వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణాలో టీడీపీ ప్ర‌భావం చూపితే మ‌రో జేడీయ‌స్ కాగ‌ల‌దు..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ మ‌హానాడు సంద‌ర్బంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణుల్లో చిరు ఆశలు రేకెత్తించారు. 2019 ఎన్నికల తర్వాత తెలంగాణలో టీ టీడీపీ కీలకంగా మారుతుందని జోస్యం చెప్పారు. టీ టీడీపీ ఏర్పాటు చేసిన మహానాడు వేదిక నుంచి బాబు ఈ ప్రకటన చేశారు. పొరుగున కర్ణాట‌క జేడీఎస్ మాదిరిగా తెలంగాణలో టీ టీడీపీ పాత్ర ఉంటుందన్నది ఆయన భావన.

కర్నాటకలో హంగ్ వచ్చి జేడీఎస్ కింగ్ అయినట్టు తెలంగాణలో కూడా హంగ్ వచ్చి టీ టీడీపీ కీలకం అవుతుందన్నది బాబు లెక్క. నిజంగా తెలంగాణలో అలా జరిగే అవకాశం ఉందా? అసలు తెలంగాణలో హంగ్ వస్తుందా? ఆ సందర్భంలో టీ టీడీపీ కీలకంగా మారుతుందా? అంటే...ఇప్పటికైతే ఇదంతా ఊహాత్మకంగా ఉండ‌బోతోంది. రాజకీయ పరిస్థితుల ఆధారంగా ప్రస్తుతం పార్టీల పరిస్థితుల పై ఓ విశ్లేషణ మాత్రం చేసుకోవచ్చు.

 తెలంగాణాలో ప‌టిష్ట‌స్థితిలో టీఆర్ఎస్..

తెలంగాణాలో ప‌టిష్ట‌స్థితిలో టీఆర్ఎస్..

ఎవరు అవునన్నా... కాదన్నా తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ బలంగా ఉంది. కేసీఆర్ లాంటి దిగ్గజ నాయకత్వం, అధికార అండ, ఆర్థిక వెసులుబాటు, పుష్కలమైన నాయకత్వంతో మందుగుండు నింపిన ఫిరంగిలా ఆ పార్టీ ఉంది. 2019లో ఆ పార్టీ ఒంటరిగానే బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందనడంలో సందేహం లేదు. అయితే, ఈ ఒక్క అంశమే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయబోదు.
ఎన్నికలకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ ఇంకా సంసిద్ధంగా లేదు. ఆ పార్టీలో ఇంకా రిలాక్స్ మోడ్ కనిపిస్తోంది. బస్సుయాత్రతో జనం మధ్యకైతే వెళుతున్నారు. కానీ, అది పార్టీ పుంజుకునేటంత స్థాయిలో జరగడం లేదు. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో సానుభూతి ఉంది. కానీ, టీఆర్ఎస్ కు ధీటైన నాయకత్వం ఆ పార్టీలో లేదు.

అధికార పార్టీకి ధీటైన కౌంట‌ర్ ఇవ్వ‌లేక పోతున్న కాంగ్రెస్..

అధికార పార్టీకి ధీటైన కౌంట‌ర్ ఇవ్వ‌లేక పోతున్న కాంగ్రెస్..

రేవంత్ రెడ్డి లాంటి మాస్, క్రౌడ్ పుల్లర్ లీడర్ ను చేర్చుకుని, పని చేయించుకోకపోవడం కాంగ్రెస్ కు పెద్ద మైనస్. కాంగ్రెస్ గురించి ఇటీవల ఏ ఇద్దరి మధ్య చర్చ వచ్చినా అందులో రేవంత్ రెడ్డి ప్రస్థావన కచ్చితంగా ఉంటోంది. రేవంత్ రెడ్డిని వాడుకోకపోతే... ఇక ఈ పార్టీ బాగుపడేది ఎన్నడు అన్న అభిప్రాయం కాంగ్రెస్ ను అభిమానించే సామాన్య జనాల్లో వ్యక్తమవుతోంది. ఈ కారణంగానే... అనుకూలమైన రాజకీయ వాతావరణం ఉన్నా కాంగ్రెస్ దానిని మలచుకోలేకపోతోందన్న అభిప్రాయం ఉంది. టీ టీడీపీతో పొత్తు పెట్టుకోవాలన్న కోరిక టీ కాంగ్రెస్ నేతల్లో ఉంది. కానీ, దానికి తగ్గ ప్రయత్నాలు ఏవంటే... ఏమీ లేవు!

కాలం క‌లిసి వ‌స్తే ప్ర‌భావం చూపెట్ట‌నున్న టీడిపి..

కాలం క‌లిసి వ‌స్తే ప్ర‌భావం చూపెట్ట‌నున్న టీడిపి..

ఇక తెలంగాణ తెలుగుదేశానికి క్షేత్ర స్థాయిలో ఓటు బ్యాంకు ఉంది. అయితే, అది సొంతంగా గెలిచేందుకు సరిపోదు. ఏదో ఒక పార్టీతో జట్టుకడితే ఫలితాలు కొంత ఆశాజనకంగా ఉండొచ్చు! అలా కాక తమని తాము జేడీఎస్ తరహాలో ఊహించుకుని ఒంటరిగా బరిలో నిలిస్తే టీ టీడీపీ అస్థిత్వానికే ప్రమాదం ఏర్పడుతుంది. అప్పుడు ఆ పార్టీ ఓటుబ్యాంకు నిష్ప్రయోజంగా మారుతుంది. తమ పార్టీ ఎలాగు గెలిచే అవకాశం లేదని భావిస్తే...టీడీపీ ఓట్లర్లు కొంత మేర టీఆర్ఎస్ కు మళ్లే అవకాశాలు లేకపోలేదు. అప్పుడు కింగ్ సంగతి దేవుడెరుగు... కింగ్ మేకర్ అయ్యే అవకాశం కూడా టీ టీడీపీకి ఉండదు. పైగా 2019 తర్వాత తెలంగాణలో పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుంది. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు తెలంగాణలో తమ పార్టీ జేడీఎస్ పాత్ర పోషించాలంటే ఒంటరిగా బరిలో నిలిచి కనీసం పాతిక సీట్లు గెలవాలి. అది అసంభవం! ఎన్నికల కంటే ముందే ఏదో ఒక ప్రధాన పార్టీతో పొత్తుకు సిద్ధపడితే టీ టీడీపీ కూడా కొన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది. తద్వారా తెలంగాణలో తిరిగి ఆ పార్టీ బతికిబట్టకట్టడానికి కొంతైనా ఛాన్స్ ఉంటుంది.

English summary
In telangana 2019 electoins telugudesham party will play crucial in politics. tdp may become deciding party like in Karnataka. party national president chandrababu naidu said on the occasion of telangana mahanadu., tdp in telangana will play key role in 2019 general elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X