వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగిసిన సీఎం సమీక్ష.. తేలని ఆర్టీసీ భవితవ్యం.. మరో 24 గంటలు నిరీక్షణ

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ సమ్మెపై ఎలాంటీ నిర్ణయం లేకుండానే సీఎం నిర్వహించిన సమావేశం ముగిసింది. ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించిన తర్వాత కొనసాగిన సమీక్ష కావడంతో సానూకూల నిర్ణయం తీసుకుంటారనే అభిప్రాయం నాయకుల్లో వెల్లడైంది. సుమారు నాలుగు గంటల పాటు అధికారులతో మంతనాలు జరిపిన సీఎం కేసీఆర్ ఎలాంటీ నిర్ణయం వెలువరించలేదు.

అయితే శుక్రవారంనాడు బస్సు రూట్ల ప్రైవేటీకరణపై విచారణ కొనసాగనున్న నేపథ్యంలో అప్పటి వరకు వేచి ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రైవేట్ రూట్లపై శుక్రవారం డైరక్షన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే అప్పటి వరకు వేచి చూసి పూర్తి స్థాయి నిర్ణయాన్ని ప్రకటించాలని నిర్ణయించింది. మరోవైపు ఆర్టీసీని యథావిధిగా కొనసాగించే పరిస్థితి ఆర్థికంగా లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

ప్రస్తుతం ఉన్న ఆర్ధిక మాద్యంలో అప్పులను భరించే పరిస్థితి లేదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఇతర మార్గాలను కూడ అన్వేషించనున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఆర్టీసీకి శాశ్వత పరిష్కారం కావాలనే నిర్ణయంతో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.

TSRTC strike, NO result of CM KCR review meeting on RTC Strike

ఆర్టీసీ సమ్మె కీలకమలుపు తిరిగిన నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ , సీఎస్ ఎస్కే జోషితోపాటు ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ , ఇతర రవాణాశాఖ అధికారులలో సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే గురువారం సాయంత్రం ప్రారంభమైన సమావేశం సుమారు నాలుగు గంటల పాటు కొనసాగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ అంశాలు, హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన డిమాండ్ల ప్రతిపాదనలతో పాటు శాశ్వత పరిష్కారం, ఇతర ప్రత్యామ్నాయాలపై కూడ చర్చించినట్టు తెలుస్తోంది. కార్మికులు విలీన డిమాండ్‌ను పక్కన పెట్టడడంతో పాటు పలు ఎలాంటీ డిమాండ్స్ లేకుండా... ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని కోరిన విషయం తెలిసిందే..అయితే ఇందుకు సంబంధించి సాంకేతిక అంశాలు, ఇతర అర్థికపరమైన అంశాలపై కూడ చర్చించినట్టు సమాచారం.

అయితే సుదీర్ఘంగా చర్చ కొనసాగడంతో కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకునే సానుకూల నిర్ణయం వెలువడుతుందని అంతా భావించారు. కాని అందుకు విరుద్దంగానే సమావేశం కొనసాగినట్టు తెలుస్తోంది. అయితే సీఎం నిర్ణయం ఎమై ఉంటుందనే ఉత్కంఠ అటు కార్మికులతోపాటు అటు ప్రజల్లో నెలకొంది.

English summary
The meeting held by the CM ended without any decision on the RTC strike. cm kcr discussed about rtc strike with officials today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X