హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఖానాపూర్‌లో తెరాసకు 'డబుల్' షాక్: పూర్తిగా నింపని రేఖానాయక్, ఓ కాలమ్ ఖాళీ

|
Google Oneindia TeluguNews

నిర్మల్: ఖానాపూర్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎమ్మెల్యే అభ్యర్థి రేఖా నాయక్ నామినేషన్‌లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. నామినేషన్ పత్రాలను ఆమె పూర్తి చేయలేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో తుది నిర్ణయం కోసం రిటర్నింగ్ అధికారులు ఆమె నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్‌కు పంపించారు.

ఆమె మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఈ మూడు సెట్లలోను ఓ కాలమ్‌ను ఆమె ఖాళీగా ఉంచారు. నామినేషన్ పత్రాలు అసంపూర్తిగా ఉన్నందున నిబంధనల ప్రకారం ఆమె నామినేషన్‌ను తిరస్కరించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే కలెక్టర్ ఏం నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తెరాస నుంచి రేఖా నాయక్

తెరాస నుంచి రేఖా నాయక్

అజ్మీరా రేఖా నాయక్ ఖానాపూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. 2009లో ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున అసీఫాబాద్ జెడ్పీటీసీ సభ్యురాలిగా గెలుపొందారు. 2013లో తెరాసలో చేరి, ఉద్యమంలో పాల్గొన్నార. అనంతరం 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఖానాపూర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి రితేష్ రాథోడ్ పైన 30వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.

అంతా తారుమారు, తగ్గిన టీడీపీ.. 14వ సీటు వదిలేసిన తమ్ముళ్లు: లాస్ట్ మినిట్లో ఊహించని ట్విస్ట్‌లెన్నోఅంతా తారుమారు, తగ్గిన టీడీపీ.. 14వ సీటు వదిలేసిన తమ్ముళ్లు: లాస్ట్ మినిట్లో ఊహించని ట్విస్ట్‌లెన్నో

కలెక్టర్ నిర్ణయంపై ఉత్కంఠ

కలెక్టర్ నిర్ణయంపై ఉత్కంఠ

ఇప్పుడు రేఖానాయక్ మళ్లీ ఖానాపూర్ నియోజకవర్గం నుంచే నామినేషన్ దాఖలు చేశారు. ఖానాపూర్ ఎస్టీ రిజర్వ్డ్ స్థానంయ ఇక్కడ లంబాడీల కంటే గోండులు ఎక్కువగా ఉంటారు. గిరిజనేతరుల ఓట్లు కూడా ఇక్కడ కీలకం. తన గెలుపుపై రేఖానాయక్ ధీమాగా ఉన్నారు. కానీ అనూహ్యంగా నామినేషన్ పత్రాలు పూర్తిగా నింపకపోవడంతో చిక్కుల్లో పడ్డారు. కలెక్టర్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.

తెరాసకు మరో షాక్

తెరాసకు మరో షాక్

ఇదిలా ఉండగా, ఖానాపూర్‌లో రేఖానాయక్ నామినేషన్ పత్రాలపై సస్పెన్స్ కొనసాగుతుండగా తెరాసకు మరో షాక్ తగిలింది. ఎన్నికల సమయంలో జిన్నారం మండలంలోని తెరాసకు చెందిన 16 మంది మాజీ సర్పంచ్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్ జిన్నారం మండలంలో ప్రచారం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఏ పార్టీ నుంచి ఎవరు అంటే

ఏ పార్టీ నుంచి ఎవరు అంటే

ఖానాపూర్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ పోటీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నుంచి సత్ల అశోక్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి రమేష్ రాథోడ్ బరిలో నిలిచారు. టీఆర్ఎస్‌లో తనకు టిక్కెట్ రాకపోవడంతో రమేష్ రాథోడ్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఖానాపూర్ టిక్కెట్ దక్కించుకున్నారు.

English summary
New Twist in TRS Khanapur MLA candidate Rekha Naik nomination. It is said that she did not fill her nomination completely.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X