వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆనాడు ఆర్టీసీకి జై.. ఈనాడు కేసీఆర్‌కు సై.. మంత్రి ఎర్రబెల్లి తీరు ఇలా..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఆనాడు అలా మాట్లాడారు. ఈనాడు ఇలా మాట్లాడారు. ఆనాడేమో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణాస్త్రాలు సంధించారు. ఈనాడేమో అదే ప్రభుత్వానికి వంత పాడుతున్నారు. తేడా ఎక్కడొచ్చిదంటే పదవి దగ్గర అనేది స్పష్టమవుతూనే ఉంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై 2015లో అలా.. ఇప్పుడేమో ఇలా మాట్లాడారంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సంబంధించిన వీడియో క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అప్పుడేమో ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా మాట్లాడిన ఎర్రబెల్లి.. ఇప్పుడేమో మంత్రి పదవి వచ్చాక ప్లేట్ ఫిరాయించారని నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే తాను అప్పుడు ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను ఏమీ అనలేదనే రీతిలో వివరణ ఇచ్చారు మంత్రి.

ఆనాడు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఎర్రబెల్లి

ఆనాడు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఎర్రబెల్లి

2015లో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు అప్పటికీ ఇంకా టీఆర్ఎస్ పార్టీలో చేరలేదు. అందుకే గులాబీ తీర్థం తీసుకోలేని క్రమంలో సపోర్ట్ చేశారని.. ఇప్పుడేమో కారెక్కి మంత్రి పదవి రావడంతో ప్రభుత్వానికి వంత పాడుతున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఆనాడు ఆయన మాట్లాడిన వీడియో క్లిప్పును.. తాజాగా మంత్రి హోదాలో ఆయన చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోను జోడించి నాడు - నేడు అనే రీతిలో వైరల్ అవుతున్న వీడియో ఎర్రబెల్లికి కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది.

అక్కడ టీఆర్ఎస్‌కు కష్టమేనా.. ఈ లెక్కలు ఆ పార్టీకి అనుకూలమా?అక్కడ టీఆర్ఎస్‌కు కష్టమేనా.. ఈ లెక్కలు ఆ పార్టీకి అనుకూలమా?

నాటి వీడియో బైట్ నేడు వైరల్.. ఆనాడు ఏమన్నారంటే..!

నాటి వీడియో బైట్ నేడు వైరల్.. ఆనాడు ఏమన్నారంటే..!

2015, మే 5వ తేదీన ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడిన వీడియో బైట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆనాడు టీఆర్ఎస్ గూటికి చేరని ఎర్రబెల్లి టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడి కేసీఆర్ సర్కార్‌కు చురకలు అంటించారు. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం ఎందుకు మొండిగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఎండనక, వాననక నిరంతరం శ్రమించే ఆర్టీసీ ఉద్యోగుల పట్ల ఎందుకింత కక్ష అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నిలదీశారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని.. వారిని విస్మరించొద్దని సూచించారు.

మీ కుటుంబానికి పదవులొస్తే సరిపోతుందా.. డిమాండ్ల సాధనకు ఆందోళన చేస్తే పోలీసులతో కొట్టిస్తారా.. మహిళా కార్మికులపై మగ పోలీసులు చేయి చేసుకుంటారా అంటూ ప్రశ్నించారు. పిచ్చి తుగ్లక్ లెక్క మాట్లాడతావు.. అదీ ఇదీ కడతానంటావు.. అవేవో కట్టే బదులు కార్మికుల సంక్షేమానికి ఎంతో కొంత కేటాయించు కదా అంటూ కేసీఆర్‌పై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు ఎర్రబెల్లి.

సైకిల్ దిగి కారెక్కి.. మంత్రిగా ఈనాడు

సైకిల్ దిగి కారెక్కి.. మంత్రిగా ఈనాడు

తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారడంతో ఎర్రబెల్లి కూడా తన రూట్ మార్చారు. సైకిల్ దిగి కారెక్కేశారు. మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీచేసి ఏకంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆ క్రమంలో ఆర్టీసీ సమ్మెకు సంబంధించి ఆదివారం (13.10.2019) నాడు మంత్రి హోదాలో ఆయన మాట్లాడిన తీరు చర్చానీయాంశమైంది. ఆనాడు కార్మిక పక్షపాతిగా మాట్లాడిన ఎర్రబెల్లి ఈనాడు మంత్రి పదవి రావడంతో ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు గుప్పుమన్నాయి.

మంత్రిగా ప్రభుత్వానికి వత్తాసు.. ఈనాడు ఇలా

మంత్రిగా ప్రభుత్వానికి వత్తాసు.. ఈనాడు ఇలా

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మెనిఫెస్టోలో చెప్పలేదన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆర్టీసీ యూనియన్ లీడర్లు ప్రతిపక్ష నేతల వలలో పడ్డారని చెప్పుకొచ్చారు. వాళ్ల చెప్పుడు మాటలు విని వీళ్లు రెచ్చిపోతున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయంగా తెలంగాణ ప్రభుత్వం మీద కుట్ర చేయడానికే ఇలా చేస్తున్నారని తెలిపారు. 25 శాతం ఫిట్‌మెంట్ అడిగితే ఆర్టీసీ కార్మికుల మీద ప్రేమతో సీఎం కేసీఆర్ 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన అంశం మరచిపోయారా అంటూ ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తామని కేసీఆర్ ఎన్నడూ చెప్పలేదని.. అదంతా బీజేపీ, కాంగ్రెస్ నేతలు చిత్రీకరిస్తున్న ఎత్తుగడ అని చెప్పుకొచ్చారు. ఆర్టీసీని బలోపేతం చేయాలన్నదే కేసీఆర్ అభిమతమని.. కార్మికులను ఇబ్బందులకు గురిచేయాలన్నది ఆయన ఉద్దేశం కాదని చెప్పుకొచ్చారు.

రాసిచ్చిన స్క్రిప్టులేనా.. మంత్రుల సేమ్ డైలాగ్స్.. ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ ఖతర్నాక్ ప్లాన్..!రాసిచ్చిన స్క్రిప్టులేనా.. మంత్రుల సేమ్ డైలాగ్స్.. ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ ఖతర్నాక్ ప్లాన్..!

అదంతా అసత్య ప్రచారం.. ఎర్రబెల్లి వివరణ

అదంతా అసత్య ప్రచారం.. ఎర్రబెల్లి వివరణ

నాడు - నేడు ఎర్రబెల్లి మాట్లాడిన తీరు అంటూ సదరు వీడియో బాగా వైరల్ కావడంతో స్వయంగా రంగంలోకి దిగారు మంత్రి. అదంతా ట్రాష్ అని కొట్టిపారేశారు. కొన్ని టీవీ ఛానళ్లతో పాటు సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. తాను ఏనాడు కూడా ఉద్యోగులను ఏమీ అనలేదని వివరణ ఇచ్చారు. తెలంగాణ ద్రోహి అంటూ తనపై కొందరు కార్మికులు ఆరోపణలు చేయడం బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక పక్షపాతిగా పేర్కొన్నారు. తెలంగాణ కోసం తాను కూడా జైలుకు వెళ్లిన విషయం కొందరికి తెలియదేమోనని వ్యాఖ్యానించారు.

English summary
One of Video Viral In Social Media about Telangana Minister Errabelli Dayakar Rao. He supported TSRTC Employees in 2015, now supporting the TRS Government as in Minister Post. He given explanation about that video.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X