వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఎస్ఆర్టీసీ సమ్మె,..సీఎం కేసీఆర్‌కు కనీసం మానవత్వం లేదు...ఆయన్ను భరించే ఓపిక ప్రజలకు లేదు...

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సీఎం ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు కంకణం కట్టుకున్నారని అన్నారు. ఇక సీఎం కేసీఆర్‌కు కార్మికులపై కనీసం మానవత్వం లేకుండా నిన్నటి ప్రెస్‌మీట్‌లో మాట్లాడరని విమర్శించారు. సీఎం మాట్లాడుతున్నంత సేపు అహంకారం కనిపించిందని అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కారించాలనే కనీస ఆలోచించకుండా నియంతలాగా వ్యవహరించారని చెప్పారు. కార్మికులు చచ్చినా, బతికినా తనకు సంబంధం లేదన్నట్టుగా కేసీఆర్ మాటల ద్వార వ్యక్తమైందని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.

కార్మికులు బలైన... ప్రైవేటికరణే లక్ష్యంగా సీఎం పావులు

కార్మికులు బలైన... ప్రైవేటికరణే లక్ష్యంగా సీఎం పావులు

శనివారం సాయంత్రం క్యాబినెట్ సమావేశం తర్వాత సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై సుదీర్ఘంగా ప్రసంగించిన విషయం తెలిసిందే.. అయితే సీఎం కేసీఆర్ మాట్లాడిన తీరుపై ఎంపీ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన మాటల ద్వార ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనే లక్ష్యంతో ఉన్నారని అన్నారు. కొంతమంది వ్యక్తులకు ఆర్టీసీని అప్పగించేందుకు ఆయన పావులు కదుపుతున్నారని ఆరోపణలు చేశారు. ఇందుకోసం ఆర్టీసీ ఉద్యోగుల ప్రాణాలను బలిపెట్టడానికైనా తాను సిద్దమయ్యాననే సంకేతాలను ఇచ్చారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కోర్టులు చెప్పినా కనీసం వాటిని అమలు చేసే పరిస్థితి లేదని అన్నారు. దీంతో సీఎంకు కోర్టులపై కూడ గౌరవం లేదని విమర్శించారు.

అప్పుడు మంచి ఇప్పుడు చెడ్డవారు

అప్పుడు మంచి ఇప్పుడు చెడ్డవారు

ఇక కార్మికులు అంటే అంటరాని వారుగా సీఎం మాటల్లో కనిపించిందని, ఆర్టీసీ సంఘం ఆయనకు అనుబంధంగా ఉన్నప్పుడు కార్మికులంతా మంచివాళ్లుగా కనిపించారని, ఇప్పుడు చెడ్డవాళ్లుగా కనిపించడంలో ఎలాంటీ అంతర్యం ఉందని ప్రశ్నించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు సీఎం అడడగడమే కార్మిక నాయకులు చేసిన తప్పా అంటూ నిలదీశారు. ఈనేపథ్యంలోనే సీఎం కేసీఆర్ వ్యక్తిగత ఎజెండాతో ముందుకు సాగుతున్నారని ఆరోపణలు చేశారు. సమ్మెను పరిష్కరంచేందుకు, ఇతర పార్టీలు, ప్రజాసంఘాలతోపాటు కోర్టులు పలు సూచనలు చేసినా...సీఎం తన సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

ప్రైవేటికరణకు అడ్డంకిగా మారింది సంఘాలే..

ప్రైవేటికరణకు అడ్డంకిగా మారింది సంఘాలే..

ఇక ఆర్టీసీని ప్రవైట్ పరం చేసేందుకు అడ్డంకింగా మారింది కార్మిక యూనియన్లే కాబట్టి వాటిని అడ్డుతొలగించుకునేందుకు సీఎం కుయుక్తులు పన్నుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే కార్మిక సంఘనాయకులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని విమర్శించారు. దీంతో కార్మికులను నాయకత్వం నుండి వేరు చేసేందుకే ఈనెల 5వ తేదిలోగా కార్మికులు విధులో చేరాలని ప్రకటించారని అన్నారు. నెల రోజులు గడుస్తున్న కార్మికుల సమస్యను మానవత్వంతో వ్యవహరించకుండా...ప్రజల పరిస్థితులను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న సీఎంను ఇక ఒక్క క్షణం కూడ భరించేందుకు తెలంగాణ సమాజాం సిద్దంగా లేదని అన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మరో ఉద్యమం తీవ్రరూపం దాల్చాల్చిన సమయం ఆసన్నమైందని రేవంత్ రెడ్డి అన్నారు.

English summary
congress mp revanth reddy criticised once again cm kcr.cm behavior like Dictator on rtc strike. and telangana people never like his attitude he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X