వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఎస్ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం మైండ్‌గేమ్ ఆడుతోంది : ఐకాస కన్వినర్

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చలంటూ ప్రభుత్వం మైండ్‌గేమ్ అడుతోందంంటూ ఆర్టీసీ ఐకాస కన్వినర్ అశ్వథ్తామ రెడ్డి అన్నారు. ఆర్టీసీ సమ్మెపై భవిష్యత్ కార్యచరణ కోసం సమావేశం అయిన నేతలు ప్రభుత్వం కార్మికుల పట్ట వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. ఈనేపథ్యంలోనే ప్రభుత్వం నుండి ఎలాంటీ చర్చల ప్రతిపాదన తమకు అందలేదని చెప్పారు. దీంతో సమ్మెను కొనసాగించేందుకే నిర్ణయించామని చెప్పారు.

 ఆర్టీసీ కార్మికులకు హైకోర్టులో ఊరట.. సెప్టెంబర్ జీతాలు చెల్లించాలంటూ..! ఆర్టీసీ కార్మికులకు హైకోర్టులో ఊరట.. సెప్టెంబర్ జీతాలు చెల్లించాలంటూ..!

కార్మికుల న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరోవైపు సమ్మెకు రాష్ట్రంలోని ఇతర యూనియన్ల నుండి మద్దతు పెరుగుతున్న నేపథ్యంలోనే ఇతర రాష్ట్రాలకు చెందిన దిల్లీ, చెన్నై నుండి కార్మికులకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్నారని చెప్పారు. బంద్ తర్వాత ఆందోళనలను మరింత ఉదృతం చేస్తామని చెప్పారు.

TSRTC Strike : Telengana government playing mindgame with workers

ఇక ప్రభుత్వం కూడ అదే రకమైన చర్యలకు దిగింది. చర్చల ప్రస్తావన లేకుండా ప్రయాణికుల ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఈనేపథ్యంలోనే మంత్రి పువ్వాడ అజయ్ వందశాతం బస్సులు నడపాలని అధికారులకు చెప్పారు. అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన అధికారులు, డిపో మెనేజర్లతో చర్చించారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వేగవంతం చేయాలని చెప్పారు. ముఖ్యంగా 21 నుండి విద్యాసంస్థలు కూడ ప్రారంభం కానుండడంతో అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాగా జిల్లాల్లో వందశాతం బస్సులు నడుపుతుండగా హైదరాబాద్‌లో మాత్రం 40శాతం బస్సులను నడుపుతున్నట్టు అధికారులు మంత్రికి వివరించారు.

English summary
Telengana government playing mindgame on rtc strike saying negociants said rtc jac convenor ashwathama reddy.and strike will be continue he announced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X