హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంచలన వ్యాఖ్యలు చేసిన రవిప్రకాశ్ ... ఇది మీడియాకు .. మాఫియాకు మధ్య యుద్ధం

|
Google Oneindia TeluguNews

ఎట్టకేలకు టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ పోలీసుల విచారణకు హాజరయ్యాడు..మంగళవారం సాయంత్రం సైబర్ క్రైమ్ పోలీసుల ముందు హాజరైన రవిప్రకాష్ ను ఏసీపీ శ్రీనివాసరావు సుమారు ఐదు గంటల పాటు విచారించారు. అయితే బుధవారం కూడా మరోసారి రవి ప్రకాష్ ను విచారణ చేయనున్నారు.. విచారణ అనంతరం బయటకు వచ్చిన రవిప్రకాష్ మీడియాతో మాట్లాడారు..

అక్రమ కేసులంటూ ఆరోపించిన రవి ప్రకాశ్

అక్రమ కేసులంటూ ఆరోపించిన రవి ప్రకాశ్


ఈ నేపథ్యంలోనే తనపై అక్రమంగా కేసులు పెట్టిన వారిపై ఫైర్ అయ్యాడు. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ధనిక వ్యాపారవేత్తలు తనని మోసగించారని అన్నారు. అనంతరం టీవీ9 ని స్వాధీనం చేసుకునేందుకు కేసులు పెట్టిన దొంగ దారిన అనేక కుట్రలు చేశారని
ఆరోపించాడు. ఇదే విషయాలను పోలీసులకు వివరించానని చెప్పాడు.వారి అక్రమాలు బయటకు రాకుండా నా పై మూడు కుట్ర కేసులు పెట్టారని అన్నారు. ఇంతకు మందే ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే మీడీయాకు వివరించానని అన్నాడు. కాగా అవన్నీ దొంగ కేసులు, కుట్ర కేసులని చెప్పాడు..

ధనికస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడతా...

ధనికస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడతా...


దీంతో తాను వ్యక్తిగతంగా ధనిక స్వామ్యానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్నారని అన్నాడు. బిల్డర్ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియాతోపాటు కాంట్రాక్టు మాఫీయాకు వ్యతిరేకంగా తాను పోరాడుతున్నట్టు తెలిపాడు. అక్రమ కేసులు బనాయించినవారు అవి బయటకు రాకుండా మీడియాను కూడ మేనేజ్ చేస్తున్నారని అన్నారు. మొత్తం ఇది సత్యానికి, అసత్యానికి, మాడీయాకు మాఫియాకు మధ్య జరుగుతున్న పోరాటమని పేర్కోన్నారు. ఈ పోరాటంలో చివరకు సత్యం గెలుస్తుందని,మీడీయా విజయం సాధిస్తుందని అన్నారు.

మరోవైపు తాను ప్రస్థుతం ఒంటరిగా పోరాటం చేస్తున్నానని అయినా పోలీసులు తనకు సహకరిస్తున్నారని అన్నారు. పోలీసులు కూడ అక్రమ కేసులపై అందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇలాంటీ అక్రమాలు జరగకుండా తాను పోరాటం చేస్తున్నానని తెలిపారు.

ముందస్తు బెయిల్‌ను తిరస్కరించిన కోర్టులు,

ముందస్తు బెయిల్‌ను తిరస్కరించిన కోర్టులు,


ఫోర్జరీ, డేటా చౌర్యం కేసుల్లో నిందితుడిగా ఉన్న రవిప్రకాశ్‌ గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్‌ తెచ్చుకోవడానికి రవిప్రకాశ్‌ తీవ్రంగా ప్రయత్నించారు. అలంద మీడియా ఇచ్చిన ఫిర్యాదు
మేరకు పోలీసులు రవిప్రకాశ్‌పై ఫొర్జరీ కేసు నమోదు చేశారు. అయితే ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్లు అటు హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టు తిరస్కరించాయి. . దీంతో ఆయన మంగళవారం సీసీఎస్‌ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

English summary
TV9's former CEO Ravi Prakash attended at the police inquiry in hyderabad .and he has been intrrogated at least five hours before the cyber crime police ACP Srinivasa Rao on tuesday. he has to attend on Wednesday also. talked to the media after the investigation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X