వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఎస్ఆర్టీసీ సమ్మె,.. 23న ఓయూలో ఆర్టీసీ కార్మికుల బహిరంగ సభ

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన బంద్ అనంతరం భవిష్యత్ కార్యచరణపై చర్చించేందుకు సమావేశం అయిన ఆర్టీసీ జేఏసీ నిర్వహించిన సమావేశం ముగిసింది. సమావేశంలో పలు భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే సమ్మెను మరింత ఉదృతం చేసేందుకు స్కెచ్ వేశారు. దీంతో ఆక్టోబర్ 23న బుధవారం ఓయూ ప్రాంగణంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని జేఏసీ నాయకులు నిర్ణయించారు.

భవిష్యత్ కార్యచరణ ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ

భవిష్యత్ కార్యచరణ ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ

ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన బంద్ తర్వాత జరిగిన పరిమాణాలపై ఆర్టీసీ నాయకులు విద్యానగర్‌లోని కార్యాలయంలో సమావేశం అయ్యారు.ఈ నేపథ్యంలోనే బంద్‌కు సహకరించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆదివారం ఉదయం అన్ని పార్టీల నాయకులను కలిసి తమ సమస్యలపై చర్చించాలని నిర్ణయించారు. ముఖ్యంగా తమకు మద్దతు పలికేందుకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉన్న నేతలు కలవాలని నిర్ణయించారు.

అధికారపార్టీ నేతలను కలవాలని నిర్ణయం

అధికారపార్టీ నేతలను కలవాలని నిర్ణయం

ఓవైపు ప్రతిపక్ష పార్టీ నేతలతో సమావేశం అవుతూనే మరోవైపు అధికార పార్టీ నేతలను కదిలించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందులో భాగంగానే రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడ కలిసి తమ సమస్యను వివరించాలని నిర్ణయించారు. కార్మికులు ఏవిధంగా ఇబ్బందులు పడుతోంది చర్చించేందుకు ఈ సంధర్భంగా తమకు మద్దతు ఇవ్వాలని కోరనున్నట్టు తెలిపారు. ఇక అధికార పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఎమ్‌ఐఎమ్ నేతల మద్దతు కోరాలని నిర్ణయించారు. మరోవైపు కార్మికుల పోరాటానికి మద్దతు ఇచ్చేందుకు జాతీయా స్థాయిలో కూడ మద్దతు కూడగట్టాలని నిర్ణయించారు. అవసరమైతే జాతీయ స్థాయి బంద్‌‌కు కూడ పిలుపునివ్వాలని నిర్ణయించారు.

ఉస్మానియాలో బహిరంగ సభ

ఉస్మానియాలో బహిరంగ సభ

ఇక ఆర్టీసీ నాయకులు చేపట్టిన బంద్ విజయం అయిందని భావిస్తున్న ఆర్టీసీ కార్మికులు దీన్ని ఇదే విధంగా కోనసాగించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 23న ఉస్మానియా యూనివర్సిటిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. మరోవైపు అన్ని ఆర్టీసీ డిపోల వద్ద ప్లకార్డులు ధరించి నిరసన వ్యక్తం చేయాలని ఆర్టీసీ జేఏసీ కన్వినర్ అశ్వథ్దామ రెడ్డి తెలిపారు. ప్రజలకు పూవ్వులు ఇచ్చి సమస్యను వివరించాలని చెప్పారు. చర్చలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని హితవు పలికారు. కార్మికులు ఆత్మస్థైర్యంతో సమ్మెలో పాల్గోనలాని పిలుపునిచ్చారు.

English summary
Following the bandh initiated by the RTC JAC, the meeting held by the RTC JAC, which was held to discuss the future plan, and 23rd october public meeting will be held at ou.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X