వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఎస్ఆర్టీసీ సమ్మెతో ఏపీఎస్ఆర్టీసీకి కాసుల పంట .. మెట్రో నగరాల నుండి అదనపు సర్వీసులు

|
Google Oneindia TeluguNews

Recommended Video

TSRTC Samme : TSRTC Buses To Go Off Road From Today || RTC సమ్మెతో తీవ్రఇబ్బందల్లో ప్రయాణికులు

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలో ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పండుగ సందర్భంగా వెళుతున్న ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఏపీఎస్ఆర్టీసీ 500 అదనపు సర్వీసులను నడిపించాలని నిర్ణయం తీసుకుంది. అయితే సమస్య తీవ్రత దృష్ట్యా మరో రెండు వందల సర్వీసులను కూడా నడపనుంది. దీంతో మొత్తం ఏపీఎస్ఆర్టీసీ హైదరాబాద్ నుండి 700 అదనపు సర్వీసులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నడుపుతోంది. దీని కోసం ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసిన ఏపీఎస్ఆర్టీసీ ఇప్పుడు ఈ సీజన్ లో తెలంగాణా ఆర్టీసీ ఖాతాలో పడే సొమ్మును సైతం తమ ఖాతాలో వేసుకోనుంది.

తెలంగాణాలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె .. బస్సులు బంద్ .. డిపోల వద్ద 144 సెక్షన్తెలంగాణాలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె .. బస్సులు బంద్ .. డిపోల వద్ద 144 సెక్షన్

 అదనపు సర్వీసులు నడుపుతున్న ఏపీఎస్ ఆర్టీసీ

అదనపు సర్వీసులు నడుపుతున్న ఏపీఎస్ ఆర్టీసీ

ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణా ఆర్టీసీలో సమ్మె కొనసాగుతున్న కారణంగా బెంగళూరు నుంచి 350, చెన్నై నుంచి 150 బస్సు సర్వీసులను ఏపీలోని వివిధ ప్రాంతాలకు నడుపుతోంది. ఇక శనివారం హైదరాబాద్ నుండి 350 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్న ఏపీఎస్ఆర్టీసీ అదనంగా 150 బస్సు సర్వీసులను కూడా నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దసరా సెలవుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్న ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తగిన చర్యలు చేపడుతోంది.

ఏపీ సర్కార్ నిర్ణయమే తెలంగాణలో తీవ్ర ఆందోళనకు కారణం

ఏపీ సర్కార్ నిర్ణయమే తెలంగాణలో తీవ్ర ఆందోళనకు కారణం

ఇటీవలే ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలో విలీనం చేసి, ఆర్టీసీ ఉద్యోగుల అందర్నీ ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించింది. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏపీఎస్ఆర్టీసీ ని పండుగ సమయంలో లాభాల బాట పట్టించనుంది. ఏపీ సర్కార్ ఏపీఎస్ ఆర్టీసీ విషయంలో తీసుకున్న నిర్ణయం చాలా సాహసోపేతమైన నిర్ణయం. ఆ నిర్ణయమే ఇప్పుడు తెలంగాణా ఆర్టీసీ కార్మికులను సైతం ఉద్యమ బాట పట్టించింది అని చెప్పక తప్పదు.

 సమ్మెతో నష్టాల్లో తెలంగాణా ఆర్టీసీ .. అదనపు సర్వీసులతో సొమ్ము చేసుకునే పనిలో ఏపీఎస్ఆర్టీసీ

సమ్మెతో నష్టాల్లో తెలంగాణా ఆర్టీసీ .. అదనపు సర్వీసులతో సొమ్ము చేసుకునే పనిలో ఏపీఎస్ఆర్టీసీ

నష్టాల బాటలో ఉన్న ఆర్టీసీని బతికించాలంటే ప్రభుత్వ శాఖలో విలీనం చెయ్యాలని ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు. ఏపీ సర్కార్ తరహా నిర్ణయం కోసం కార్మికులు ఆందోళన చేస్తున్నారు. కానీ భవిష్యత్ పరిణామాలు ఆలోచించకుండా సీఎం కేసీఆర్ విలీనంపై నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఏపీలో ఒకవేళ సక్సెస్ అయితే అప్పుడు కేసీఆర్ ఆలోచించే అవకాశం వుంది. ఏపీ ప్రభుత్వానికి సైతం ప్రభుత్వ శాఖలో విలీనం చేసిన ఆర్టీసీని ముందుకు నడిపించటం కత్తిమీద సామే. కానీ కార్మికులు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి తమ సహకారం అందించటానికి సిద్ధంగా వున్నారు. ఇక ఇప్పుడు తెలంగాణా లో ఆర్టీసీ సమ్మె నేపధ్యంలో తెలంగాణా ఆర్టీసీ మరింత నష్టాల్లో మునిగిపోతుండగా ఏపీఎస్ ఆర్టీసీ అదనపు సర్వీసులతో సొమ్ము చేసుకునే పనిలో పడింది.

 టీఎస్ ఆర్టీసీ సమ్మెకు ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ మద్దతు

టీఎస్ ఆర్టీసీ సమ్మెకు ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ మద్దతు

ఇక తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న టీఎస్ ఆర్టీసీ సమ్మెకు ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ తమ పూర్తి మద్దతు తెలియజేసింది. కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న సమ్మెకు తమ మద్దతు ఉంటుందని ఏయూ ప్రకటించింది. ఏపీలో సైతం ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా పలు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ అధ్యక్షుడు వై వి రావు ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర రావు తెలియజేశారు. ఒకపక్క టి ఎస్ ఆర్ టి సి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతూ తీవ్ర సమస్య ఉత్పన్నం కాకుండా సమస్యను పరిష్కరించాలని ప్రయత్నం చేస్తోంది. మరోపక్క ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్మికుల పక్షాన నిలిచి ఆందోళనలు చేపడతామని చెబుతోంది. ఏదేమైనప్పటికీ తెలంగాణలో కొనసాగుతున్న సమ్మె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగానూ అనుకూలంగానే మారింది .

English summary
The decision of the Telangana RTC workers strike gave a chance to the APSRTC. APSRTC has decided to run 500 additional services to avoid the inconvenience of peoplewho are traveling from Telangana to Andhra Pradesh during the festival. However, in view of the severity of the problem, another two hundred services will be operated. With the strike Telangana RTC account this season will also be credited to the account of APSRTC .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X