వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖ్యమంత్రికి మీరే చెప్పాలి: చినజీయర్ దగ్గరకు ఆర్టీసి కార్మికులు: ఆయనకు చెబితే అయినా..!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి కేసీఆర్ ను తమ డిమాండ్ల పైన ఒప్పించేందుకు అనేక మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక రకాలుగా నిరసనలు..కోర్టు కేసులు..అఖిలపక్ష సమావేశాలు..చివరకు బంద్ నిర్వహించినా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఒక్క మొట్టు కూడా దిగటం లేదు. పైగా ఆర్టీసీకి భవిష్యత్ లేదని చెబుతున్నారు. అదే సమయంలో యూనియన్లతో సంబంధం లేకుండా ఉద్యోగాలు చేసుకోవాలనుకొనే వారు నేరుగా డిపోల్లోకి వెళ్లి ఉద్యోగాల్లో చేరాలని సూచించారు.

అయినా..కార్మిక సంఘాలు మాత్రం పట్టు వీడటం లేదు. దీంతో..రాజకీయంగా అటు పార్టీలో.. ఇటు ప్రభుత్వంలో కేసీఆర్ ను ఒప్పించే శక్తి ఎవరికీ లేదని గ్రహించిన ఆర్టీసీ కార్మిక సంఘాలు కొత్త మార్గాన్ని డిసైడ్ చేసుకున్నాయి. అందులో భాగంగా కేసీఆర్ గౌరవించే వ్యక్తి కావటంతో ఆయన వద్దకు వెళ్తే తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందనే నమ్మకంతో అక్కడకు వెళ్లి..ఆయనను సాయం కోరారు.

TSRTC workers met China Jeeyar swamy ask him to help them to solve the problem

చినజీయర్ వద్దకు ఆర్టీసీ కార్మికులు..
ముఖ్యమంత్రి కేసీఆర్ చినజీయర్ స్వామికి భక్తుడు. తాజాగా చిన జీయర్ జన్మదిన వేడుకల్లోనూ ముఖ్యమంత్రి హాజరయ్యారు. దీంతో..కేసీఆర్ ప్రతీ సందర్భంలో గౌరవించే చినజీయర్ వద్దకు వెళ్లి తమ సమస్యల ను చెప్పుకుంటే పరిష్కారం లభిస్తుందనే ఆశ తెలంగాణ ఆర్టీసీ కార్మికుల్లో మొదలైంది. కొద్ది రోజుల క్రితం రెవిన్యూ ఉద్యోగులు సైతం తమ సమస్యల గురించి చినజీయర్ ను కలిసి తమ శాఖ రద్దు చేయాలనే ప్రతిపాదనలు ప్రభుత్వం సిద్దం చేస్తుందని..అలా జరగకుండా అడ్డుకోవాలని కోరారు.

అదే తరహాలో ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు సైతం చినజీయర్ వద్దకు వెళ్లారు. రాజేంద్రనగర్, మహేశ్వరం డిపోలకు చెందిన 300 మంది కార్మికులు ముచ్చింతల్ ఆశ్రమంలో చినజీయర్ ను కలిశారు. తమ సమ్మె ప్రారంభమై నెల రోజులు అవుతోందని..ఎలాగైనా తమ కార్మికులను కాపాడాలని వారు చిన జీయర్ స్వామిని కోరినట్లు సమాచారం. తమ సమస్యల గురించి సైతం వారు వివరించినట్లు తెలుస్తోంది. దీని పైన కార్మికులు చెప్పిన అంశాలను చిన జీయర్ ఆలకించటం మినహా పెద్దగా స్పందించలేదని సమాచారం.

ఒత్తిడిలో కార్మికులు..
ఒక వైపు ముఖ్యమంత్రి హెచ్చరికలు..వెనక్కు తగ్గని కార్మిక సంఘాలు..కోర్టు జోక్యం నడుమ 26 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పటికీ వారికి సెప్టెంబర్ జీతాలు అందలేదు. తమ వద్ద నిధులు లేవని ఆర్టీసీ యాజమాన్యం కోర్టుకు స్పష్టం చేసింది. ఇక, సమ్మె డిమాండ్ల విషయంలో ప్రభుత్వం నుండి ఎక్కడా సానుకూలత రావటం లేదు. కోర్టులో ఈ కేసు మరోసారి వాయిదా పడింది. బహిరంగ సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తే కోర్టు నుండి సాధించారు. ఏదో విధంగా ప్రభుత్వం సానుకూలంగా చర్చలు చేస్తే..తాము కూడా ఒక మెట్టు దిగటానికి సిద్దంగా ఉన్నామంటూ కార్మికులు సంకేతాలు ఇస్తున్నారు.

ఇదే సమయంలో సాధారణ ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ..యనియన్ నేతల పట్టుదల మధ్య సాధారణ కార్మికులు ఇరకాటంలో పడ్డారు. అయితే, ఎలాగైనా ప్రభుత్వం దిగి వస్తుందని..సమస్య పరిష్కారం అవుతుందంటూ నేతలు చెబుతున్న మాటలు వింటూ వస్తున్న కార్మికులు ఇప్పుడు చిన జీయర్ జోక్యం కోసం అభ్యర్ధించారు. మరి..ఆయన నిజంగా దీని పైన సీఎం కేసీఆర్ తో మాట్లాడుతారా..ఏం జరుగుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
TSRTC some of the workers met China Jeeyar swamy ask him to take responsibility to solve the problem. Workers requested swamiji to help them by sugget CM to take positivs decisions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X