వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం కేసీఆర్‌కు పవన్ కళ్యాన్ ట్విట్టర్ విజ్జప్తి...సానుభూతితో కార్మికులను విధుల్లోకి తీసుకోండి

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ సమ్మెపై జనసేన అధినేత పవన్ కళ్యాన్ మరోసారి స్పందించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించి విధుల్లోకి చేరతామని ప్రకటించిన నేపథ్యంలోనే వారి వినతిని మన్నించి సానుభూతితో ఎలాంటీ అంక్షలు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. నలబై ఏడు రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులకు పెద్ద దిక్కుగా , వారి కుటుంబ పెద్దగా అనుకూల నిర్ణయం తీసుకుంటారని తాను ఆశీస్తున్నట్టు చెప్పారు.

సమ్మె పరిష్కారం అయితే ప్రజా రవాణ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని అప్పుడు వారి సమస్యలను సానుకూల దృక్పథంలో స్పందించి పరిష్కరించాల్సింగా కోరుతున్నానని చెప్పారు. ఇదే అంశంపై స్పందించాల్సిందిగా కార్మిక నాయకులు తనను కోరారని చెప్పారు.

47 రోజుల ఆర్టీసీ సమ్మెకు కార్మికులు ఫుల్‌స్టాప్ పెట్టిన నేపథ్యంలోనే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. కార్మికులు పూర్తిగా మెట్టు దిగడంతో ముఖ్యమంత్రి సానూకూలంగా స్పందించాలని పలువురు నేతలు ఆయనకు విజ్ఝప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాన్ సైతం కార్మికుల విజ్ఝప్తిపై స్పందించారు.

TSRTC Strike,Janasena chief Pawan Kalyan once again responded about the RTC strike

కాగా సమ్మె నేపథ్యంలోనే మద్దతు పలకాలని కార్మికులు కోరడంతో సీఎం కేసీఆర్‌తో తాను చర్చిస్తానని పవన్ కళ్యాన్ చెప్పారు. ఇందుకోసం తానే స్వయంగా వెళ్లి సీఎంను కలుస్తానని హమీ ఇచ్చారు. అయితే సీఎం కేసీఆర్ సమ్మెపై చర్చించేందుకు సిద్దంగా లేరంటూ మరోసారి పేర్కోన్నారు. ఆ తర్వాత సమ్మె ముగింపు సమయంలో పవన్ జోక్యం చేసుకున్నారు.

మరి ప్రభుత్వం ఎలాంటీ నిర్ణయాన్ని వెలువరుస్తుందనే ఉత్కంఠ అటు కార్మిక వర్గాలతో పాటు, ఇటు ప్రజల్లో కూడ కొనసాగుతుంది. సమ్మెలోకి వెళ్లిన వారే స్వయంగా తమ నిర్ణయాన్ని మార్చుకోవడంతో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

English summary
Janasena chief Pawan Kalyan once again responded to the RTC strike. he urged the cm KCR to take the stand with sympathy about rtc strike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X