకర్యాలు రద్దు చేసింది. అశ్వద్దామ రెడ్డి తిరిగి ఆర్టీసీ డ్రైవర్ గా విధుల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయాన్ని ఆర్టీసీ యాజమాన్యం పరోక్షంగా తేల్చి చెప్పింది.

కార్మిక నేతల సదుపాయాల్ కట్..

కార్మిక నేతల సదుపాయాల్ కట్..

ఆర్టీసీ యాజమాన్యం యూనియన్లకు షాకిచ్చింది. యూనియన్‌ కార్యాలయాలకు కేటాయించిన భవనాలకు తాళాలు వేసి స్వాధీనం చేసుకుంది. నేతలకు ఉన్న సదుపాయాలను రద్దు చేసింది. ఇక మీదట సంఘాల నేతలు కూడా విధులు నిర్వర్తించాల్సిందే. లేదంటే వేతనాలు అందకపోగా, అనధికారిక గైర్హాజరుగా పరిగణించాలని నిర్ణయించింది. సాధారణంగా ఆర్టీసీలో గుర్తింపు పొందిన యూనియన్‌ కేంద్ర కార్యాలయానికి బస్‌ భవన్‌ ఆవరణలో యాజమాన్యం భవన వసతి కల్పిస్తుంది.

ఆ యూనియన్‌ నేతలకు వేతనంతో కూడిన సెలవులు, ప్రయాణానికి రెడ్‌, బ్లూ వారెంట్స్‌ సౌకర్యాలు కల్పిస్తుంది. ఇలాంటివాటన్నంటినీ యాజమాన్యం రద్దు చేసింది. కార్మిక నేతలు ఇకపై విధుల్లో పాల్గొనాల్సిందేనని స్పష్టం చేసింది.

టీఎంయూ ను వెంటాడుతారా..

టీఎంయూ ను వెంటాడుతారా..

ఆర్టీసీలో తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ గుర్తింపు పొందిన యూనియన్‌గా ఉండేది. దీని గడువు 2018 ఆగస్టు 7తో ముగిసింది. ఈ యూనియన్‌ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వంటి మొత్తం 26 పోస్టుల్లోని నేతలకు వేతనంతో కూడిన సెలవుల వసతి కల్పించింది. ఎంప్లాయిస్‌ యూనియన్‌కు చెందిన ముగ్గురు నేతలకు, ఖమ్మం రీజియన్‌లో గెలుపొందిన ఎస్‌డబ్ల్యూఎఫ్‌ నేతకూ ఈ వసతి కల్పించింది. ఇలా మొత్తం 30 మంది యూనియన్‌ నేతలకు విధులు నిర్వహించకపోయినా వేతనాలిచ్చే అవకాశాన్ని కల్పించారు.

అలాగే గుర్తింపు పొందిన టీఎంయూ జోనల్‌ సెక్రటరీలకు వారంలో 3, రీజినల్‌ సెక్రటరీలు, డిపో సెక్రటరీలకు వారంలో ఒకటి చొప్పున ఫ్రీ మస్టర్‌ సౌకర్యాన్ని కల్పించారు. శుక్రవారం ఈ సెలవులన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కార్మిక నేతలు ఇకపై విధుల్లో పాల్గొనాల్సిందేనని స్పష్టం చేసింది. టీఎంయూ కేంద్ర కార్యాలయానికి తాళం వేసింది.

English summary
TSRTC management announced key decisions against unions and leaders. seized offices and cancelled the facilities for union leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X