• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ధాన్యం కొనుగోలుపై ట్వీట్ వార్: రాహుల్ గాంధీపై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి, సీతక్క చురకలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు రగడ ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణంగా మారింది. కేంద్రంలోని బిజెపి వర్సెస్ టిఆర్ఎస్ గా ప్రస్తుతం ధాన్యం కొనుగోలు గురించి ఇరు పార్టీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంటే, మధ్యలో ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల పక్షాన పోరాటం చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ కూడా ఆందోళనకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తాజాగా రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ తో మరోమారు రచ్చ కొనసాగుతుంది.

రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గు చేటు: రాహుల్ గాంధీ ట్వీట్

తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం చివరి గింజ కొనుగోలు చేసే వరకూ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బిజెపి, టిఆర్ఎస్ ప్రభుత్వాలు నైతిక బాధ్యతనువిస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గు చేటు అని రాహుల్ గాంధీ మండిపడ్డారు. బిజెపి, టిఆర్ఎస్ ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీరైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతన్నను క్షోభపెట్టే పనులు మాని,పండించినప్రతి గింజా కొనాలంటూడిమాండ్ చేశారు.

రాజకీయ లబ్ధి కోసం నామమాత్రంగా ట్విట్టర్లో సంఘీభావం తెలపడం కాదు: ఎమ్మెల్సీ కవిత


ఇక రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ కు స్పందించిన కవిత ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ గారు రాజకీయ లబ్ధి కోసం నామమాత్రంగా ట్విట్టర్లో సంఘీభావం తెలపడం కాదని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పంజాబ్ హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరొక నీతి ఉండకూడదని టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు ప్రతిరోజు పార్లమెంటు వెల్ లోకివెళ్లి నిరసన తెలియజేస్తున్నారు అని కవిత వెల్లడించారు. పార్లమెంట్ లో టిఆర్ఎస్ ఎంపీలతో కలిసి నిరసనలకు కలిసి రావాలంటూటిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాహుల్ గాంధీపైట్వీట్ చేశారు. ఒక దేశం ఒకే సేకరణ విధానం కోసం డిమాండ్ చేయండి అంటూ ఎంపీ కవిత రాహుల్ గాంధీ కి సూచన చేశారు.

తెలంగాణ రైతుల మెడకు ఉరితాడు బిగించింది కేసీఆరే: రేవంత్ రెడ్డి

రాహుల్ గాంధీ ట్వీట్ కు కౌంటర్ ఇచ్చిన కవితపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా మాటల దాడి చేశారు. కవిత గారూ...టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో పోరాటం చేయడం లేదు... సెంట్రల్ హాల్లో కాలక్షేపం చేస్తున్నారు.ఎఫ్సీఐకి ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని 2021 ఆగస్టులో ఒప్పందంపై సంతకం చేసి తెలంగాణ రైతుల మెడకు ఉరితాడు బిగించింది కేసీఆరే అన్న విషయం మర్చిపోయారా!? అంటూ రేవంత్ రెడ్డి కవిత ను టార్గెట్ చేశారు. తెలంగాణ రైతులకు ఉరితాడుబిగించిన టిఆర్ఎస్ పార్టీ అన్న విషయం కవిత మర్చిపోయారు అంటూ ఎద్దేవా చేశారు.

అప్పుడు రైతులు గుర్తు రాలేదా? : సీతక్క చురకలు


రాహుల్ గాంధీ ట్వీట్ పై కవిత చేసిన వ్యాఖ్యలపై మండిపడిన ఎమ్మెల్యే సీతక్క రైతుల కోసం పోరాడే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు రైతులతో కలిసి నల్ల చట్టాల మీద కేంద్రం మెడలు వంచేలా చేసిన పోరాటం దేశవ్యాప్తంగా తెలుసు అని పేర్కొన్నారు. ఇప్పుడు బిజెపి, టిఆర్ఎస్ రైతులను మోసం చేస్తూఏ విధంగా డ్రామా చేస్తున్నారో తెలంగాణ ప్రజలకు గమనిస్తున్నారు అని ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. అంతేకాదు వరి విత్తనాలు అమ్మితే ఆ దుకాణం మూసి వేస్తానని అని బెదిరించిన కలెక్టరకు మీ తండ్రిగారు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించారు అంటూ ఎమ్మెల్యే సీతక్క గుర్తు చేశారు. ఇదే ఇప్పుడు ఉన్న మీ ఎమ్మెల్యేలు ఆ కలెక్టర్ కి ఓటు వేసి ఎమ్మెల్సీగా గెలిపించారు, అప్పుడు రైతులు గుర్తు రాలేదా? అని సీతక్క ఎమ్మెల్సీ కవితను సూటిగా ప్రశ్నించారు.

English summary
The tweet war over paddy purchases continues. Revanth Reddy and MLA Seethakka slammed MLC kavitha remarks on Rahul Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X