వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టి.టిడిపిలో రేవంత్ 'చిచ్చు': అక్టోబర్ 26న, టిడిఎల్పీ సమావేశం, ఏం జరుగుతోంది?

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ టిడిఎల్పీ సమావేశం అక్టోబర్ 26న, ఏర్పాటు చేసినట్టు ఆ పార్టీ శాసనసభపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు.ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు హజరుకావాలని రేవంత్ సమాచారం పంపారు.

రేవంత్ వెంట నడిచెదేవరు: లెక్కలు వేస్తున్న టిడిపి, అదే జరిగితే భారీ మూల్యం?రేవంత్ వెంట నడిచెదేవరు: లెక్కలు వేస్తున్న టిడిపి, అదే జరిగితే భారీ మూల్యం?

తెలంగాణ టిడిపిలో రేవంత్‌రెడ్డి చిచ్చు కొనసాగుతోంది.తెలంగాణ టిడిపి పొలిట్‌బ్యూరో సమావేశానికి అనుహ్యంగా రేవంత్ రెడ్డి హజరయ్యారు. ఈ సమావేశంలో టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహ్ములు, పార్టీ నేత అరవింద్‌కుమార్‌గౌడ్‌లు రేవంత్‌పై ప్రశ్నల వర్షం కురిపించారని సమాచారం. రాహూల్‌గాంధీని కలిశారా లేదా తెలపాలంటూ రేవంత్‌పై ప్రశ్నిస్తే అన్నింటికి చంద్రబాబుకు సమాధానం ఇస్తానని రేవంత్ చెప్పారు.

కెసిఆర్ కాళ్ళకు దండం పెడితే తప్పేంటీ: రేవంత్‌పై పరిటాల శ్రీరామ్ ఫైర్కెసిఆర్ కాళ్ళకు దండం పెడితే తప్పేంటీ: రేవంత్‌పై పరిటాల శ్రీరామ్ ఫైర్

తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. రాహూల్‌గాంధీని కలిశారా లేదా అనే విషయమై పార్టీ సమావేశంలో ఆయన సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణిని అవలంభించారని టిడిపి నేత అరవింద్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు.

టిడిపిలోకి రేవంత్ ఇలా: బాబుకు నమ్మినబంటు, అనతికాలంలోనే కీలకపదవిటిడిపిలోకి రేవంత్ ఇలా: బాబుకు నమ్మినబంటు, అనతికాలంలోనే కీలకపదవి

తెలంగాణ టిడిపి పొలిట్‌బ్యూరో సమావేశం అర్ధాంతరంగా నిలిచిపోయిందనే ప్రచారం కూడ సాగింది. అయితే తెలంగాణ టిడిపి నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాత్రం పార్టీ సమావేశం ముగిసిన తర్వాతే మొత్కుపల్లి నర్సింహ్ములు, అరవింద్‌కుమార్‌గౌడ్‌లు బయటకు వెళ్ళారని చెప్పారు.

తెలంగాణ టిడిపిలో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీలో నేతల మధ్య సమన్వయం లేదని బట్టబయలు చేస్తోంది. రేవంత్ రెడ్డి ఎపిసోడ్‌ను కొందరు ఆయన వ్యతిరేకవర్గీయులు తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇదే సందర్భంలో రేవంత్‌రెడ్డి ప్లాన్ ఏమిటో త్వరలోనే తేలనుంది.

 అక్టోబర్ 26న, టిడిఎల్పీ సమావేశాన్ని పిలిచిన రేవంత్

అక్టోబర్ 26న, టిడిఎల్పీ సమావేశాన్ని పిలిచిన రేవంత్

తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్‌గాంధీని కలిశారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారంపై రేవంత్ నోరుమెదపలేదు. శుక్రవారం నాడుజరిగిన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో రేవంత్‌రెడ్డిని నేతలు నిలదీశారు.అయితే ఈ సమావేశం ముగిసిన తర్వాత ఈ నెల 26వ, తేదిన టిడిఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నట్టు రేవంత్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చారు. ఈ సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.

పొలిట్‌బ్యూరో సమావేశం ఏం జరిగింది?

పొలిట్‌బ్యూరో సమావేశం ఏం జరిగింది?

రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్‌గాంధీని కలిశారనే ప్రచారం సాగుతున్న తరుణంలో ఏర్పాటుచేసిన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో మోత్కుపల్లి నర్సింహ్ములు, అరవింద్‌కుమార్‌గౌడ్‌లు రేవంత్‌ను నిలదీశారనే ప్రచారం జరిగింది. అయితే పార్టీ సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాత్రం సమావేశంలో ఎలాంటి గొడవ జరగలేదని ప్రకటించడం వివాదానికి కారణమైంది.సమావేశం ముగిసిన తర్వాత రేవంత్ తీరుపై మోత్కుపల్లి బహిరంగంగా మీడియాతోనే రేవంత్ వైఖరిని తప్పుబట్టారు.

రేవంత్ ఎందుకు నోరు మెదపడం లేదు

రేవంత్ ఎందుకు నోరు మెదపడం లేదు

రేవంత్‌రెడ్డి వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నారు. తనపై ఇంత జరుగుతున్నా... ఆయన ఎందుకు నోరు విప్పడం లేదనే చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలు టిడిపిని తీవ్రంగా ఇబ్బందుల్లో నెట్టాయి.రాహూల్‌గాంధీని కలిసిన విషయంలో రేవంత్ మాట్లాడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారంలో వాస్తవం ఎంత ఉందనే దానిపై పార్టీ నేతలకు వివరణ ఇస్తే గందరగోళం తగ్గేది. కానీ, రేవంత్ నోరుమెదపకపోవడం వెనుక ఏదో ఉంటుందనే అనుమానాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

పొత్తుల చిచ్చే కొంప ముంచిందా?

పొత్తుల చిచ్చే కొంప ముంచిందా?


టీటీడీపీలో పొత్తుల కుంపటి రగులుతోంది. ఇతర పార్టీలతో పొత్తులపై రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలు రెండుగా చీలిపోయారు. నిన్న మొన్నటిదాకా అంతర్గతంగా కొనసాగుతూ వచ్చిన పొత్తుల కార్చిచ్చు ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరింది. కాంగ్రెస్‌తో పొత్తు చర్చలు సాగిస్తున్న రేవంత్‌రెడ్డి, ఆయన వర్గం ఏపీ టీడీపీ ముఖ్యనేతలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పార్టీ సీనియర్‌ నేతలు రేవంత్‌ వైఖరిని తప్పుబడుతున్నారు. ఇటీవల పరిటాల సునీత, యనమల రామకృష్ణుడిపై రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను మోత్కుపల్లి ఖండించారు. చంద్రబాబుకు తెలియకుండా పొత్తుల చర్చలు జరిపే హక్కు ఎవరిచ్చారని మోత్కుపల్లి రేవంత్‌రెడ్డిని నిలదీశారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని రేవంత్ భావిస్తున్నారు. మోత్కుపల్లి వర్గం మాత్రం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది.

English summary
TTDLP meeting will held on Oct 26, 2017 at Hyderabad.TDP working president Revanth Reddy call for Tdlp meeting.Tdlp meeting will decide how to act in Assembly session
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X