వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

TSRTC STRIKE:ఆర్టీసీ ప్రైవేటీకరణపై స్టే కంటిన్యూ, ప్రొసిడింగ్స్‌ సీల్డ్ కవర్‌లో సమర్పణ..

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై స్టే కొనసాగిస్తున్నట్టు హైకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. 5100 రూట్లను ప్రైవేటీకరించామని ప్రభుత్వం తరఫున ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మంత్రిమండలి తీసుకున్న ప్రొసిడింగ్స్‌ను సీల్డ్‌ కవర్‌లో కోర్టుకు సమర్పించారు. దీనిపై హైకోర్టులో వాదనలు జరిగాయి. తదుపరి విచారణను హైకోర్టు ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది.

ఎందుకు అందుబాటులో లేదు

ఎందుకు అందుబాటులో లేదు

ఆర్టీసీ రూట్లకు సంబంధించి మంత్రిమండలి తీసుకున్న నిర్నయాన్ని ప్రజలకు ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేదని ధర్మాసనం ఏజీని ప్రశ్నించింది. ప్రజా ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాలను ఎందుకు తెలియజేయలేదని నిలదీసింది. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచలేమని ఏజీ కోర్టుకు వివరించారు. మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం జీవోగా వచ్చిన తర్వాత అందరికీ అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.

 నోటీసులో పెట్టరా..?

నోటీసులో పెట్టరా..?

మోటార్ వెహికిల్ యాక్ట్ 102 ప్రకారం ఆర్టీసీ నోటీసులో ఎందుకు పెట్టలేదని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. నోటీసులో పెట్టకుండా క్యాబినెట్ ఎలా డిసిషన్ తీసుకుంటుందని అడిగింది. అయితే పిటిషనర్ అభ్యర్థనలు సరిగా లేదని హైకోర్టు అభిప్రాయపడింది. పిటిషన్‌లో మార్పులు చేయాలని హైకోర్టు ధర్మాసనం సూచించింది. అప్పటివరకు ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై స్టే కొనసాగుతుందని స్పష్టంచేసింది. తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

సమ్మె@41

సమ్మె@41

ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారంతో 41వ రోజుకు చేరింది. ఆర్టీసీ కార్మికులు 26 డిమాండ్లు తీర్చాలని పట్టుబడుతుండగా.. 21 డిమాండ్లు మాత్రమే తీరుస్తామని ప్రభుత్వమే స్పష్టంచేయడంతో సమ్మె కొనసాగుతుంది. కార్మికులు, ప్రభుత్వం మెట్టు దిగాలని హైకోర్టు కూడా సూచిస్తోంది. కానీ కార్మిక జేఏసీ, ప్రభుత్వం మాత్రం పట్టువీడటం లేదు. సమ్మె వల్ల జీతం లేక, ఆందోళనకు గురై దాదాపు 20 మందికి పైగా డ్రైవర్లు, కండక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు.

ఏం చేద్దాం..

ఏం చేద్దాం..

మరోవైపు ఆర్టీసీ జేఏసీ, రాజకీయ నేతలు కార్యాచరణపై చర్చిస్తున్నారు. యూనియన్ నేతల నిరాహార దీక్షపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సడక్ బంద్, కార్మికుల ఆత్మహత్యలు, హైకోర్టు వాదనలపై చర్చిస్తున్నారు. తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి తెలిపారు.

English summary
highcourt stay on rtc Privatization.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X