వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

TSRTC STRIKE:24 గంటల దీక్ష, మిలియన్ మార్చ్, ఆర్టీసీ జేఏసీ కార్యాచరణ ఇదే..

|
Google Oneindia TeluguNews

సమ్మెను మరింత ఉదృతం చేస్తామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సకల జనుల సమరభేరీ సభ ముగిసిన తర్వాత కార్యాచరణను వివరించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమే తమ ప్రధాన డిమాండ్ అని జేఏసీ స్పష్టంచేసింది. ప్రభుత్వం దిగొచ్చే వరకు తమ పోరుబాట తప్పదని తేల్చిచెప్పింది.

సకల జనుల సమరభేరీ సభ ముగిసిన తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణను ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం దీక్ష చేపడుతామని ప్రకటించింది. 24 గంటలపాటు దీక్ష కొనసాగుతుందని తెలిపింది. తర్వాత మిలియన్ మార్చ్ చేపడుతామని పేర్కొన్నది. మిలియన్ మార్చ్ ట్యాంక్‌బండ్‌పై చేపట్టే యోచనలో ఉన్నట్టు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు.

TSRTC STRIKE:rtc jac hunger strike on thursday

ఆర్టీసీ సమ్మెకు మద్దతు సీపీఐ నేత కూనమనేని సాంబశివరావు కూడా ఆ పార్టీ కార్యాలయంలో దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. కూనమనేని దీక్షకు టీడీపీ, కాంగ్రెస్ ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరాయి. ఆర్టీసీ-యాజమాన్యం మధ్య ఐదు డిమాండ్ల సమస్య నెలకొంది. 26 డిమాండ్లలో 21 డిమాండ్లకు యాజమాన్యం అంగీకరించింది.

కానీ మిగతా ఐదు డిమాండ్లపై ఆర్టీసీ జేఏసీ పట్టుబడుతుంది. ఇందులో ఆర్టీసీ విలీనం, పీఆర్, ఐఆర్.. కీలక డిమాండ్లు ఉన్న సంగతి తెలిసిందే. ఆర్థికభారం లేని డిమాండ్లు పరిష్కరించేందుకు ఓకే అని యాజమాన్యం అనడంతో తొలిదఫా జరిపిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే.

English summary
rtc jac roadmap told to media. thursday afternoon will start 24 hours hunger strike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X