వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీవీ 9 కేసు... హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేసిన శివాజీ

|
Google Oneindia TeluguNews

ఫోర్జరీ, నిధుల మళ్లింపు, ట్రేడ్ మార్క్ పై తప్పుడు అగ్రిమెంట్లపై కేసులతో పాటు తాజాగా లోగోల అమ్మకం, టీవీ9 యాడ్స్ ను సొంత మొబైల్ టీవీకి మళ్ళించటం వంటి అభియోగాలపై టీవీ 9 మాజీ సిఈవో రవి ప్రకాష్ మీద కేసు నమోదైంది. అలాగే టీవీ 9లో వాటాల అమ్మకం వ్యవహారంలో రవి ప్రకాష్ , శివాజీ కలిసే ఫోర్జరీకి పాల్పడ్డారని సినీనటుడు శివాజీ మీద కూడా కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇక ఈ నేపధ్యంలో టీవీ 9 వివాదంలో నడుస్తున్న కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది.

కేసీఆర్ కు మొదలైన టార్చర్ .. ఏపీని చూసైనా కళ్ళు తెరువు... కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డికేసీఆర్ కు మొదలైన టార్చర్ .. ఏపీని చూసైనా కళ్ళు తెరువు... కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి

తనపై కేసులను కొట్టివేయాలని క్వాష్ పిటీషన్ దాఖలు చేసిన శివాజీ

తనపై కేసులను కొట్టివేయాలని క్వాష్ పిటీషన్ దాఖలు చేసిన శివాజీ

ఇక రవి ప్రకాష్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. రవి ప్రకాష్‌ను కావాలనే కేసులో ఇరికించారని.. ఆయన తరపు న్యాయవాది వాదించటమే కాకుండా కేసులో కొత్త కోణాలను ప్రస్తావించారు . రవి ప్రకాష్ ఫోర్జరీకి పాల్పడ్డారని.. ఆయనకు బెయిల్ మంజూరు చేయొద్దంటూ పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించాతమే కాక ఆయన చేసిన చాట్ కు సంబంధించి స్క్రీన్ షాట్లను కోర్టు ముందు ఉంచారు . ఈ కేసు వ్యవహారం ఇలా ఉంటే.. ఇక ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్న హీరో శివాజీ హైకోర్టును ఆశ్రయించడంతో కేసు కీలక మలుపు తిరిగింది.

 షేర్ల బదిలీ సివిల్ పంచాయితీ , కావాలని క్రిమినల్ పంచాయితీ చేశారన్న శివాజీ

షేర్ల బదిలీ సివిల్ పంచాయితీ , కావాలని క్రిమినల్ పంచాయితీ చేశారన్న శివాజీ

శివాజీ మంగళవారం తెలంగాణ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇక తనకు ఫోర్జరీ వ్యవహారంతో కానీ, టీవీ9 లావాదేవీలతో కానీ ఎలాంటి సంబంధం లేదని, తనపై తెలంగాణ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని పిటిషన్‌లో కోరారు. హీరో శివాజీ రవిప్రకాష్‌, తనకు మధ్య జరిగిన షేర్ల బదిలీ సివిల్ పంచాయితీ.. దాన్ని క్రిమినల్ పంచాయితీ చేశారని గతంలోనే మాట్లాడారు .

టీవీ9 లో షేర్ల కొనుగోలు తప్ప ఫోర్జరీతో నాకు సంబంధం లేదన్న శివాజీ

టీవీ9 లో షేర్ల కొనుగోలు తప్ప ఫోర్జరీతో నాకు సంబంధం లేదన్న శివాజీ

ఇక తన పిటీషన్ లో ఏబీసీఎల్ 40వేల షేర్ల కొనుగోలు కోసం రవిప్రకాశ్‌కు గత సంవత్సరం ఫిబ్రవరి 19న రూ.20లక్షలు బ్యాంకు ద్వారా చెల్లించానని..అయితే ఎన్‌సీఎల్‌టీలో వివాదం తర్వాత షేర్లు బదిలీ చేస్తానని రవిప్రకాశ్‌ చెప్పారని శివాజీ పేర్కొన్నారు. అంతకు మించి ఈ వ్యవహారంలో తనకు ఏమీ తెలీదని, ఇక ఫోర్జరీ విషయంలోకానీ, మరే ఇతర అంశాలతో కానీ తనకు సంబంధం లేదని కనుక తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని ఆయన తన పిటీషన్ లో కోరారు. అయితే ఆయన దాఖలు చేసిన పిటీషన్ జూన్ 18 న విచారణకు రానుంది.

English summary
Actor Sivaji filed a quash petition in the High Court on Tuesday requesting it to strike down the cases filed against him by the Telangana Cyber Crime police in relation to controversy in TV9.Sivaji along with Ravi Prakash are accused by the Alanda Media, which took over TV9, of forging and fabricating documents pertaining to the company. The police particularly established the role of Sivaji by tracing the emails exchanged between him and Ravi Prakash. As a result, he is also charged with several penal sections.Despite being served notices, Sivaji failed to appear before the police to further the investigation into the charges against him. While Ravi Prakash too skipped the appearance before the police, he filed an anticipatory bail petition in the High Court. His bail plea hearing is deferred to June 18.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X