హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోమవారం నుంచి స్కూళ్లు ప్రారంభం.. సెలవులు పొడిగింపు ప్రచారం ఉత్తిదే.. ఎగ్జామ్స్ ఎప్పుడంటే..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణలో విద్యాసంస్థలకు దసరా సెలవులు ముగిసినట్లే. సెప్టెంబర్ చివరి వారంలో మొదలైన ఫెస్టివల్ హాలిడేస్ ఈ నెల 13 వరకు ఇచ్చారు. అయితే ఆర్టీసీ స్ట్రైక్ కారణంగా మరో వారం రోజులు పెరిగిన సెలవులు 19వ తేదీతో ముగిశాయి. ఈ క్రమంలో 21వ తేదీ సోమవారం నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఇటీవల సెలవుల పొడిగింపు అంటూ సోషల్ మీడియాలో వచ్చిన ఫేక్ సమాచారంతో తల్లిదండ్రులు కన్ఫ్యూజన్ అయ్యారు. అది అసత్య ప్రచారమని తేలిపోయింది. మొత్తానికి 20 రోజులకు పైగా మూతపడ్డ విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

పొడిగించిన దసరా సెలవులు ముగిశాయి.. సోమవారం నుంచి మళ్లీ బడి బాట

పొడిగించిన దసరా సెలవులు ముగిశాయి.. సోమవారం నుంచి మళ్లీ బడి బాట

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరిన క్రమంలో పండుగలకు పెద్దపీట వేశారు సీఎం కేసీఆర్. ఆ నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా విద్యాసంస్థలకు దసరా సెలవులు 15 రోజులు ఇస్తున్నారు. అయితే ఈ సంవత్సరం సెప్టెంబర్ చివరి వారంలో మొదలైన పండుగ సెలవులు ఈ నెల 13వ తేదీతో పూర్తయి 14వ తేదీన విద్యాసంస్థలు పునఃప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ఆర్టీసీ స్ట్రైక్ నేపథ్యంలో విద్యాసంస్థలకు మరో వారం రోజుల పాటు సెలవులు పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ క్రమంలో ఈ నెల 19వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు అధికారులు.

కేసీఆర్ గుండెల్లో భయం పుట్టాలి.. అహంకారం తగ్గి ప్రజల కోసం పనిచేయాలి.. రేవంత్ రెడ్డి అటాక్..!కేసీఆర్ గుండెల్లో భయం పుట్టాలి.. అహంకారం తగ్గి ప్రజల కోసం పనిచేయాలి.. రేవంత్ రెడ్డి అటాక్..!

ఈ నెల 31 వరకు సెలవుల పొడిగింపు.. అదంతా అసత్య ప్రచారమే..!

ఈ నెల 31 వరకు సెలవుల పొడిగింపు.. అదంతా అసత్య ప్రచారమే..!

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే స్కూళ్ల సెలవులకు సంబంధించి ప్రభుత్వం మరోసారి సెలవులు పొడిగించిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగింది. ఈ నెల 31 వరకు సీఎం కేసీఆర్ సెలవులు పొడిగించారంటూ కొందరు పనిగట్టుకుని ఓ టీవీ ఛానల్ బ్రేకింగ్ వేసినట్లుగా గ్రాఫిక్స్ క్రియేట్ చేశారు. అయితే అది అవాస్తమని తేలిపోయింది. అలాంటి ప్రకటన ప్రభుత్వం చేయలేదంటూ క్లారిఫికేషన్ ఇచ్చారు అధికారులు.

సమ్మెటివ్ -1 పరీక్షలు 23 నుంచి కాదు..!

సమ్మెటివ్ -1 పరీక్షలు 23 నుంచి కాదు..!

ఆ నేపథ్యంలో ఈ నెల 21వ తేదీ సోమవారం నుంచి విద్యాసంస్థలు యథాతథంగా పనిచేస్తాయని ప్రకటించారు విద్యాశాఖ కమిషనర్ విజయ్ కుమార్. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి ప్రారంభమైన దసరా సెలవులు ఈ నెల 19వ తేదీతో ముగిసినట్లు తెలిపారు. ఇక ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన సమ్మెటివ్ - 1 పరీక్షలను 25వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు.

కేసీఆర్ సభకు కాంగ్రెస్ విన్నింగ్‌కు లింక్ ఉందా.. గెలుపుపై ధీమా మరింత పెరిగిందా..?కేసీఆర్ సభకు కాంగ్రెస్ విన్నింగ్‌కు లింక్ ఉందా.. గెలుపుపై ధీమా మరింత పెరిగిందా..?

కాలేజీలు కూడా రేపటి నుంచే పునఃప్రారంభం

కాలేజీలు కూడా రేపటి నుంచే పునఃప్రారంభం

ఎగ్జామ్స్‌కు సంబంధించి ఇదివరకు ప్రకటించిన టైమ్ టేబుల్ స్థానంలో కొత్త టైమ్ టేబుల్ విడుదల చేశామని తెలిపారు కమిషనర్. ఆ మేరకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 25వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. మరోవైపు జూనియర్ కాలేజీలు కూడా సోమవారం నుంచే ప్రారంభం కానున్నాయి. ఆ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ప్రకటన విడుదల చేశారు. ఇక డిగ్రీ కాలేజీలతో పాటు ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించిన అన్నీ కాలేజీలు కూడా 21వ తేదీ నుంచి తెరుచుకుంటాయని వివిధ ప్రకటనల్లో ఆయా వర్సిటీల అధికారులు ప్రకటించారు.

English summary
TSRTC Employees Strike is going on. Dasara Holidays extended in the view of strike upto 19th october for Educational Institutions. At last re opens from monday i.e 21.10.2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X