వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఎస్ఆర్టీసీ సమ్మె, ప్రభుత్వం బాకి లేదు ...ఆర్టీసీ 500 కోట్లు బకాయి...! కోర్టుకు అఫిడవిట్‌

|
Google Oneindia TeluguNews

హైకోర్టు ఆదేశాలతో ఆయా విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు అఫిడవిట్లను సమర్పించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆర్టీసీకి ఎలాంటీ బకాయిలు పడలేదని చెప్పారు. రాష్ట్రప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల కంటే అదనంగా 900 కోట్ల రుపాయాలు చెల్లించామని ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి రామక్రిష్ణారావు హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కోన్నారు. ఇక జీహెచ్‌ఎంసీ ఆర్ధిక పరిస్థితిని బట్టే ఆర్టీసీకి నిధులు కేటాయించామని అధికారులు వివరించారు.

తప్పుడు నివేదికలపై కోర్టు ఫైర్

తప్పుడు నివేదికలపై కోర్టు ఫైర్

ఆర్టీసీ బకాయిలపై ఆయా ప్రభుత్వ విభాగాలు తప్పుడు నివేదికలు ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఉన్నతాధికారులను కోర్టుకు హజరుకావాలని ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. బకాయిపై సమగ్ర సమచారంతో సీఎస్ ఎస్‌కే జోషి, ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్‌శర్శ ,ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావుతోపాటు జీహెచ్‌ఎంసీ కమీషనర్ లోకేష్‌కుమార్‌లు నవంబర్ ఏడవ తేదిన కోర్టులో హజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కోంది. దీంతో పాటు ఆయా విభాగాలు కోర్టుకు సమర్పించిన నివేదికలు విరుద్దంగా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడడంతో పూర్తి వాస్తవాలను ఆరవ తేదిలోగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. 2014 నుండి ప్రభుత్వం ఉన్న బకాయిల వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

బకాయిలకంటే అదనంగా 900 కోట్లు

బకాయిలకంటే అదనంగా 900 కోట్లు

కోర్టు ఆదేశాలతో ఆయా విభాగాల ఉన్నతాధికారులు నేడు కోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆర్టీసీకి ఎలాంటీ బకాయిలు పడలేదని చెప్పారు. రాష్ట్రప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల కంటే అదనంగా 900 కోట్ల రుపాయాలు చెల్లించామని ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి రామక్రిష్ణారావు తెలిపారు. ఆర్టీసికి 3006 కోట్ల బకాయిలు ఉండగా... ప్రభుత్వం 3903 కోట్లు చెల్లించిందని చెప్పారు. దీనికి అదనంగా ఆర్టీసీయో తిరిగి మోటారు వాహనాల చట్టం కింద 540 కోట్లు చెల్లించాలని అఫిడవిట్‌లో పేర్కోన్నారు.

జీహెచ్‌ఎంసీ ఎలాంటీ బాకి లేదు

జీహెచ్‌ఎంసీ ఎలాంటీ బాకి లేదు

ఇక జీహెచ్‌ఎంసీ కూడ ఆర్టీసీకి ఉన్న బకాయిలపై కోర్టు ఆరా తీసింది. అసలు జీహెచ్‌ఎంసీ ఆర్టీసీకి నిధులు ఇవ్వాలనే నిబంధలు ఏమైనా ఉన్నాయా.. అనే విషయాలు వెల్లడించాలని తెలిపింది. ఒకవేళ నిబంధనల ప్రకారం బకాయిలు చెల్లించకపోతే ...ఎందుకు చెల్లించలేదో అనే అంశాన్ని కూడ కోర్టుకు వివరించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆర్టీసీ బకాయిలపై జీహెచ్‌ఎంసీ కమీషనర్ లోకేష్‌కుమార్‌లు కోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. ఈ నేపథ్యంలోనే 2018-19 సంవత్సరానికి గాను ఆర్టీసీకి ఎలాంటీ బకాయిలు లేవని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఆర్ధిక పరిస్థితిని బట్టే నిధులు ఇస్తున్నామని పేర్కోన్నారు. 2014-15 మిగులు బడ్జెట్ ఉండడం వల్ల ఆర్టీసీకి నిధులు ఇచ్చామని అనంతరం జీహెచ్‌ఎంసీ కూడ లోటుబడ్జెట్‌లో ఉండడంతో నిధులు ఇవ్వడం లేదని తెలిపారు.

సునిల్ శర్మ మరో అఫిడవిట్

సునిల్ శర్మ మరో అఫిడవిట్

అయితే ఆర్టీసీ ఎండీ సునిల్‌శర్మ రవాణశాఖ మంత్రికి ఇచ్చిన నివేదికలో పేర్కోన్న అంశాలు విరుద్దంగా ఉన్నాయని చెప్పడంతో, అందుకు సంబంధించిన వివరాలు సునిల్ శర్మ సైతం అఫిడవిట్‌ను కోర్టుకు అందించారు. ప్రభుత్వం నుండి ఎక్కువ నిధులు రాబట్టాలనే ఉద్దెశ్యంతోనే రవాణాశాఖ మంత్రికి ఆ నివేదిక ఇచ్చామని పేర్కోన్నారు. ఆర్టీసీకి ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులకంటే అదనంగా 867 కోట్లు వచ్చాయని తెలిపారు. ఇక ఉన్నతాధికారులు సమర్పించిన అఫిడవిట్‌లపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ ఉదయం మంత్రితోపాటు అధికారులు సమావేశం అయి కోర్టుకు సమర్పించాల్సిన నివేదికపై చర్చించారు.

English summary
telangana state government departments were submitted affidavit to the high court on rtc strike and said there was no dues to the rtc from govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X