వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఎస్ఆర్టీసీ సమ్మె విరమణ... ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది....?

|
Google Oneindia TeluguNews

47 రోజుల పాటు కొనసాగించిన ఆర్టీసీ సమ్మెను విరమిస్తున్నట్టు జేఏసి కన్వినర్ అశ్వత్థామ రెడ్డి ప్రకటించారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ కార్మికులు విధుల్లో చేరేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు. అయితే కార్మికులను ఎలాంటీ షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని కోరారు. తండ్రి పాత్ర పోషించి ప్రభుత్వం సానుకూల వాతరణం కల్పించాలని జేఏసీ కన్వినర్ అశ్వత్థామ రెడ్డి కోరారు.

సమ్మెకు ఫుల్ స్టాప్

సమ్మెకు ఫుల్ స్టాప్

ఆర్టీసీ జేఏసీ నాయకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సమ్మెకు ఫుల్‌స్టాప్ పెడుతున్నట్టు జేఏసీ నేతలు ప్రకటించారు. ఈనేపథ్యంలోనే కార్మికులను ఎలాంటీ షరతులు లేకుండా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని జేఏసీ కన్వినర్ అశ్వత్థామ రెడ్డి అన్నారు. విధుల్లోకి తీసుకున్న కార్మికులు ఎలాంటీ షరతులపై సంతకాలు పెట్టరని స్పష్టం చేశారు. కేవలం డ్యూటిఫాం మీద మాత్రమే సంతకం చేస్తామని చెప్పారు. హైకోర్టు తీర్పును తాము గౌరవిస్తున్నామని, ప్రభుత్వం కూడ కోర్టు తీర్పును గౌరవిస్తుందని ఆశిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. లేబర్ కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్టు చెప్పారు.

 47 రోజుల సమ్మె

47 రోజుల సమ్మె

47 రోజుల సమ్మె తర్వాత ఆర్టీసీ కార్మికులు దిగివచ్చారు. అక్టోబర్ 5న సమ్మెలోకి దిగిన కార్మికులు 46 డిమాండ్లతో రంగంలోకి దిగారు. ముఖ్యంగా 46 డిమాండ్లలో విలీనమే ప్రధాన డిమాండ్‌గా ఉంది. విలీనంపై ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదని ప్రభుత్వం మొండికేయడంతో నెలరోజుల పాటు సమ్మె కొనసాగించిన నేతలు విలీనం డిమాండ్ పక్కన పెట్టారు. అప్పటికైనా..... ప్రభుత్వం దిగిరాకపోవడంతో సమ్మె కొనసాగింపుపై పునరాలోచనలో పడ్డారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల అభిప్రాయాలను తీసుకొన్న అనంతరం.. సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించారు. అంతకు మందు జేఏసీ నేతలు రహస్య సమావేశం నిర్వహించారు. అనంతరం లేబర్ కోర్టు పరిణామాలపై న్యాయవాదులతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఈ నేపథ్యంలోనే బుధవారం సాయంత్రం సమ్మెను విరమిస్తున్నట్టు చెప్పారు.

సమ్మె కొనసాగింపుపై బిన్నాభిప్రాయాలు

సమ్మె కొనసాగింపుపై బిన్నాభిప్రాయాలు

సమ్మె కొనసాగింపుపై తర్జనభర్జన పడుతున్న కార్మికుల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. యూనియన్ల వారిగా చర్చించిన నేతలు కింది స్థాయి నేతలతో పాటు ఆయా డిపోల్లో పనిచేసే కార్మికుల అభిప్రాయాలను కూడ సేకరించారు. దీంతో సమ్మె కొనసాగింపును విరమించుకోవాలని కొంతమంది కార్మికులు తమ అభిప్రాయాలను వెల్లడించారు... ఇప్పటికే 23 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోడంతో పాటు రెండు నెలలుగా జీతాలు లేకపోవడంతో కార్మికులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు.. అయితే జేఏసీ నాయకులు ఎలాంటీ నిర్ణయం తీసుకున్నా..కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.

ఫలితాలను ఇవ్వని సమ్మె

ఫలితాలను ఇవ్వని సమ్మె

46 రోజులుగా ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేస్తున్నా..రాష్ట్ర ప్రభుత్వం నుండి సానుకూల స్పందన కరువైంది. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడంతో పాటు, ప్రత్నామ్నాయాలపై దృష్టిసారించింది. ఇందుకు అనుగుణంగా చర్యలు సైతం చేపట్టింది. అద్దె బస్సులతో పాటు రూట్లను కూడ ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కోర్టుల్లో కూడ అనుకూలంగా తీర్పులు రావడంతో ప్రైవేట్ రూట్లను కూడ ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతుంది. దీంతొ అసలుకే ఎసరు వచ్చే పరిస్థితులను ప్రభుత్వం తీసుకు వచ్చింది.

ఎందుకు ఈ నిర్ణయం

ఎందుకు ఈ నిర్ణయం

ప్రభుత్వ వైఖరి పూర్తిగా వ్యతిరేకించడంతో పాటు... సమస్యను లేబర్ కోర్టుకు బదిలీ చేయాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. ప్రభుత్వం కోరినట్టుగానే హైకోర్టు కూడ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కోర్టు ద్వార న్యాయం జరుగుతుందని ఆశలు పెట్టుకున్న కార్మికులకు చుక్కెదురైంది. ప్రధానంగా సమ్మెపై లేబర్ కోర్టులో సుదీర్ఘ కాలం వాదనలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కనీసం ఆరు నెలల పాటు సమ్మెపై వాదనలు వినిపించేందుకు కూడ అవకాశాలు ఉన్నాయి. మరోవైపు లేబర్ చట్టాల్లో విలీన సమస్యపై వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశాలే ఉన్నాయి. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకునే అవకాశాలు తక్కువ ఉండడంతో కార్మికుల డిమాండ్‌లు నెరవేరే అవకాశాలు కనిపించలేదు. దీంతో ఇది సాగదీత పరిణామంగానే చూడాల్సి ఉంటుందని కార్మిక వర్గాలు భావించినట్టు సమాచారం. దీంతో కార్మికుల భవిష్యత్ దృష్ట్య సమ్మె విరమించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.

ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందా...

ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందా...

ఇక కార్మికులు పూర్తిగా ఎలాంటీ సంప్రదింపులు లేకుండానే సమ్మెను విరమించేందుకు సిద్దంగా ఉన్నట్టు ప్రకటించారు. అయితే బంతి ప్రభుత్వం కోర్టులో ఉంది. సమ్మెపై మొదటి నుండి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వం ఎలాంటీ నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ కూడ నెలకొంది. ఇప్పటికే రెండుసార్లు కార్మికులకు విధుల్లో చేరేందుకు అవకాశం ఇచ్చింది. అయితే కార్మికులు వాటిని సద్వినియోగ పరుచుకోకపోవడంతో ప్రభుత్వం మరింత ముందుకు సాగింది. కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని ఒకవేళ తిరిగి ఉద్యోగాల్లో చేరితే భవిష్యత్‌లో ఎలాంటీ సమ్మెలకు వెళ్లమనే నిబంధలపై సంతకాలు పెట్టాలని ప్రభుత్వం చెప్పింది. అయితే అవి అమలు రాకపోయినప్పటికి... తాజా నిర్ణయంపైనే కార్మికుల భవిష్యత్ ఆధారపడి ఉంది. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సానుకూలంగా నిర్ణయం తీసుకుని ముందుకు వస్తుందా... లేక లేబర్ కోర్టులో కూడ కొన్నాళ్లు సమస్యను నాన్చుతుందా... అనేది తేలాల్సి ఉంది.

English summary
RTC strike call off...JAC leaders announced after discussed about court order effect along with strike issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X