వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఎస్ఆర్టీసీ సమ్మె, మరింత జఠిలం.. లేబర్ కమీషనర్‌కు బదిలీ కోరిన ప్రభుత్వం..18కి వాయిదా,

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ సమ్మె మరింత కాలయాపన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు సూచించినట్టుగా సుప్రిం కోర్టు మాజీ న్యాయమూర్తులతో కూడిన కమిటీకి రాష్ట్రప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో వివాదాన్ని లేబర్ కమీషనర్‌కు బదీలీ చేయాలని ప్రభుత్వం కోరింది. చట్టవ్యతిరేకమైన సమ్మెను విచారించి ఆదేశాలు జారీ చేసేందుకు.. హైకోర్టుకు అధికారాలు లేవని స్పష్టం చేసింది. సమ్మె అనేది కార్మికుల సమస్యలతో కూడిన అంశం కాబట్టి... లేబర్ కమీషనర్ కార్యాలయానికిబదీలీ చేయాలని కోరింది. ప్రభుత్వ వాదనలు విన్న హైకోర్టు ఆర్టీసీ ఈనెల 18న వాయిదా వేసింది.

ఎన్జీవో నేతలు సీఎంకు చెంచాగిరి చేస్తున్నారు... అందుకే ఆర్టీసీ ఉద్యమంలో కనబడడం లేదు : జగ్గారెడ్డిఎన్జీవో నేతలు సీఎంకు చెంచాగిరి చేస్తున్నారు... అందుకే ఆర్టీసీ ఉద్యమంలో కనబడడం లేదు : జగ్గారెడ్డి

లేబర్ కమీషనర్‌కు బదీలీ చేయండి

లేబర్ కమీషనర్‌కు బదీలీ చేయండి

ఆర్టీసీ సమ్మెపై తీర్పు మరోసారి వాయిదా పడింది. సమ్మెపై నేడు వాదనలు కొనసాగిన నేపథ్యంలోనే ఈనెల 18కి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా వాడివేడి వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి సంబంధించి ఎలాంటీ ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు అంగీకరించకపోవకపోవడంతో సమస్య మరింత జఠిలం కానుట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్టీసీ సమ్మెను విచారిస్తున్న కోర్టుకు పూర్తి అధికారులు లేకపోవడంతో లేబర్ కోర్టుకు విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేయాలని కోరింది.

విభజనకు కేంద్రం అనుమతి తప్పనిసరి

విభజనకు కేంద్రం అనుమతి తప్పనిసరి

మరోవైపు ఆర్టీసీ విభజనపై కూడ కోర్టులో వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ విభజనకు కేంద్ర అనుమతి తప్పనిసరి అని కోర్టు వ్యాఖ్యానించింది.అయితే టీఎస్ ఆర్టీసీ ఏర్పాటుకు కేంద్రం అనుమతి తప్పనిసరి కాదని, ట్రాన్స్‌పోర్ట్‌ పై రాష్ఠ్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉన్నాయని తెలిపింది. పునర్విభజన చట్టం ప్రకారం ఆర్టీసీని ఏర్పాటు చేశామని ప్రభుత్వం వివరించింది. అయితే సెక్షన్ 47 ప్రకారం కేంద్రం అనుమతి లేదని, ఇందుకోసం కేంద్రం అనుమతి తప్పనిసరి అని కోర్టు అభిప్రాయపడింది.

లేబర్ కోర్టుతో మరింత జాప్యం

లేబర్ కోర్టుతో మరింత జాప్యం

ప్రస్తుతం కోర్టులో కొనసాగుతున్న వాదనలు మళ్లి మొదటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నలబై రోజులుగా సమ్మె కొనసాగుతుండగా...ఒకవేళ లేబర్ కమీషనర్‌కు బదిలీ చేసిన నేపథ్యంలోనే పలు అంశాలు మరోసారి చర్చకు రానున్నాయి. దీంతో చర్చలు మొదటికి రానున్నాయి. మరోవైపు లేబర్ కమీషనర్‌ విచారణ అనంతరం కూడ తిరిగి లేబర్ కోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని మంగళవారం జరిగిన వాదనల్లో పిటిషనర్ తరుఫున న్యాయవాది వివరించారు. అయితే అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమవుతుండడంతో సమస్య తిరిగి మళ్లి మొదటికి వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై గురువారం మరోసారి వాదనలు జరగనుంది.

English summary
The ongoing arguments over the RTC strike are over. arguments were postponed to 18th of this month. but the case to be referred to the Labor Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X