వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఎస్ఆర్టీసీ సమ్మె , తప్పుడు నివేదికలు ఇచ్చినందుకు క్షమాపణలు కోరిన అధికారులు

|
Google Oneindia TeluguNews

Recommended Video

#TSRTCSamme : High Court Order On TSRTC Samme To Solve The Problem By Nov 11th || Oneindia Telugu

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. కోర్టు ఆదేశాలతో తెలంగాణ ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి రామక్రిష్ణరావుతో పాటు ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునిల్ శర్మకు కోర్టుకు హజరై తమ వాదనలు వినిపిస్తున్నారు. గతంలో సమర్పించిన నివేదికల్లో తప్పుడు సమచారం ఇవ్వడంపై అధికారులు కోర్టును క్షమాపణలు కోరినట్టు తెలుస్తోంది. అయితేకోర్టు మాత్రం అధికారుల క్షమాపణలపై సిరియస్ అయినట్టు సమాచారం . తప్పుడు నివేదికలు ఇచ్చి క్షమాపణలు కొరితే సరిపోతుందా అంటూ వ్యాఖ్యానించింది. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు సంబంధిత మంత్రులకు తప్పుడు నివేదికలు ఇచ్చిన వారు కోర్టుకు ఇచ్చిన వాటిని ఎలా నమ్మాలని ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

అధికారుల విభిన్న నివేదికలు

అధికారుల విభిన్న నివేదికలు

గత కోద్ది రోజులుగా ఆర్టీసీ సమ్మెపై వాదనలు వింటున్న కోర్టుకు అధికారులు తప్పుడు నివేదికలు అందించారని భావించడంతో సమగ్ర సమాచారాన్ని ఆర్ధికశాఖ, ఆర్టీసీ మరియు మున్సిపల్ శాఖల ఉన్నతాధికారులను విడివిడిగా అఫిడవిట్లు దాఖలు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు ఉన్నతాధికారులు కోర్టుకు హజరై ప్రత్యేకంగా వివరణ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా గతంలో ప్రభుత్వమే ఆర్టీసీకి 1000 కోట్ల రూపాయలు బాకి ఉందని ఆర్టీసీ ఎండీ అఫిడవిట్‌లో పేర్కోన్నారు. మరోవైపు ప్రభుత్వం నుండి ఆర్టీసీకి నిధులు రావాలని మంత్రి పువ్వాడ అజయ్‌కు సైతం అధికారులు నివేదికలు ఇచ్చారు.

కోర్టుకు హజరైన సీఎస్, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి

కోర్టుకు హజరైన సీఎస్, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి

అయితే ప్రభుత్వం మాత్రం ఆర్టీసీకి ఎలాంటీ బకాయిలు లేవని చెబుతుండడంతో దీనికి సంబంధించిన విచారణనను ఈనెల ఒకటిన చేపట్టిన హైకోర్టు సమగ్ర సమాచారంతో ఆయా ఉన్నతాధికారులు కోర్టుకు నవంబర్ ఆరవ తేదిలోగా అఫిడవిట్‌లు సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం సీఎస్ ఎస్కే జోషితోపాటు ఆర్ధిక శాఖ, ఆర్టీసీ ఉన్నతధికారులతో పాటు జీహెచ్‌ఎంసీ కమీషనర్ సైతం కోర్టుకు హజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అధికారులు విచారణకు హజరయ్యారు.

ఆర్టీసీ... ప్రభుత్వానికి బాకి...

ఆర్టీసీ... ప్రభుత్వానికి బాకి...

బుధవారం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఆర్టీసీనే ప్రభుత్వానికి 500 కోట్ల రుపాయాలు మోటారు వాహన చట్టం క్రింద చెల్లించాల్సిన పన్ను బకాయిలు ఉన్నాయని తెలిపింది. ఇందుకు సంబంధించి ఆర్టీసీకి నోటీసులు కూడ పంపారు. మరోవైపు ఆర్టీసి ఇవ్వాల్సిన దానికంటే అదనంగా మరో 900 కోట్ల రుపాయలు ఇచ్చారని అధికారులు పేర్కోన్నారు. కాగా జీహెచ్‌ఎంసీ సైతం ఆర్టీసీకి ఎలాంటీ బకాయిలు లేవని కోర్టుకు తెలిపింది. జీహెచ్‌ఎంసీనే ఆర్ధికలోటులో ఉందని, దీంతో ఆర్టీసీకి నిధులు ఇవ్వడం లేదని పేర్కోన్నారు.

English summary
Telangana Finance Chief Secretary Ramakrishnan Rao and RTC Incharge MD Sunil Sharma are presenting their arguments in High Court
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X