వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఎస్ఆర్టీసీ సమ్మె, తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, అధికారులతో సీఎం సమావేశం

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ సమ్మెపై ఓవైపు కోర్టులో వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలోనే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే జరిపిన చర్చల్లోకార్మిక సంఘాలు దిగిరాని పరిస్థితి కనిపిస్తోంది. ఇక సమ్మై సైతం మరిన్ని రోజులు కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వం తాను ఇదివరకే చెబుతున్నట్టుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమైంది. మూడు నుండి నాలుగువేల ప్రైవేట్ బస్సులకు రూటు పర్మిట్లు ఇచ్చేందుకు సిద్దమవుతుంది. దీంతోపాటు పలు విధానపరమైన నిర్ణయాలను ఆమోదించేందుకు రాష్ట్ర మంత్రివర్గం కోర్టు తీర్పు అనంతరం సమావేశం కానునట్టు తెలుస్తోంది.

ఆర్టీసీ కార్మికుల సమ్మె.. పక్కా ప్లాన్‌తో తెలంగాణ ప్రభుత్వంఆర్టీసీ కార్మికుల సమ్మె.. పక్కా ప్లాన్‌తో తెలంగాణ ప్రభుత్వం

 4000 వేల ప్రైటేటు బస్సులకు రూటు పర్మిట్లు

4000 వేల ప్రైటేటు బస్సులకు రూటు పర్మిట్లు

తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె 25వ రోజుకు చేరుకుంది. దీంతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రత్నామ్నాయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ సమ్మెపై పూర్తి వ్యతిరేకతతో ఉన్న సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్టీసీలో ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న ప్రైవేట్ బస్సులను పెంచుతామని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రైవేటు బస్సు ఆపరేటర్లకు అనుమతులు ఇచ్చేందుకు కావాల్సిన సమాచారాన్ని సిద్దం చేశారు.

త్వరలో మంత్రి మండలి సమావేశం

త్వరలో మంత్రి మండలి సమావేశం

అయితే ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం కావడంతో వీటికి అమోదం తెలిపేందుకు మంత్రిమండలి సమావేశం నిర్వహించనున్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్రం కూడ నూతన మోటారు వాహన చట్టాన్ని తీసుకువచ్చింది. దీన్ని ఆసరా చేసుకోనున్న ప్రభుత్వం మెరుగైన ప్రయాణ సౌకర్యాల కోసం పర్మిట్లు ఇవ్వాలని భావిస్తోంది. దీంతో రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మెకు పూర్తి మద్దతు తెలుపుతున్న బీజేపీకి కూడ షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఆర్టీసీ సమ్మె సాగతీత ధోరణి కనిపించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

కోర్టు తీర్పు నేపథ్యంలో అధికారులతో భేటి అయిన సీఎం

కోర్టు తీర్పు నేపథ్యంలో అధికారులతో భేటి అయిన సీఎం

ఇక ఇప్పటికే కోర్టులో వాదనలు జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం మధ్యహ్నం రెండుగంటల తర్వత కోర్టు మరోసారి సమ్మెపై వాదనలు వినిపించనుంది. దీంతో సీఎం కేసీఆర్ అధికారులు, మంత్రి పువ్వాడ అజయ్‌తో పాటు అడ్వకేట్ జనరల్ అత్యవసర సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కోర్టులో వినిపించాల్సిన అంశాలపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే విలీనంపై డిమాండ్‌ను పక్కన పెట్టాలని కార్మిక సంఘాలకు సూచించిన నేపథ్యంలో ప్రభుత్వం సానుకూలంగా ఉన్న అంశాలు కోర్టుకుకు తెలుపనున్నారు.

English summary
Telangana government is going to give permit to private bus operators for 4000 buses. and it will be finalised in state cabinet meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X