వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్టీసీ జేఏసీ రహస్య భేటి....కోర్టు ఉత్తర్వులపై చర్చ

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ నేతల జేఏసీ రహస్య సమావేశం కొనసాగుతోంది. హైకోర్టు ఉత్తర్వులు, లేబర్ కోర్టుకు వెళ్లిన తర్వాత జరగనున్న పరిణామాలతో పాటు, సమ్మె కొనసాగింపుపై చర్చించేందుకు నేతలు సమావేశం అయ్యారు. ముఖ్యంగా లేబర్ కోర్టులో ఎలాంటి వాతవరణం ఉండే అవకాశం ఉందన్న అంశంపై న్యాయవాదులతో కూడ చర్చిస్తున్నారు. దీంతో సాయంత్రంలోగా పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జేఏసీ నేతల రహస్య సమావేశం

జేఏసీ నేతల రహస్య సమావేశం

ఆర్టీసీ సమ్మె కీలక మలుపు తిరుగుతుంది. జేఏసీ నేతలు రహస్యంగా సమావేశం నిర్వహించారు. మంగళవారం కూడ సమ్మెకొనసాగింపు విస్తృత సంప్రదింపులు జరిపిన నేతలు వాటిని క్రోడికరించి ఎలాంటీ నిర్ణయం తీసుకోవాలనే అంశంపై సూదీర్ఖంగా చర్చించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కోర్టుల్లో ఆర్టీసీ కార్మికులకు వ్యతిరేకంగా తీర్పులు వెలువడుతుండంతో పాటు సమ్మె కొనసాగించితే.... తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈనేపథ్యంలోనే మంగళవారం సమావేశం అయిన నేతలు కోర్టు ఉత్తర్వుల కాపి అందిన తర్వాత న్యాయవాదులతో చర్చింస్తామని చెప్పారు. అనంతరం సమ్మె కొనసాగింపుపై నిర్ణయాన్ని వెలువరుస్తామని చెప్పారు.

సమ్మెలో కొనసాగింపుపై బిన్నాభిప్రాయాలు

సమ్మెలో కొనసాగింపుపై బిన్నాభిప్రాయాలు

సమ్మె కొనసాగింపులపై తర్జనభర్జన పడుతున్న కార్మికుల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. యూనియన్ల వారిగా చర్చించిన నేతలు కింది స్థాయి నేతలతో పాటు ఆయా డిపోల్లో పనిచేసే కార్మికుల అభిప్రాయాలను కూడ సేకరించారు. దీంతో సమ్మె కొనసాగింపును విరమించుకోవాలని కొంతమంది కార్మికులు తమ అభిప్రాయాలను వెల్లడించినా...మెజారీటీ కార్మికులు మాత్రం సమ్మెను కొనసాగించాలనే నిర్ణయాన్ని వెలిబుచ్చారు. బిన్నాభిప్రాయా నేపథ్యంలో పూర్తి నిర్ణయాన్ని జేఏసీకి వదిలి వేశారు. నాయకులు ఎలాంటీ నిర్ణయం తీసుకున్నా..కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. దీంతో నేడు కొనసాగుతున్న చర్చల్లో ఇదే ప్రధాన అంశంగా కొనసాగుతోంది.

ఫలితాలను ఇవ్వని సమ్మె

ఫలితాలను ఇవ్వని సమ్మె

46 రోజులుగా ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేస్తున్నా..రాష్ట్ర ప్రభుత్వం నుండి సానుకూల స్పందన కరువైంది. మరోవైపు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడంతో పాటు, ప్రత్నామ్నాయాలపై దృష్టిసారించింది. ఇందుకు అనుగుణంగా చర్యలు సైతం చేపట్టింది. అద్దె బస్సులతో పాటు రూట్లను కూడ ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోర్టుల్లో కూడ అనుకూలంగా తీర్పులు రావడంతో ప్రైవేట్ రూట్లను కూడ ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతుంది.

కోర్టుల్లో చుక్కెదురు

కోర్టుల్లో చుక్కెదురు

దీనికి అదనంగా సమస్యను లేబర్ కోర్టుకు బదిలీ చేయాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరడంతో అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గత కొద్ది రోజులుగా సమ్మెపై కోర్టు ద్వార న్యాయం జరుగుతుందని ఆశలు పెట్టుకున్న కార్మికులకు చుక్కెదురైంది. దీని ద్వార మరింత కాలం సాగదీత కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ అధికారాలను కోర్టులే ప్రశ్నించలేని చట్టాలు ఉన్నప్పుడు.. లేబర్ కమీషనర్ స్థాయిలో సమ్మె పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించే అవకాశాలు లేవని కార్మిక వర్గాలు భావిస్తున్నాయి.

ప్రైవేటు రూట్లకు గ్రీన్ సిగ్నల్

ప్రైవేటు రూట్లకు గ్రీన్ సిగ్నల్

మరోవైపు ఆర్టీసీ రూట్లను ప్రైవేటు పరం చేయాలనే ప్రభుత్వా నిర్ణయాన్ని సైతం కోర్టు సానుకూలంగా స్పందించింది. ప్రైవేటీకరణ చేయడంలో తప్పేముందని ప్రశ్నించింది. ఇందుకోసం మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టలేమని స్పష్టం చేసింది. ప్రపంచం ప్రైవేటీకరణవైపు అడుగులు వేస్తుందని, ఇందుకు ఉదహారణగా అనేక ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ సంస్థలు విజయవంతంగా కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించింది. ఇక కోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం ప్రైవేటు బస్సులను ప్రవేశపెడితే కార్మికుల అవకాశాలు మరింత దిగజారనున్నాయి.

పూర్తిస్థాయిలో సహకరించని పార్టీలు

పూర్తిస్థాయిలో సహకరించని పార్టీలు

ఇక సమ్మె 46రోజులుగా కొనసాగుతుండగా... అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. కాని రోజువారిగా జరిగే కార్యక్రమాల్లో పార్టీ నేతలు చురుకుగా పాల్గొంటున్న పరిస్థితి కనిపించడం లేదనే అభిప్రాయాన్నికార్మికులు వ్యక్తం చేశారు. ఒక్క వామపక్ష పార్టీలు మినహా ఇతర పార్టీలు సహకరించడం లేదని భావిస్తున్నారు. దీంతో పదుల సంఖ్యలో కార్మికులు రోడ్లపైకి వస్తుండడంతో పెద్ద ఎత్తున మోహరిస్తున్న పోలీసులు వారిని వెంటనే అరెస్ట్ చేస్తున్నారు.అరెస్టులతో కార్మికులు ఆశిస్తున్నట్టుగా ప్రభుత్వంపై పెద్దగా ఒత్తిడి లేకుండానే సమ్మె కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మిగతా పార్టీలు కూడ వామపక్షాల వలే పోరాట పటిమను కనబరచడం లేదని కార్మికులు అభిప్రాయపడుతున్నారు.

English summary
RTC JAC leaders meeting with advocates. discussed about court order effect along with strike issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X