వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెటిఆర్‌కు తుమ్మల షాక్: సిఎంగా అంగీకరించనని ప్రకటన

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావుకు మరో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు షాక్ ఇచ్చారు. ఆయన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో తాను కుటుంబ పాలనకు వ్యతిరేకమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా కెటి రామారావుకు తాను మద్దతు ఇవ్వబోనని ఆయన చెప్పారు.

తాను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వెంట నడుస్తానని, పరిస్థితి వస్తే కెటి రామారావు ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే తాను మద్దతు ఇవ్వబోనని చెప్పారు. తాను కెటిఆర్‌ను ముఖ్యమంత్రిగా అంగీకరించబోనని, తాను కుటుంబ పాలనకు వ్యతిరేకమని చెప్పారు.

Tummala not to back KT Rama Rao as nominated CM

ముఖ్యమంత్రి పదవికి కెటిఆర్‌ను బలపరుస్తారా అని అడిగితే తాను రాజకీయాల్లో కుటుంబ వారసత్వానికి వ్యతిరేకమని తుమ్మల జవాబిచ్చారు. సమర్థత ఉంటే నిచ్చెన ఎక్కే విషయంలో ఎవరు కూడా ఎవరినీ ఆపలేరని, ఆ సమర్థత ఉంటే కెటిఆర్‌ను కూడా ఎవరూ ఆపలేరని అన్నారు.

ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో తుమ్మల నాగేశ్వర రావు ఆ వ్యాఖ్యలు చేశారు. పాలేరు శాసనసభ స్థానంలో టిఆర్ఎస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వర రావు పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన తుమ్మల నాగేశ్వర రావుకు కెసిఆర్ వెంటనే మంత్రి పదవి ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్సిగా ఎన్నికయ్యారు.

English summary
Roads minister Tummala Nageswara Rao on Friday created a stir stating that he did not support family rule in politics. He said he would stand by Chief Minister K. Chandrasekhar Rao but not back his son, minister K.T. Rama Rao, for the CM’s post if the situation arose.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X