వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఎస్ఆర్టీసీ సమ్మె, తేలనున్న ప్రైవేట్ భవితవ్యం... కొనసాగుతున్న వాదనలు

|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలో 5,100 రూట్ల ప్రైవేటీకరణకు కేబినెట్‌ తీర్మానం చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. మంగళవారం జరిగిన వాదనల్లో ప్రభుత్వానికి అనుకూలంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన అనంతరం నేడు పిటిషనర్ తరపు న్యాయవాది తన కార్మిక సంఘాల వాదనలు వినిపిస్తున్నారు.

కేబినెట్ తీర్మాణాన్ని తప్పుబట్టలేమన్న కోర్టు

కేబినెట్ తీర్మాణాన్ని తప్పుబట్టలేమన్న కోర్టు

ప్రైవేటు రూట్లపై రెండవ రోజు వరుసగా విచారణ జరుగుతోంది.కాగా మంగళవారం జరిగిన విచారణలో భాగంగా రూట్లను ప్రైవేట్‌పరం చేయాలనే ప్రభుత్వ నిర్ణయం తప్పెలా అవుతుందని హైకోర్టు ప్రశ్నించింది. కేంద్ర మోటారువాహన చట్టం ప్రకారం ఆర్టీసీ, మరియు ప్రైవేట్ రవాణా వ్యవస్థలను సమాంతరంగా నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని కోర్టు తెలిపింది.. ఈ నేపథ్యంలోనే వాదనలు విన్న అనంతరం నేటికి వాయిదా వేసింది.

ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ విజయవంతం కాలేదా...?

ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ విజయవంతం కాలేదా...?

ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ విజయవంతం కాలేదా...? అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. . ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయొద్దని ఏ చట్టమైనా చెబుతుందా అంటూ పిటిషనర్‌ను ప్రశ్నించింది. దీంతోపాటు ప్రపంచంలో జరుగుతున్న ప్రైవేటీకరణ పరిణామాలను ప్రస్తావించింది. ఇందుకు సంబంధించి ఎయిర్‌లైన్స్ వ్యవస్థను ఉదహారణగా చూపింది. గతంలో ఒక్క ఇండియన్ ఎయిర్ లైన్స్ మాత్రమే ఉండేదని ... దానికి దీటుగా ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ విజయవంతంగా నిర్వహిస్తున్న అంశాన్ని ప్రస్తావించింది.

 ఇంకా సోషలిస్టు విధానాలేనా...

ఇంకా సోషలిస్టు విధానాలేనా...

ఇక సమాజం మారుతుంటే అందుకు అనుగుణంగా చట్టాలు మారుతున్నాయని, ఇందుకు అనుగుణంగా ప్రజలు కూడ మారుతున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. ఈనేపథ్యంలోనే ఇంకా 1947 నాటీ సోషలిస్టు విధానాలేనా... అంటూ పిటిషనర్‌ను ప్రశ్నించింది. సుప్రీం కోర్టు సైతం పెట్టుబడిదారు విధానాలకు అనుగుణంగా వచ్చిన చట్టాలకు లోబడే తీర్పులు చెబుతుందని పేర్కోంది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని స్పష్టం చేసింది. పూర్తిగా అచరణలోకి రాకుండానే ఎలాంటీ అభ్యంతరాలు వ్యక్తం చేయలేమని వ్యాఖ్యానించింది.

Recommended Video

TSRTC Samme : Telangana RTC JAC Confirms Samme Will Continues | RTC సమ్మె కొనసాగుతుందన్న జేఏసీ నేతలు
తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే.. 5100 ప్రైవేట్ రూట్లు

తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే.. 5100 ప్రైవేట్ రూట్లు

సమ్మె పరిణామాల నేపథ్యంలోనే ఆర్టీసీ రవాణాలో సేవలు అందిస్తున్న బస్సుల్లో యాబై శాతం మేర ప్రైవేట్, అద్దె బస్సులను తిప్పాలనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దీంతో ముప్పై శాతం మేర ప్రైవేట్ బస్సలతోపాటు మరో ఇరవై శాతం మేర అద్దె బస్సులను కొనసాగించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కసరత్తు చేసిన ప్రభుత్వం , క్యాబినెట్‌లో చర్చించిన తర్వాత దానికి అమోద ముద్ర వేశారు. ఇంతలోనే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ... పిల్ దాఖలు కావడంతో కోర్టులో విచారణ కొనసాగతోంది.

English summary
High Court hearings has begun for RTC buses private routes.government wants to 5100 route privatize in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X