వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఎస్ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతం: 18 వరకు కార్యాచరణ, 19న బంద్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సంఘాలు తమ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ప్రకటించాయి. అక్టోబర్ 19న రాష్ట్ర బంద్‌కు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఇప్పటికే పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆదివారం నుంచి అక్టోబర్ 18వరకు ఆర్టీసీ జేఏసీ తన కార్యాచరణను ఆదివారం చేయనుందన ప్రకటించింది.

ఆర్టీసీ కార్మికుల సమ్మె 8వ రోజు ... కుటుంబ సభ్యులతో కలిసి మౌన నిరసన దీక్షలు ఆర్టీసీ కార్మికుల సమ్మె 8వ రోజు ... కుటుంబ సభ్యులతో కలిసి మౌన నిరసన దీక్షలు

వంటావార్పు..

వంటావార్పు..

అక్టోబర్ 13న రాష్ట్ర వ్యాప్తంగా వంటావార్పు చేస్తూ నిరసన తెలపనున్నారు. తెలంగాణ ఉద్యోమంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అక్టోబర్ 14న డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు బైఠాయించనున్నారు.

రాస్తారోకోలు

రాస్తారోకోలు

అక్టోబర్ 15న రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహిస్తామని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు శనివారం మీడియాకు తెలిపారు. అక్టోబర్ 16న విద్యార్థి సంఘాలతో కలిసి నిరసనలు, ఆందోళన ప్రదర్శనలు చేయనున్నారు. 18న బైక్ ర్యాలీలు నిర్వహిస్తామని ప్రకించారు. ఇక అక్టోబర్ 19న తెలంగాణ బంద్‌కు నిర్వహిస్తామని అన్నారు.

భారీ ఆందోళనలు

భారీ ఆందోళనలు

ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జనసమితితోపాటు ఇతర రాజకీయ పార్టీలు ఆర్టీసీ సంఘాలకు తమ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.

బీజేపీ శనివారం బస్ భవన్ ఎదుట భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ సొమ్మసిల్లిపడిపోయారు. ఆ తర్వాత ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

విలీనం చేసేది లేదంటూ..

విలీనం చేసేది లేదంటూ..

కాగా, ఆర్మీసీ సంఘాల ప్రధాన డిమాండ్.. ఆర్టీసీన ప్రభుత్వంలో విలీనం చేయడం. అయితే, కేసీఆర్ సర్కారు మాత్రం ఆర్టీసీని విలీనం చేసేది లేదని స్పష్టం చేసింది. కాగా, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం దసరా సెలవులను అక్టోబర్ 19 వరకు పొడిగించింది.

1200 మంది మాత్రమే..

1200 మంది మాత్రమే..

అక్టోబర్ 5 నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. సమ్మె విరమించాలంటూ ప్రభుత్వం చేసిన హెచ్చరికలను ఆర్టీసీ కార్మికులు భేఖాతరు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకూ సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు 1200 మంది ఉద్యోగులు మాత్రమే ప్రభుత్వంలో చేరారు.

English summary
It is said that the TSRCT unions wants to continue the strike for their demands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X